Why Lightning Causes Thunder:ఆకాశంలో మెరుపులు కనిపించిన క్షణం ఆశ్చర్యపోతాం, మరో క్షణం వచ్చే ఉరుము శబ్దానికి భయపడతాం. కానీ ఆ మెరికే కాంతి వెనుకు ఎంతటి వినాశకరమైన ఉష్ణోగ్రత ఉందో తెలిస్తే విస్తుపోతారు. మనం సూర్యుడిని అత్యంత వేడికి నిదర్శనంగా చెబుతాం. అయితే ప్రకృతిలో మన కళ్ల ముందే కనిపించే పిడుగు, సూర్యుడి ఉపరితలం కంటే ఐదు రెట్లు ఎక్కువ వేడిని కలిగి ఉంటుందని సైన్స్ చెబుతోంది. అసలు ఒక పిడుగు అంత వేడిని ఎలా పుట్టిస్తుంది? అది భూమిని తాకినప్పుడు ఏం జరుగుతుంది? దీని వెనుక ఉన్న సైన్స్ సీక్రెట్స్ ఏంటో చూద్దాం. 

Continues below advertisement

పిడుగు అంటే ఏంటీ? ఎలా పుడుతుంది?

పిడుగు అనేది కేవలం కాంతి మాత్రమే కాదు. అది ఒక భారీ స్థాయి విద్యుత్ డిశ్చార్జ్‌. ఉరుములతో కూడిన మేఘాలలో, మంచు స్ఫటికాలు, వడగళ్లు ఒకదానికొకటి వేగంగా ఢీ కొంటాయి. ఆ ఘర్షణ వల్ల మేఘం దిగువ భాగంలో ప్రతికూల ఛార్జ్ ఎగువ భాగంలో, భూమిపై సానుకూల ఛార్జ్ పేరుకుపోతాయి. 

ఈ రెండు ఛార్జ్‌ల మధ్య తేడా విపరీతంగా పెరిగినప్పుడు, గాలిలోని అడ్డంకులను ఛేదించుకుంటూ ఒక భారీ విద్యుత్ ప్రవాహం భూమి వైపు లేదా మరో మేఘం వైపు దూకుతుంది. దీనినే మనం పిడుగు అంటాం. 

Continues below advertisement

సూర్యుడి కంటే వేడిగా... 

సాధారణంగా సూర్యుడి ఉపరితల ఉష్ణోగ్రత సుమారు 5500 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. కానీ ఒక పిడుగు బోల్డ్‌ తన ప్రయాణ మార్గంలో గాలిని క్షణకాలంలో 30వేల డిగ్రీల సెల్సియస్‌ వరకు వేడి చేస్తుంది. 

అంటే పిడుగు సూర్యుడి ఉపరితలం కంటే ఐదు రెట్లు ఎక్కువ వేడి అన్నమాట. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. సూర్యుడి కేంద్ర భాగంలో ఉష్ణోగ్రత 1.5కోట్ల డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఇది పిడుగు కంటే 500 రెట్లు ఎక్కువ. కాబట్టి మెరుపు సూర్యుడి ఉపరితలం కంటే వేడిగా ఉంటుంది. 

పిడుగులో అంత వేడి ఎక్కడి నుంచి వస్తుంది?

గాలి నిజానికి విద్యుత్ ప్రసరణకు మంచి మాధ్యమం కాదు. కానీ లక్షల వోల్టుల విద్యుత్ గాలి ద్వారా ప్రవహించాల్సి వచ్చినప్పుడు ఆ గాలి విపరీతమైన నిరోధకతను ప్రదర్శిస్తోంది. ఈ నిరోధకత వల్ల గాలి అణువులు విచ్చిన్నమైన, ఆ ప్రాంతం సెకనులో మిలియన్ వంతు కాలంలోనే ప్లాస్మా స్థితికి చేరుకుంటుంది. ప్లాస్మా అనేది పదార్థంలోని నాల్గో స్థితి, ఇది అత్యంత శక్తివంతమైంది. వేడిని పుట్టించేది. 

