ICET Hall Tickets: తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష టీజీ ఐసెట్‌ (Telangana ICET 2025)కు సంబంధించిన హాల్‌టికెట్లను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డులను అందుబాటులో ఉంచింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జూన్‌ 8, 9 తేదీల్లో 'టీజీఐసెట్-2025' ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్‌, పుట్టిన తేదీ, క్వాలిఫయింగ్‌ ఎగ్జామినేషన్‌ హాల్‌టికెట్‌ నంబర్‌ను నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఐసెట్ ప్రిలిమినరీ కీని జూన్ 21న విడుదల చేసి.. జూన్ 22 నుంచి 26 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. జులై 7న ఐసెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. 

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 8, 9 తేదీల్లో అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 4 షిఫ్టులలో రాష్ట్రవ్యాప్తంగా 16 ఆన్‌లైన్ కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. జూన్‌ 8, 9 తేదీల్లో ఐసెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ఉదయం 10 గంటల నుంచి 12.20 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. 

టీజీఐసెట్-2025 హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

పరీక్ష విధానం..మొత్తం 200 మార్కులకు ఐసెట్ ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 150 నిమిషాలు. పరీక్షలో మూడు సెక్షన్లు (సెక్షన్-ఎ, బి, సి) ఉంటాయి. వీటిలో సెక్షన్-ఎ: అనలిటికల్ ఎబిలిటీ-75 ప్రశ్నలు-75 మార్కులు, సెక్షన్-బి: మ్యాథమెటికల్ ఎబిలిటీ-75 ప్రశ్నలు-75 మార్కులు, సెక్షన్-సి: కమ్యూనికేషన్  ఎబిలిటీ-50 ప్రశ్నలు-50 మార్కులు ఉంటాయి. 

టీజీ ఐసెట్‌-2025 షెడ్యూలు..

➥  పరీక్ష తేదీ: 08.06.2025 - 09.06.2025.

➥  ఐసెట్ ప్రాథమిక కీ విడుదల: 21.06.2025.

➥ ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ: 22.06.2025 - 26.06.2025.

➥ ఐసెట్ 2025 ఫలితాల వెల్లడి:  07.07.2025. 

పరీక్ష సమయం:  (FN) 10.00 A.M. to 12.30 P.M & (AN) 2.30 P.M. to 5.00 P.M