APBIE Inter Fee Last Date: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ విద్యార్థుల వార్షిక పరీక్షల ఫీజు గడువును ప్రభుత్వం పొడిగించిన సంగతి తెలిసిందే. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ చదివే విద్యార్థులు డిసెంబరు 5 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. వాస్తవానికి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు నవంబరు 30తో ముగిసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ మరో 5 రోజులు గడువు పెంచుతూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు డిసెంబరు 5 వరకు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండానే ఎగ్జామ్ ఫీజులు చెల్లించవచ్చు. ఇది రెగ్యులర్, ప్రైవేటు ఇంటర్ జనరల్, ఒకేషనల్ గ్రూపుల విద్యార్థులందరికీ వర్తిస్తుంది. మరోవైపు రూ.1000 ఆలస్య రుసుంతో డిసెంబరు 15 వరకు పరీక్ష ఫీజు చెల్లించే వెసులుబాటు కల్పించారు.
పరీక్ష ఫీజు వివరాలు..
➥ ఇంటర్ ఫస్టియర్ జనరల్/ఒకేషనల్ విద్యార్థులకు: రూ.550
➥ ఇంటర్ జనరల్/ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ ఫీజు: రూ.250
➥ ఇంటర్ జనరల్/ఒకేషనల్ బ్రిడ్జి కోర్సు విద్యార్థులకు (మ్యాథమెటిక్స్ చదివే బైపీసీ విద్యార్థులకు): రూ.150.
ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు రెండూ రాసేవారికి..
➥ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ థియరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పరీక్ష ఫీజు: రూ.1100.
➥ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ ఫీజు: రూ.500.
➥ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ జనరల్/ఒకేషనల్ బ్రిడ్జి కోర్సు విద్యార్థులకు (మ్యాథమెటిక్స్ చదివే బైపీసీ విద్యార్థులకు) పరీక్ష ఫీజు: రూ.300.
➥ ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలకు హాజరయ్యేవారికి పరీక్ష ఫీజు: ఆర్ట్స్ గ్రూప్-రూ.1240, సైన్స్ గ్రూప్-రూ.1,440.
విద్యార్థులకు 'స్టడీ అవర్స్'..
ఏపీలోని ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సాయంత్రం స్టడీ అవర్ నిర్వహించాలని ఇంటర్ విద్యామండలి కార్యదర్శి సౌరబ్ గౌర్ అక్టోబరు 2న ఆదేశాలు జారీ చేశారు. ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు విద్యార్థులను చదివించాలని, ఆ సమయంలో విద్యార్థుల హాజరు నమోదు చేసి జిల్లా వృత్తివిద్యాధికారులకు పంపించాలని సూచించారు. సోమవారం నుంచి శనివారం వరకు ఏ రోజు ఏ సబ్జెక్టు చదివించాలనే వివరాలు సైతం తెలిపారు.
ALSO READ:
జేఈఈ అడ్వాన్స్‌డ్ దరఖాస్తు ఫీజు పెంపు, కేటగిరీల వారీగా ఫీజు వివరాలు ఇలా
జేఈఈ అడ్వాన్స్‌డ్ దరఖాస్తు ఫీజును అధికారులు మరోసారి పెంచారు. ఇలా ఫీజులు పెంచడం వరుసగా ఇది రెండోసారి. గతేడాది దరఖాస్తు ఫీజు అమ్మాయిలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1450 ఉండేది. అయితే దాన్ని ప్రస్తుతం రూ.1600లకు, ఇతరులకు రూ.2,900 నుంచి రూ.3,200కి పెంచినట్లు ఐఐటీ మద్రాస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ సారి కూడా బాలికలకు 20 శాతం సీట్లు సూపర్‌న్యూమరరీ కోటా కింద కేటాయించనున్నారు. జేఈఈ మెయిన్‌లో కటాఫ్ మార్కులు పొంది ఉత్తీర్ణులైన 2.50 లక్షల మందే అడ్వాన్స్‌డ్ రాయడానికి అర్హులు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఏటా సుమారు 40 వేల మంది అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత సాధిస్తూ వస్తున్నారు.
జేఈఈ అడ్వాన్స్‌డ్ - 2024 నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..