MJPAPBC Admissions: మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్

విజయవాడలోని మహాత్మా జ్యోతిబాపూలే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 2024-25 విద్యాసంవత్సరానికి గాను 5వ తరగతి, ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

Continues below advertisement

MJPAPBC Admission Notification: విజయవాడలోని మహాత్మా జ్యోతిబాపూలే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించే 103 బీసీ బాలికల పాఠశాలలు, 14 బీసీ జూనియర్ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను 5వ తరగతి(ఇంగ్లిష్ మీడియం), ఇంటర్మీడియట్(ఇంగ్లిష్ మీడియం) మొదటిసంవత్సరంలో ప్రవేశాలకు ఫిబ్రవరి 15న నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులు మార్చి 1 నుంచి 31 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. 5వ తరగతి ప్రవేశాలకు ఏప్రిల్ 27న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఇంటర్ ప్రవేశాలకు ఏప్రిల్ 13న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు.  

Continues below advertisement

వివరాలు..

* మహాత్మా జ్యోతిబా ఫూలే ఏపీ బీసీడబ్ల్యూ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ - 2024.    

1) 5వ తరగతి ప్రవేశాలు

అర్హత: విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 4వ తరగతి చదివి ఉండాలి. విద్యార్థులు సంబంధిత జిల్లాలోని పాఠశాలల్లో చదువుతున్న వారై ఉండాలి.     

వయసు: ఓసీ, బీసీ, ఈబీసీ విద్యార్థులు 9 నుంచి 11 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు 9 నుంచి 13 సంవత్సరాల మధ్య ఉండాలి.    

2) ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలు

అర్హత: విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో పదోతరగతి చదువుతుండాలి. 2024 మార్చిలో నిర్వహించనున్న పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది.

వయసు: 17 సంవత్సరాలకు మించకూడదు.

ఆదాయ పరిమితి: తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. లక్షకు మించరాదు.     

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.    

ఎంపిక విధానం: అర్హులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ (అనాథ/మత్స్యకార) ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.03.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 31.03.2024.

పరీక్ష తేదీ:

➥ 5వ తరగతి ప్రవేశ పరీక్ష: ఏప్రిల్ 27న (ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు) 

➥ ఇంటర్ ప్రవేశపరీక్ష: ఏప్రిల్ 13న (ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు) 

Website

ALSO READ:

TS SSC Pre Final Exams: పదోతరగతి ప్రీఫైనల్‌ పరీక్షల షెడ్యూలు విడుదల, ఎప్పటినుంచంటే?
తెలంగాణలో పదోతరగతి విద్యార్థులకు ప్రీఫైనల్ పరీక్షలు మార్చి 1 నుంచి 11 వరకు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. పరీక్షల షెడ్యూలును శుక్రవారం (ఫిబ్రవరి 9) విడుదల చేసింది. ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ పరీక్షలు జరుగుతున్నందున పదోతరగతి ప్రీఫైనల్ పరీక్షలను మధ్యాహ్నం సమయాల్లో నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఆయాతేదీల్లో మధ్యాహ్నం 1.45 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మార్చి 1న తెలుగు, మార్చి 2న హిందీ, మార్చి 4న ఇంగ్లిష్, మార్చి 5న గణితం(మ్యాథమెటిక్స్), మార్చి 6న భౌతిక శాస్త్రం(ఫిజిక్స్), మార్చి 7న జీవశాస్త్రం (బయాలజీ), మార్చి 11న సాంఘిక శాస్త్రం (సోషల్ స్టడీస్) పరీక్షలను నిర్వహించనున్నారు.
పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

Continues below advertisement