మహాత్మా జ్యోతిబాపులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్) రాష్ట్రంలోని వివిధ జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో 2023-2024 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. ఇంటర్‌లో ప్రవేశాలకు పదోతరగతి, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్ అర్హత ఉండాలి. ఇంటర్ సెకండియర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 16 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఏప్రిల్ 29న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఏప్రిల్ 20 నుంచి అందుబాటులో ఉంచనున్నారు.
వివరాలు...
* ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌జేసీ అండ్ ఆర్‌డీసీ సెట్-2023.
1) జూనియర్ కళాశాలలు (ఇంగ్లిష్ మీడియం)
కళాశాలల సంఖ్య: 255 (బాలురు-130, బాలికలు-125)
గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ ఇతర వృత్తి విద్యా కోర్సులు.
అర్హత: 10వ తరగతి/ ఎస్‌ఎస్‌సీ చదువుతున్నవారు అర్హులు.
2) డిగ్రీ కళాశాలలు (ఇంగ్లిష్ మీడియం)
కళాశాలల సంఖ్య: 14 (మహిళలు-06, పురుషులు-08)
అర్హత: ఇంటర్ సెకండియర్ చదువుతున్నవారు అర్హులు.
కోర్సుల వివరాలు..
బీఎస్సీ ఫిజికల్ సైన్సెస్: ఎంపీసీ, ఎంసీసీఎస్, ఎంఎస్‌సీఎస్, ఎంఎస్‌డీఎస్, ఎంఎస్‌ఏఐ అండ్ ఎంఎల్, ఎంపీజీ, ఎంఈఎస్ అండ్ ఎంఈసీఎస్.
బీఎస్సీ లైఫ్ సైన్సెస్: బీజెడ్‌సీ, బీజెడ్‌జీ, బీబీసీసీ, బీటీబీసీసీ, బీటీజెడ్‌సీ, ఎంబీజెడ్‌సీ, ఎంబీజెడ్‌సీ, ఎన్‌జెడ్‌సీ అండ్ ఏఎన్‌పీహెచ్‌బీసీ.
బీకామ్: జనరల్, కంప్యూటర్ అప్లికేషన్స్, బిజినెస్ అనలిటిక్స్.
బీఏ: ఈపీహెచ్, హెచ్‌పీఈ, ఐఆర్‌ఈపీ, పీపీజీఈపీ.
బీబీఏ
బీఎఫ్‌టీ
దరఖాస్తు ఫీజు: రూ.200 చెల్లించాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు...
🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:27.02.2023.
🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 16.04.2023.
🔰 హాల్‌టికెట్ల డౌన్‌లోడింగ్: 20.04.2023 నుంచి.
🔰ప్రవేశ పరీక్ష తేది:29.04.2023.
Also Read:
తెలంగాణ లాసెట్, పీజీఎల్ సెట్ షెడ్యూలు ఖరారు, పరీక్షలు ఎప్పుడంటే?
తెలంగాణలో లాసెట్, పీజీఎల్ సెట్ షెడ్యూల్ ఖరారైంది. మార్చి 1న లాసెట్, పీజీఎల్ సెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్.లింబాద్రి వెల్లడించారు. దీనికి సంబంధించిన షెడ్యూలును ఉస్మానియా యూనివర్సిటీ వీసీ డి.రవీందర్, లాసెట్ కన్వీనర్ బి.విజయలక్ష్మీతో కలిసి ఆయన విడుదల చేశారు. మార్చి 2 నుంచి ఏప్రిల్ 6 వరకు లాసెట్, పీజీఎల్ సెట్‌కు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుంతో మే 3 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మే 16 నుంచి పరీక్ష హాల్‌టికెట్లు జారీ చేయనున్నారు. మే 25న పరీక్ష నిర్వహించనున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్- 2023 నోటిఫికేషన్ వెల్లడి, పరీక్ష ఎప్పుడంటే?
భువనేశ్వర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ & రిసెర్చ్ (నైసర్), యూనివర్సిటీ ఆఫ్ ముంబయి ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ బేసిక్ సైన్సెస్ (సీఈబీఎస్) సంస్థల్లో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే 'నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (నెస్ట్) 2023' నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంటర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఫిబ్రవరి 27 నుంచి మే 17 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.1,200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది.
పరీక్ష పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..