తెలంగాణలో పీజీ డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నవంబరు 3న కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్‌ దంత కళాశాలల్లో ఎండీఎస్‌ యాజమాన్యకోటా సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా నవంబరు 4, 5 తేదీల్లో మొదటి విడత వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు.


నవంబరు 4న ఉదయం 10 గంటల నుంచి నవంబరు 5న మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారీగా వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియ పూర్తిచేసి ఇప్పటికే మెరిట్‌ జాబితాను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. జాబితాలో అర్హులైన అభ్యర్థులు కళాశాల వారీగా వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. కళాశాల వారీగా సీట్ల వివరాలను వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. 


MDS ADMISSIONS UNDER MANAGEMENT QUOTA 2022-23- MDS SEAT MATRIX


MDS ADMISSIONS UNDER MANAGEMENT QUOTA 2022-23- NOTIFICATION FOR EXERCISING WEB-OPTIONS FOR FIRST PHASE COUNSELLING


MDS ADMISSIONS 2022-23 UNDER MANAGEMENT QUOTA- CORRIGENDUM TO THE PROVISIONAL FINAL MERIT LIST AFTER VERIFICATION OF UPLOADED CERTIFICATES



వివిధ కోర్సుల మెరిట్ జాబితాలు విడుదల..

కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వివిధ కోర్సులకు సంబంధించి అభ్యర్థుల మెరిట్ జాబితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. వీటిలో బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బేసిక్ నర్సింగ్, బీపీటీ కోర్సులకు సంబంధించిన జాబితాలు ఉన్నాయి.  
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..



Also Read:


క్రాఫ్ట్స్ & డిజైనింగ్ కోర్సుల్లో ప్రవేశాలు, ఐఐసీడీ నోటిఫికేషన్ జారీ!!
ఇండియన్  ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్ (ఐఐసీడీ) 2023 విద్యాసంవత్సరానికి గాను వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. దీని ద్వారా బీ.డిజైన్, ఎం.డిజైన్, ఎం.వొకేషన్ కోర్సుల్లో సీట్ల భర్తీ చేయనున్నారు. కోర్సుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. డిగ్రీ కోర్సులకు ఇంటర్ అర్హత ఉండాలి. పీజీ కోర్సులకు సంబంధి విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సరైన అర్హతలున్న అభ్యర్ధులు జనవరి 21లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


'ఫ్యాషన్' కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు ప్రారంభం- చివరితేది ఎప్పుడంటే?
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ప్రవేశాలకు నిర్దేశించిన 'NIFT-2023' రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబరు 1న ప్రారంభమైంది. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబరు 31 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.3000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1500 చెల్లిస్తే సరిపోతుంది. 
నోటిఫికేషన్, కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..