కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ తొలి విడత కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను ఆగస్టు 3న విడుదల చేసింది. ఎంబీబీఎస్ ప్రవేశాలకు వెబ్‌ఆప్షన్ల నమోదుకు సంబంధించిన వివరాలను నోటిఫికేషన్‌లో వెల్లడించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 4 నుంచి 6 వరకు వెబ్‌కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
ఆగస్టు 4న ఉదయం 6 గంటలకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఆగస్టు 6న సాయంత్రం 6 గంటల వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఎంబీబీఎస్ వెబ్‌కౌన్సెలింగ్‌లకు సంబంధించి కాళోజీ వర్సిటీ విడుదల చేసిన అభ్యర్థుల మెరిట్ జాబితాలో ఎంపికైన విద్యార్థులు వెబ్‌కౌన్సెలింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. మెరిట్ జాబితాలో పీడబ్ల్యూడీ, పీఎండీ, క్యాప్, ఈడబ్ల్యూఎస్ కోటా అభ్యర్థులందరూ పాల్గొనవచ్చు.
ఎంబీబీఎస్ సీట్లు పొందిన విద్యార్థులు యూనివర్సిటీ ఫీజు కింద రూ.12,000 చెల్లించి సీటు కేటాయింపునకు సంబంధించిన 'అలాట్‌మెంట్ లెటర్' పొందాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారానే ఫీజు చెల్లించాలి. ఇక ట్యూషన్ ఫీజు కింద ప్రభుత్వ కళాశాలలో సీటు పొందిన విద్యార్థులు రూ.12,000 చెల్లించాలి. ఇక ప్రైవేటు నాన్ మైనారిటీ/మైనారిటీ/ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజీల్లో అయితే రూ.60,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
సందేహాల పరిష్కారానికి హెల్ప్‌లైన్ సేవలు..
➥ వెబ్‌కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యార్థులకు ఏమైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే 9392685856, 7842542216, 9059672216 ఫోన్ నెంబర్లలో, లేదా ఈమెయిల్: tsmedadm2023@gmail.com ద్వారా సంప్రదించవచ్చు.
➥నిబంధలనలకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే 9490585796, 7901098840 ఫోన్ నెంబర్లలో, లేదా ఈమెయిల్: knrugadmission@gmail.com ద్వారా సంప్రదించవచ్చు.
➥ ఫీజు చెల్లింపు సమయంలో సమస్యలు ఎదురైతే 9959101577 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు.
➥ నిర్దేశిత తేదీల్లో ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు మాత్రమే హెల్ప్‌లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి.
MBBS MINORITY COLLEGES SEAT MATRIX
ALSO READ:
ఎంపీసీ విద్యార్థులకు 'స్పెషల్ కౌన్సెలింగ్' ద్వారా ఫార్మసీ సీట్ల కేటాయింపు
తెలంగాణలో రెండు విడతల ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 2తో ముగిసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 4 నుంచి చివరివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఆ తర్వాత ఆగస్టు 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ మొదలుకానుంది. ఈ కౌన్సెలింగ్ ద్వారా ఇంటర్ ఎంపీసీ విద్యార్థులు బీఫార్మసీ, ఫార్మా-డి కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. సాధారణంగా ఏటా ఎంసెట్ చివరి విడత కౌన్సెలింగ్‌లో వారికి సీట్లు కేటాయిస్తూ వస్తున్నారు. ఈసారి చివరి విడత తర్వాత ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌లో అవకాశం ఇచ్చేలా మార్పు చేశారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ఆగస్టు 4 నుంచి ఎంసెట్ చివరి విడత కౌన్సెలింగ్, పూర్తి షెడ్యూలు ఇలా
తెలంగాణలో ఎంసెట్ చివరి విడత కౌన్సెలింగ్ ఆగస్టు 4 నుంచి ప్రారంభంకానుంది. ఆగస్టు 5న సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ఆగస్టు 9న విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు. ఈసారి ప్రత్యేక విడత పేరిట కమిటీ నిర్ణయం మేరకు నిర్వహించనున్న మరో కౌన్సెలింగ్ ఆగస్టు 17న ప్రారంభం కానుంది. ఈ కౌన్సెలింగ్ కోసం ఆగస్టు 17న స్లాట్ బుకింగ్, ఆగస్టు 18న ధ్రువపత్రాల పరిశీలన, ఆగస్టు 17 నుంచి 19 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఇవ్వనున్నారు. ఇక ఆగస్టు 23న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 23 నుంచి 25 వరకు నిర్ణీత ట్యూషన్ ఫీజు చెల్లించి సంబంధిత కళాశాలల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..