Kendriya vidyalaya Admissions 2024 - 25: కేంద్రీయ విద్యాలయాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఒకటో తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన లాటరీ ప్రక్రియ ద్వారా విద్యార్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. కేవీల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 1 నుంచి 15 వరకు దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా లాటరీ ప్రక్రియ నిర్వహించి విద్యార్థులను ఎంపికను మొదలుపెట్టారు. ఇందులో భాగంగా 'అప్లికేషన్ స్టేటస్' ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 

ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్నవారు లాగిన్ వివరాలు నమోదుచేసి, ఎంపిక చేసుకున్న ఏదైనా మూడు కేవీల్లో తమ లాటరీ నంబర్‌తోపాటు పాఠశాలల వారీగా వెయిటింగ్ లిస్ట్ వివరాలను చెక్ చేసుకోవచ్చు. ఈ వివరాలు లాటరీ తర్వాత వారి అప్లికేషన్‌ స్టేటస్‌కు సంబంధించిన సమాచారం మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంతేకాని పాఠశాలల్లో ప్రవేశాలకు నిర్ధారణ మాత్రం కాదని కేంద్రీయ విద్యాలయ సంగతన్ స్పష్టంచేసింది. ధ్రువపత్రాల పరిశీలన తర్వాత నిర్ణయించిన విధివిధానాల ప్రకారం దరఖాస్తుదారుల అడ్మిషన్ స్టేటస్‌ను సంబంధిత పాఠశాలలు నిర్ణయిస్తాయి. అయితే తుది ఎంపిక జాబితాలు, ఇతర వివరాల కోసం సంబంధిత పాఠశాలలను సంప్రదించాల్సి ఉంటుంది. 

కేంద్రీయ విద్యాలయాల్లో 1 నుంచి 11వ తరగతి వరకు ప్రవేశాల కోసం కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) మార్చి నెలాఖరులో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఒకటో తరగతిలో ప్రవేశాలు కోరువారు చిన్నారుల వయసు 31.03.2024 నాటికి 6 సంవత్సరాలు పూర్తికావాల్సి ఉంటుంది. కేవీల్లో 11వ తరగతి మినహా మిగతా తరగతులన్నింటిలో అడ్మిషన్లకు జూన్ 29 తుది గడువుగా నిర్ణయించారు. కేవీ విద్యార్థులు 11వ తరగతి ప్రవేశాలకు రిజిస్ట్రేషన్లు పదో తరగతి ఫలితాలు వెల్లడైన తర్వాత పది రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. 20 రోజుల్లోపు ఎంపికైన వారి జాబితాను ప్రకటిస్తారు. కేవీ విద్యార్థుల ఎంపిక పూర్తయిన తర్వాత నాన్ కేవీ విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. దరఖాస్తు సమయంలో తప్పుడు సమాచారం ఇస్తే సీటు ఇవ్వబోమని కేవీఎస్ స్పష్టం చేసింది.  

అప్లికేషన్ స్టేటస్‌ కోసం క్లిక్ చేయండి..

అధికారిక వెబ్‌సైట్

ముఖ్యమైన తేదీలు...

➥ షెడ్యూలు వెల్లడి: 28.03.2024.

➥ నోటిఫికేషన్ వెల్లడి: 31.03.2024.

➥ క్లాస్-1 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 01.04.2024. (ఉ.10.00 గం. నుంచి)

➥ క్లాస్-1 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేది: 15.04.2024. (సా. 7.00 గం. వరకు)

➥ ఎంపిక జాబితా వెల్లడి: 19.04.2024(లిస్ట్-1), 29.04.2024(లిస్ట్-2), 08.05.2024(లిస్ట్-3).

సెకండ్ నోటిఫికేషన్ (ఎక్స్‌టెండెడ్ తేదీ): 

➥  నోటిఫికేషన్-2 (ఎక్స్‌టెండెడ్): 07.05.2024

➥ రిజిస్ట్రేషన్: 08.05.2024- 15.05.2024

➥ ఎంపికజాబితా వెల్లడి: 22.05.2024 - 27.05.2024.

* క్లాస్-2, ఆపై తరగతులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం (క్లాస్-11 మినహాయించి): 01.04.2024 - 10.04.2024. 

➥ ఎంపిక జాబితా వెల్లడి: 15.04.2024.

➥ ప్రవేశాలు: 16.04.2024- 29.04.2024.

➥ ప్రవేశాలు పొందడానికి చివరితేది: 29.06.2024

➥ క్లాస్-11 (కేవీ విద్యార్థులు) రిజిస్ట్రేషన్: పదోతరగతి ఫలితాలు వెల్లడైన 10 రోజుల తర్వాత నుంచి.

➥ కేవీ క్లాస్-11 ఎంపిక జాబితా: పదోతరగతి ఫలితాలు వెల్లడైన 20 రోజుల తర్వాత నుంచి.

➥క్లాస్-11 (నాన్-కేవీ విద్యార్థులు) రిజిస్ట్రేషన్, ఎంపిక జాబితా, ప్రవేశాలు: కేవీ విద్యార్థులు ప్రవేశ ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఇతర విద్యార్థులకు ప్రవేశాలకు కల్పిస్తారు.

➥ క్లాస్-11లో ప్రవేశాలు పొందడానికి చివరితేది: పదోతరగతి ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి 30 రోజుల వరకు.  

KVS Admission Schedule 2024-2025- Class One & Above

KVS Admission Schedule 2024-2025- Balvatika

KVS Admission Notice 2024-2025- Class One (01) & Above

KVS Admission Notice 2024-2025- Balvatika

 KVS Admission Guidelines 2024-2025

Online Portal

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..