AP PGECET Application: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి 2024 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2024(AP PGECET) నోటిఫికేషన్‌ మార్చి 17న వెలువడిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 23న ప్రారంభమైంది. ఏప్రిల్ 20 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఇక రూ.500 ఆలస్య రుసుముతో మే 28 వరకు, రూ.2000 ఆలస్య రుసుముతో మే 5 వరకు.. చివరగా రూ.5000 ఆలస్య రుసుముతో  మే 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల సవరణకు మే 8 నుంచి 14 వరకు అవకాశం కల్పించారు. సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్‌/బీఫార్మసీ ఉత్తీర్ణత పొందిన/చివరి ఏడాది పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే గేట్‌/జీప్యాట్‌ అర్హత సాధించిన అభ్యర్థులకు వేరుగా నోటిఫికేషన్‌ విడుదలచేస్తారు. 


వివరాలు...


* ఏపీపీజీఈసెట్ - 2024


కోర్సులు: ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మ్-డి (పీబీ).


అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్‌/బీఫార్మసీ ఉత్తీర్ణత పొందినవారు దరఖాస్తుకు అర్హులు. చివరి ఏడాది పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజుగా ఓసీ అభ్యర్థులు రూ.1200, బీసీ అభ్యర్థులు రూ.900, ఎస్సీ.ఎస్టీ అభ్యర్థులు రూ.700 చెల్లించాలి.


ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.


పరీక్ష విధానం: మొత్తం  120 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్ మీడియలోనే ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో ఎలాంటి నెగెటివ్ మార్కులు ఉండవు. విద్యార్థులకు డిగ్రీ స్థాయిలో చదివిన సబ్జెక్టుల నుంచే ప్రశ్నలు ఇస్తారు. అభ్యర్థుల సౌలభ్యం కోసం మాక్ టెస్టులకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్షలో కనీసం అర్హత మార్కులను 25 శాతం అంటే 30 మార్కులుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి కనీస అర్హత మార్కులు లేవు. 


ముఖ్యమైన తేదీలు...


➥ నోటిఫికేషన్ వెల్లడి: 17.03.2024.


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.03.2024.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 20.04.2024.


➥ రూ.500 ఆలస్యరుసముతో దరఖాస్తుకు చివరితేది: 21.04.2024 - 28.04.2024.


➥ రూ.2000 ఆలస్యరుసముతో దరఖాస్తుకు చివరితేది: 29.04.2024 - 05.05.2024.


➥ రూ.5000 ఆలస్యరుసముతో దరఖాస్తుకు చివరితేది: 06.05.2024 - 12.05.2024.


➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 08.05.2024 - 14.05.2024.


➥ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 22.05.2024 నుంచి.


➥ పీజీఈసెట్ పరీక్ష తేది: 29.05.2024 - 31.05.2024 వరకు.


పరీక్ష సమయం: మొదటి సెషన్: ఉ.09.00 గం. - ఉ.11.00 గం., రెండో సెషన్: మ. 02.30 గం. . సా. 4.30 గం. వరకు.


➥  ఆన్సర్ కీ వెల్లడి: 31.05.2024 - 02.06.2024.


➥ ఆన్సర్ కీ అభ్యంతరాల స్వీకరణ: 02.06.2024 - 04.06.2024.


➥  ఫలితాల వెల్లడి: 08.06.2024.



Notification


Instruction Booklet


Online Application


ALSO READ:


ఏపీ లాసెట్, ఏపీ పీజీఎల్‌సెట్ నోటిఫికేషన్‌ విడుదల, ముఖ్యమైన తేదీలివే
ఏపీలోని న్యాయ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించి ఏపీ లాసెట్/ పీజీఎల్‌సెట్ (AP LAWCET 2024/PGLCET 2024) నోటిఫికేషన్ మార్చి 22న విడుదలైంది. దీనిద్వారా ఏపీలోని లా కాలేజీల్లో 3, 5 సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ డిగ్రీ కోర్సులు, 2 సంవత్సరాల పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ ఏడాది జూన్ 9న లాసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు మార్చి 26 నుంచి ఏప్రిల్ 25 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.
లాసెట్ నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..