పీజీ డెంటల్ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. బుధవారం విడుదల చేసిన నోటిఫికేషన్ ఆధారంగా నవంబర్10న రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఎండీఎస్ యాజమాన్య కోటా సీట్లను భర్తీ చేయనున్నారు.
అర్హతలు కలిగిన అభ్యర్థులు నవంబరు 10న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రాధాన్యతాక్రమంలో కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్‌లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఖాళీ సీట్ల వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపర్చామని, మరింత సమాచారం కోసం వెబ్‌సైట్‌ని పరిశీలించవచ్చని అధికారులు తెలిపారు.
Notification
వెబ్‌ఆప్షన్స్ కోసం క్లిక్ చేయండి.
ఫీజు వివరాలు ఇలా...
సీట్లు పొందిన విద్యార్థులు యూనివర్సిటీ ఫీజు కింద ఆన్‌లైన్ గేట్ వే (డెబిట్/క్రెడిట్ కార్డు/నెట్ బ్యాంకింగ్) ద్వారా రూ.49,600 చెల్లించి సీటు అలాట్‌మెంట్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్నారై అభ్యర్థులు రూ.69,600 చెల్లించాల్సి ఉంటుంది. ఇక ప్రభుత్వ నిబంధనల ప్రకారం ట్యూషన్ ఫీజు చెల్లించాలి.
Also Read:
బీడీఎస్ ప్రవేశాలకు కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల, షెడ్యూలు ఇదే!
రాష్ట్రంలో బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి నవంబరు 9,10 తేదీల్లో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. ఈ మేరకు నవంబరు 8న మొదటి విడత ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌ను అందుబాటులో ఉంచింది.
యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ దంత కళాశాలల్లోని కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. కళాశాలలవారీగా సీట్ల వివరాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. నవంబరు 9న ఉదయం 6 గంటల నుంచి నవంబరు 10న సాయంత్రం 6 గంటల వరకు అభ్యర్థులు ప్రాధాన్యత క్రమంలో కళాశాలలవారీగా వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.
BDS SEAT MATRIX
NOTIFICATION FOR EXERCISING WEB-OPTIONS FOR FIRST PHASE COUNSELING
బీడీఎస్ కన్వీనర్ కోటా నోటిఫికేషన్‌తోపాటు పీజీ మెడికల్ (ఎండీ/ఎంఎస్/డిప్లొమా) మేనేజ్‌మెంట్ కోటా రెండో రౌండ్ సీట్ల కేటాయింపు జాబితాను యూనివర్సిటీ విడుదల చేసింది.
ALLOTMENT LIST AFTER SECOND PHASE OF COUNSELLING
ఫీజు వివరాలు ఇలా...
సీట్లు పొందిన విద్యార్థులు యూనివర్సిటీ ఫీజు కింద ఆన్‌లైన్ గేట్ వే (డెబిట్/క్రెడిట్ కార్డు/నెట్ బ్యాంకింగ్) ద్వారా రూ.12,000 చెల్లించి సీటు అలాట్‌మెంట్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రభుత్వ నిబంధనల ప్రకారం ట్యూషన్ ఫీజును ప్రభుత్వ డెంటల్ కాలేజీలో ఏడాదికి రూ.10,000; ప్రైవేట్ డెంటల్ కాలేజీలో ఏడాదికి రూ.45,000; ఆర్మీ డెంటల్ కాలేజీలో రూ.4,25,000గా నిర్ణయించారు.