ఎక్కువ మంది చదివిన ఈ టాప్ ట్రెండింగ్‌లో వార్తలు మిస్ అవ్వొద్దు

1జపాన్‌లో చేసింది దొంగపని - పైగా పోలీసులకు లంచం ఆఫర్ - భారతీయ పర్యాటకురాలికి ఏ శిక్ష పడిందంటే?
2యూకేలో చదవాలంటే ఎంత ఖర్చవుతుంది? ఫీజులు, అద్దె, ఫుడ్ పూర్తి వివరాలు ఇవే
3జంతువులకు నెలసరి వస్తుందా? ఇది మనుషులకే పరిమితమైందా?
4బైక్ డ్రైవ్ చేసేటప్పుడు హాఫ్‌ హెల్మెట్‌ మంచిదా? ఫుల్ హెల్మెట్‌ పెట్టుకుంటే బెటరా?
5చెక్క మండిస్తే ఎరుపు రంగులో, LPG మంట నీలం రంగులో ఎందుకు ఉంటుంది? దాని వెనుక ఉన్న సైన్స్‌ ఏంటి?

ఉరుము వెనుక ఉన్న కారణం  

మెరుపు వచ్చిన కొద్ది సెకన్లకు ఉరుము శబ్దం వినిపిస్తుంది. మెరుపు వల్ల గాలి 30వేల డిగ్రీల వేడికి గురైనప్పుడు, అది ఒక్కసారిగా విస్పోటనం చెందినట్టు విస్తరిస్తుంది. ఆ వెంటనే గాలి చల్లబడి సంకోచిస్తుంది. ఈ వేగవంతమైన విస్తరణ, సంకోచం వల్ల గాలిలో ఒక శక్తివంతమైన షాక్ వేవ్ పుడుతుంది. అదే మనకు ఉరుము శబ్ధంగా వినిపిస్తుంది. 

అంత వేడిగా ఉన్నప్పుడు మంటలు చెలరేగవు ఎందుకు?

పిడుగు సూర్యుడికంటే వేడి అయినప్పటికీ, అది కేవలం మైక్రో సెకన్లు పాటు మాత్రమే ఉంటుంది. అంత తక్కువ సమయంలో వేడి ఇతర వస్తువుల్లోకి లోతుగా వెళ్లే అవకాశం ఉండదు. అందుకే పిడుగు పడిన చెట్లు కొన్నిసార్లు కాలిపోకుండా ఉంటాయి. మరికొన్నిసార్లు చెట్టు లోపల ఉన్న తేమ ఆ వేడికి ఒక్కసారిగా ఆవిరిగా మారి, ప్రెజర్‌కు చెట్టు ముక్కలైపోతుంది. 

పిడుగుల దాడికి గురవుతారని ఎలా తెలుస్తుంది?

ఒక వేళ మీరు బయట ఉన్నప్పుడు మీ జుట్టు నిక్కబొడుకుచున్నా, చర్మంపై గిలిగింతలు పెట్టినట్టు అనిపించినా, అది మీకు ప్రమాద హెచ్చరిక. మీ చుట్టూ ఉన్న గాలిలో విద్యుత్ ఛార్జ్ విపరీతంగా పెరుగుతోందని అర్థం. వెంటనే మీరు సురక్షిత ప్రాంతానికి వెళ్లాలి. 

పిడుగులు ఎప్పుడూ ఎత్తైనా వస్తువులను తాకుతాయి. చెట్లు పిడుగులను ఆకర్షిస్తాయి. అవి ధ్వంసమైన మీ మీద పడే ప్రమాదం ఉంది. కారు లోపల ఉండటం లేదా కాంక్రీట్ భవనంలో ఉండటం సేఫ్‌. ఒక వేళ మీకు ఏ ఆశ్రయం లేకపోతే భూమిపై పడుకోకుండా ,కాళ్లు దగ్గరకు పెట్టుకొని ముడుచుకొని కూర్చోండి.