డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్‌కు వెబ్ ఆప్షన్ల నమోదును జులై 30 వరకు ఉన్నత విద్యామండలి పొడిగించింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1.28లక్షల మంది నమోదు చేసుకున్నారు. ప్రవేశాలు తక్కువగా ఉన్నందున ఈ మేరకు పొడిగించింది. ఇప్పటివరకు ఆప్షన్లు నమోదుచేయలేకపోయిన విద్యార్థులకు ఇదే చివరి అవకాశమని అధికారులు స్పష్టంచేశారు.


ఏపీలో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌(OAMDC)ను ఏపీ ఉన్నత విద్యామండలి జూన్ 18న విడుదల చేసింది. దీనిద్వారా 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ/ఎయిడెడ్/ప్రైవేటు అన్ఎయిడెడ్/అటానమస్ డిగ్రీ కాలేజీల్లో సాధారణ డిగ్రీ కోర్సుల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్, బీఎఫ్‌ఏ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. డిగ్రీ ప్రవేశాలకు OAMDC రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 19 నుంచి జూన్ 24 వరకు కొనసాగింది. విద్యార్థులు జూన్ 21 నుండి 23 వరకు స్పెషల్‌ కేటగిరీ అభ్యర్థులకు సర్టిఫికేట్ల పరిశీలన చేపడతారు. తదనంతరం జూన్ 26 నుండి 30 వరకు వెబ్‌ అప్షన్లకు అవకాశం కల్పించారు. ప్రవేశాలు తక్కువగా ఉండటంతో వెబ్‌ఆప్షన్ల నమోదు గడువును పొడించారు. 


WEBSITE


ఫీజుల ఖరారు ఆలస్యంతో వాయిదా...
ఏపీలో డిగ్రీ కాలేజీ కోర్సుల్లో అడ్మిషన్ కౌన్సెలింగ్ గతంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఫీజులు ఖరారు కాకపోవడంతో పాటు ఖాళీలకు తగ్గట్టుగా దరఖాస్తులు రాకపోవడంతో కౌన్సెలింగ్ తేదీలను వాయిదా వేస్తూ వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కోర్సుల్లో 3.5లక్షల సీట్లు అందుబాటులో ఉంటే వాటిలో ప్రవేశాల కోసం 1.25 లక్షల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పడిపోవడంతో కౌన్సెలింగ్ గడువును ఉన్నత విద్యామండలి అప్పట్లో వాయిదా వేసింది. మొదటి షెడ్యూల్‌ గడువు పొడిగించిన ఉన్నత విద్యా మండలి మళ్లీ దానిని పొడిగించింది. తొలి షెడ్యూల్ ప్రకారం జూన్ 26 నుంచి విద్యార్ధులు వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవాల్సి ఉంది. పలు కారణాలతో ఉన్నత విద్యామండలి గతంలో ఒకసారి దీనిని పొడిగించింది. పొడిగించిన గడువు జులై 6తో ముగియాల్సి ఉండగా.. మళ్లీ దీన్ని జులై 12 వరకు పెంచింది. జులై 12 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. జులై 15 నుంచి 19 మధ్య వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించింది. తాజాగా మరోసారి వెబ్‌ఆప్షన్ల గడువును జులై 30 వరకు పొడిగించింది. అదే రోజు తరగతులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 


డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లకు దర ఖాస్తుల సంఖ్య భారీగా పడిపోవడం ఒకటైతే, ఇప్పటికీ కోర్సులు ఫీజులు నిర్ణయించకపోవడం మరో కారణంగా చెబుతున్నారు. డిగ్రీ ఫీజులపై ఉన్నత విద్యా కమిషన్ నెల కిందటే ప్రతిపాదనలు పంపినా , దానిపై ప్రభుత్వం ఇప్పటి ఉత్తర్వులు జారీ చేయలేదు. విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకునే సమయానికి ఏ కాలేజీలో, ఏ కోర్సుకు ఎంత ఫీజు అనేది చూపించాల్సి ఉంటుంది. ప్రభుత్వం కాలేజీ ఫీజులను తేల్చకపోవడంతో కౌన్సెలింగ్ వాయిదా పడుతోంది. మరోవైపు డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లకు ఆశించిన స్థాయిలో రాని దరఖాస్తులు రాలేదు.


రాష్ట్ర వ్యాప్తంగా 3.5 లక్షల డిగ్రీ సీట్లు అందుబాటులో ఉంటే లక్షా 25వేల మంది విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. మొదటి షెడ్యూలు నాటికి కేవలం 80 వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఈ గడువును పొడిగించడంతో మరో 45వేల మంది మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ గడువు పొడిగిం చడంతో ఇంకా కొత్త దరఖాస్తులు వస్తాయని ఉన్నత విద్యామండలి ఎదురుచూస్తోంది. ఈ ఏడాది ఇంజనీరింగ్ కంటే ముందే డిగ్రీ షెడ్యూలు ఇవ్వడంతో ఇంజనీరింగ్‌ కోర్సులకు వెళ్లే ఆలోచన ఉన్నవారు కూడా డిగ్రీకి దరఖాస్తు చేసుకు న్నారు. ఇంజనీరింగ్ లో మంచి సీటు రాకపోతేనే వారు డిగ్రీలో చేరతారు. సింగిల్ మేజర్ విధానంపై కసరత్తు చేస్తున్న ఉన్నత విద్యామండలి అధికారికి అదనపు బాధ్యతలు అప్పగించడం కూడా దరఖాస్తులు పడిపోవడానికి కారణమని చెబుతున్నారు. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..