TS LP CET 2024: తెలంగాణలో ఐటీఐ అర్హత ఉన్న విద్యార్థులకు పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశాలకు నిర్దేశించిన ‘లేటరల్ ఎంట్రీ ఇన్‌టూ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎల్‌పీసెట్)-2024’ నోటిఫికేషన్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి దరఖాస్తుల కోరుతోంది. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ప్రవేశ పరీక్ష ద్వారా తెలంగాణలోని పాలిటెక్నిక్/ఇన్‌స్టిట్యూషన్స్ (ప్రభుత్వ/ ఎయిడెడ్/ అన్‌ఎయిడెడ్/ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు)ల్లో రెండో సంవత్సరం డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందే అవకాశం ఉంటుంది.
వివరాలు..
* లేటరల్ ఎంట్రీ ఇన్‌టూ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎల్‌పీసెట్)-2024
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో రెండేళ్ల ఐటీఐ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ (డీఈటీ) నిర్వహించే బ్రిడ్జ్ కోర్సు పూర్తిచేసి ఉండాలి.
డిప్లొమా విభాగాలు: సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, మైనింగ్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ ఇంజినీరింగ్, ప్యాకేజింగ్ టెక్నాలజీ, టెక్స్‌టైల్ టెక్నాలజీ.
పరీక్ష ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల రూ.300 చెల్లించాలి. అభ్యర్థులు 'Secretary, SBTET, TS, Hyderabad' పేరిట డిడి తీయాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి, పరీక్ష ఫీజు నిర్ణీత మొత్తంతో డిడి తీయాలి. దరఖాస్తుకు డిడి జతచేసి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాలో సమర్పించాలి.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.
పరీక్ష కేంద్రం: గవర్నమెంట్ పాలిటెక్నిక్, మాసబ్ ట్యాంక్, హైదరాబాద్.
దరఖాస్తులు సమర్పించాల్సిన చిరునామా:
The Principal,
Govt. Polytechnic, Masabtank,
Hyderabad.
ముఖ్యమైన తేదీలు..
➥ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.03.2024.
➥ దరఖాస్తులు పొందడానికి చివరితేది: 16.04.2024.
➥ రూ.100 ఆలస్య రుసుముతో దరఖాస్తులు పొందడానికి చివరితేది: 18.04.2024.
➥ దరఖాస్తు సమర్పణకు చివరితేది: 20.04.2024.
➥ ప్రవేశ పరీక్ష నిర్వహణ తేదీ: 20.05.2024.
➥ ఫలితాల వెల్లడి: పరీక్ష ముగిసిన 12 రోజుల తర్వాత.
LPCET-2024-Detailed Notification
LPCET-2024 Students Application
ALSO READ:
TS POLYCET 2024: పాలీసెట్ అభ్యర్థులకు అలర్ట్, పరీక్ష షెడ్యూలులో మార్పు, కొత్త తేదీ ఇదే!
తెలంగాణలో పాలిసెట్ 2024 వాయిదా పడింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (TS POLYCET)ను వాయిదా వేస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ మార్చి 20న ఒక ప్రకటనలో తెలిపింది. షెడ్యూల్ ప్రకారం మే 17న పాలీసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. మే 24కి వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ, శిక్షణ మండలి కార్యదర్శి ఏ పుల్లయ్య తెలిపారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో నిర్వహించనున్న విషయం తెలిసిందే. తెలంగాణలో నాలుగో విడుతలో ఎన్నికలు జరుగనున్నాయి. నాలుగో విడతలో మే 13న లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ జరుగనుండగా.. ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగనున్నది. మే 26న నామినేషన్ల పరిశీలన, మే 29 వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చింది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.
పాలీసెట్ పరీక్ష తేదీ, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..