తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ దంత కళాశాలల్లో కన్వీనర్‌ కోటా బీడీఎస్‌ ప్రవేశాలకు మాప్‌ ఆప్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ను కాళోజీ నారాయణరావు వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం (డిసెంబరు 13న) విడుదల చేసింది. రెండో విడత అనంతరం ఖాళీగా ఉన్న సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. సీట్ల ఖాళీల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. డిసెంబరు 14న సాయంత్రం 5 గంటల నుండి 15వ తేది సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్ధులు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌‌లో చూడవచ్చని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.


వెబ్‌ఆప్షన్ల నమోదుకు క్లిక్ చేయండి..


ఎంబీబీఎస్ 'మేనేజ్‌మెంట్' రేపే ఆఖరు..
తెలంగాణలో మిగిలిపోయిన ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి డిసెంబరు 14న  వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ఏంబీబీఎస్ యాజమాన్య  కోటా  సీట్లకు  ఇప్పటికే  రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తి అయింది. యాజమాన్యకోటలో  మిగిలిపోయిన ఖాళీలను ఈ మాప్ అప్ రౌండ్ ద్వారా భర్తీ చేయనున్నారు. డిసెంబరు 13న మధ్యాహ్నం 2 గంట‌ల  నుంచి  డిసెంబరు 14న మధ్యాహ్నం   2 గంట‌ల  వ‌ర‌కు వెబ్ ఆఫ్షన్లును నమోదు చేసుకోవాలి.


వెబ్ఆప్లన్లు నమోదుకు క్లిక్ చేయండి..


 


Read Also:


డిగ్రీ పరీక్ష విధానంలో సమూల మార్పులు..
డిగ్రీ పరీక్ష విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. పీహెచ్‌డీలో విద్యార్థులు పరిశోధనపై ప్రజెంటేషన్ ఇచ్చినట్లుగానే.. డిగ్రీలోనూ అలాంటి విధానాన్నే ప్రవేశపెట్లే యోచనలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి సమాలోచనలు చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీలో పరీక్షలు, మూల్యాంకన విధానాన్ని మార్చాలని భావిస్తోంది. కొత్త విధానం రూప కల్పన బాధ్యతలను ISBకి అప్పగించింది. ఈ మేరకు ఇవాళ ISB, యూనివర్సిటీల వీసీలతో ఉన్నత విద్యామండలి సమావేశమైంది. ప్రస్తుత పద్ధతులు, తీసుకురావాల్సిన మార్పులపై చర్చించారు. పరీక్ష విధానంలో మార్పులు విద్యార్థి హితంగా ఉండాలని నిర్ణయించారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


నాలుగేళ్లు చదివితేనే ఆనర్స్ డిగ్రీ, యూజీసీ నిబంధనలివే!
నూతన విద్యావిధానంలో భాగంగా ప్రవేశపెట్టిన ఆనర్స్ డిగ్రీని నాలుగేళ్ల కోర్సుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రకటించింది. నాలుగో ఏడాది స్పెషలైజేషన్ కు కేటాయిస్తున్నట్లు తెలిపింది. అయితే, మూడేళ్ల ఆనర్స్ డిగ్రీ కూడా ఉంటుందని వివరించింది. నాలుగేళ్లు లేదా మూడేళ్లు.. ఆనర్స్ లో ఏ డిగ్రీ కోర్సును ఎంచుకోవాలనే చాయిస్ విద్యార్థులదేనని పేర్కొంది. కాగా, నాలుగేళ్ల డిగ్రీ కోర్సును పూర్తిచేసిన విద్యార్థులకు మాత్రమే ఆనర్స్ డిగ్రీని ప్రదానం చేయనున్నట్లు యూజీసీ స్పష్టం చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


వెబ్‌సైట్‌లో 'క్లాట్' అడ్మిట్ కార్డులు, 17 వరకు అప్లికేషన్ ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోడానికి అవకాశం!
దేశవ్యాప్తంగా ఉన్న 22 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ, పీజీ లా కోర్సుల్లో ప్రవేశానికి 'కామ‌న్ లా అడ్మిష‌న్ టెస్ట్ (క్లాట్)-2023' ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ అధికారులు విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచారు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబరు 18న క్లాట్-2023 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు డిసెంబరు 17న రాత్రి 11.59 గంటలలోపు ప్రవేశ ప్రాధాన్యాలను (అడ్మిషన్ ప్రిఫరెన్సెస్) నమోదుచేయాల్సి ఉంటుంది. 
అడ్మిట్ కార్డు, అడ్మిషన్ ప్రిఫరెన్స్ కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..