తెలంగాణలోని ప్రైవేట్‌ డెంటల్‌ కాలేజీల్లో యాజమాన్య కోటా కింద బీడీఎస్ ప్రవేశాలకు సంబంధించిన మాప్ అప్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను కాళోజీ వైద్య, ఆరోగ్య విశ్వవిద్యాలయం డిసెంబరు 19న విడుదల చేసింది. డిసెంబరు 19, 20 తేదీల్లో వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. రెండో విడత అనంతరం ఖాళీగా ఉన్న సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. కళాశాల వారిగా సీట్ల ఖాళీల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.


అభ్యర్థులు డిసెంబరు 19న సాయంత్రం 4 గంటల నుంచి డిసెంబరు 20న సాయంత్రం 4 గంటల వరకు అభ్యర్థులు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు కాలోజీ వైద్య, ఆరోగ్య విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో సంప్రదించాలని యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. సీట్లు పొందిన విద్యార్థులు యూనివర్సిటీ ఫీజు కింద కేటీగిరి-బి అభ్యర్థులు రూ.20,000; కేటగిరి-సి(ఎన్‌ఆర్ఐ) అభ్యర్థులు రూ.40,000 చెల్లించాల్సి ఉంటుంది. 


Counselling Website



Also Read:


CLAT Answer Key: క్లాట్-2023 ఆన్సర్ కీ విడుదల, అభ్యంతరాలకు అవకాశం!
దేశ‌వ్యా‌ప్తంగా ఉన్న నేషనల్‌ లా యూనివర్సిటీల్లో బీఏ ఎల్‌‌ఎ‌ల్‌బీ, ఎల్‌‌ఎ‌ల్‌ఎం కోర్సుల్లో ప్రవే‌శాల కోసం డిసెంబరు 18న నిర్వహించిన కామన్ లా అడ్మిషన్ టెస్ట్ 'క్లాట్-2023' ఆన్సర్ కీని కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ విడుదల చేసింది. ఆన్సర్ కీతోపాటు పరీక్ష మాస్టర్ క్వశ్చన్ పేపర్‌ను కూడా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. క్లాట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ సమాధానాలు సరిచూసుకోవచ్చు.ఆన్సర్ కీపై ఏమైనా సందేహాలుంటే అభ్యంతరాలు తెలపవచ్చు. ఆన్సర్ కీపై అభ్యంతరాలను డిసెంబరు 20న ఉదయం 9 గంటల్లోగా అభ్యంతరాలు తెలపాల్సి ఉంటుంది. ఇందుకోసం ఒక్కో  ప్రశ్నకు రూ.1000 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించిన అభ్యంతరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. 
ఆన్సర్ కీ, అభ్యంతరాల నమోదుచేయడానికి క్లిక్ చేయండి..


విద్యార్థులకు 'ట్యాబ్‌'లు! జీవో జారీచేసిన ఏపీ ప్రభుత్వం! పంపిణీ ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్నవిద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబరు 21న అధికారికంగా లాంచ్ చేయనున్నారు. డిసెంబరు 22 నుంచి 28 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో  8వ తరగతి చదువుతున్న 4 లక్షల 59 వేల 64  (4,59,564) మంది విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు. వీరితోపాటు 59,176 మంది ఉపాధ్యాయులకు కూడా ట్యాబ్‌లు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు డిసెంబరు 17న ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీచేసింది.
జీవో పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 


ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఉచితంగా ఇంటికే ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు!
 ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను నేరుగా వారి ఇళ్లకే పంపించేందుకు రంగం సిద్ధం చేసింది. దరఖాస్తు చేయకపోయినా పది, ఇంటర్ చదివే విద్యార్థులకు సర్కారే ఈ సర్టిఫికెట్లను అందించనుంది. ఆదాయం, కుల ధ్రువీకరణ పత్రాలు స్కాలర్ షిప్, మోడల్ స్కూల్లు, వేరే ఇతర పాఠశాల్లో చేరాలన్న చాలా అవసరం. అయితే మాడేళ్ల క్రితం వరకు వీటిని దరఖాస్తు చేసుకోవాలంటే నానా తిప్పలు పడేవారు. పట్టాణాలకో, మండల కేంద్రాలకో వెళ్లి మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేయాలి. ఒక్క ధ్రువీకరణ పత్రానికి 40 రూపాయల నుంచి 50 రూపాయల వరకు చెల్లించాల్సి వచ్చేది. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..