ప్రైవేట్ వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లకు వెబ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్‌ను కాళోజీ నారాయణరావు వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం నవంబరు 10న విడుదలచేసింది. నవంబరు 11న ఉదయం 6 గంటల నుంచి 12న సాయంత్రం 4 గంటల వరకు అభ్యర్దులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. సీట్ల ఖాళీల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ప్రాధాన్యతక్రమంలో కళాశాల వారీగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి.
NOTIFICATION FOR EXERCISING WEB-OPTIONS FOR FIRST PHASE OF COUNSELING
ఫీజు వివరాలు ఇలా...
సీట్లు పొందిన విద్యార్థులు యూనివర్సిటీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. బి-కేటగిరీ కింద ఎంబీబీఎస్ విద్యార్థులు రూ.40,000, బీడీఎస్ విద్యార్థులు రూ.20,000 చెల్లించాలి. ఇక సి-కేటగిరీ (NRI) కింద ఎంబీబీఎస్ విద్యార్థులు రూ.70,000, బీడీఎస్ విద్యార్థులు రూ.30,000 చెల్లించి సీటు అలాట్‌మెంట్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రభుత్వ నిబంధనల ప్రకారం ట్యూషన్ ఫీజు చెల్లించాలి.
:: Also Read ::
స్వదేశం నుంచే 'విదేశీ విద్య'- కార్యాచరణ సిద్ధం చేసిన యూజీసీ!
విదేశాల్లో విద్యాభ్యాసం కోరుకునే విద్యార్థులకు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గుడ్ న్యూస్ తెలిపింది. భారతీయ విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదవడం ఆనవాయితీ.. అయితే ఇప్పుడు విదేశీ విద్యనే భారతీయ విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది యూజీసీ. ఈ మేరకు భారత్‌కు చెందిన విద్యా సంస్థలతో కలిసి పనిచేసేందుకు 49 విదేశీ విశ్వవిద్యాలయాలు ముందుకొచ్చాయి. త్వరలో ఆయా యూనివర్సిటీలు టై-అప్ కానున్నాయని యూజీసీ హెచ్ ఎం జగదీశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
విద్యార్థులకు గుడ్ న్యూస్, పీజీ లేకున్నా 'పీహెచ్‌డీ'లో చేరొచ్చు - ఎలాగంటే?
మీరు బీటెక్, బీఈ, బీ ఫార్మసీ, డిగ్రీ (నాలుగేళ్లు) లాంటి కోర్సులు చేశారా.? వీటి తర్వాత పీజీ కాకుండా డైరెక్ట్‌గా పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నారా.? మరి అదెలాగని ఆలోచిస్తున్నారా.. అయితే టెన్షన్ పడకండి.. విద్యార్ధులకు ఓ గుడ్ న్యూస్. యూనివర్సీటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) పీహెచ్‌డీ కోర్సుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు చదవకున్నా.. పీహెచ్‌డీ చేసే అవకాశం పొందొచ్చు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
NEET PG: నీట్-పీజీ 2023 పరీక్షే చివరిది! మరి 'నెక్ట్స్' ఏంటంటే?
వైద్యవిద్యలో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్-పీజీ పరీక్షకు కేంద్రప్రభుత్వం రద్దుచేయనుంది. ఇప్పటికే ప్రకటించిన నీట్-పీజీ 2023 పరీక్షే చివరిది అని అధికారులు తెలిపారు. నీట్-పీజీ స్థానంలో నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (NExT-నెక్ట్స్) నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. 2020లో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) చట్టానికి సవరణలు చేసిన కేంద్రప్రభుత్వం, నీట్-పీజీ స్థానంలో నెక్ట్స్ నిర్వహించాలని నిర్ణయించింది. మొదటి నెక్ట్స్ 2023 డిసెంబర్‌లో నిర్వహించనున్నారు. 2019-20 బ్యాచ్ ఎంబీబీఎస్ విద్యార్థులు 'NExT' రాసే మొదటి బ్యాచ్ కానున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..