యూజీ ఆయూష్ వైద్యవిద్య సీట్ల భర్తీకి జనవరి 16, 17 తేదీల్లో వరకు రెండవ విడత కౌన్సెలింగ్ నిర్వహించడానికి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం జనవరి 13న నోటిఫికేషన్ విడుదల చేసింది. యూనివర్సిటీ పరిధిలోని ఆయూష్ కళాశాలల్లో హోమియోపతి (బీహెచ్‌ఎంఎస్), ఆయుర్వేద (బీఏఎంఎస్), యూనాని(బీయూఎంఎస్), నేచురోపతి యోగా(బీఎన్‌వైసీ) కోర్సుల్లో కన్వీనర్ కోటాసీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
జనవరి 16న ఉదయం 8 గంటల నుంచి 17వ తేది సాయంత్రం 6 గంటల వరకు అభ్యర్ధులు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్ధులు కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. అయితే ఆలిండియా కోటాలో, కాళోజీ, ఎన్టీఆర్ యూనివర్సిటీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులల్లో సీటు పొందిన అభ్యర్ధులు ఈ వెబ్ కౌన్సెలింగ్‌కు అనర్హులు. మరింత సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను చూడాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.
Also Read:
ఎంబీబీఎస్ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఇంటర్న్‌షిప్ కటాఫ్ గడువు పొడిగింపు
ఎంబీబీఎస్ పూర్తి చేసిన అభ్యర్థులు ఏడాదిపాటు తప్పనిసరి ఇంటర్న్‌షిప్ చేసేందుకు ప్రస్తుతమున్న 2023 మార్చి 31 కటాఫ్ తేదీ గడువును కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ జూన్ 30 వరకు పొడిగించింది. ఈ మేరకు త్వరలో ప్రకటన వెలువడనున్నట్లు అధికార వర్గాలు జనవరి 12న వెల్లడించాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ), విద్యార్థి సంఘాలు, భావి అభ్యర్థులు, పలు రాష్ట్రాల అధికారుల అభ్యర్థన మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ నిర్ణయం తీసుకొంది. ఇంటర్న్‌షిప్ కటాఫ్ గడువు పొడిగించడంతో.. ఈ ఏడాది మార్చి 5న ఉంటుందని ప్రకటించిన నీట్ పీజీ ప్రవేశ పరీక్షను సైతం వాయిదా వేయాలనే డిమాండు విద్యార్థులు, వారి కుటుంబాల నుంచి రావచ్చని అధికారులు భావిస్తున్నారు.
నీట్ పీజీ ఇంటర్న్‌షిప్ కటాఫ్ తేదీపై అభ్యంతరం:
నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ నీట్-పీజీ పరీక్షల షెడ్యూల్‌ను ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్(ఫోర్డా) ఈ షెడ్యూల్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇంటర్న్‌షిప్ పూర్తి చేయడానికి మార్చి 31 కటాఫ్ తేదీగా నిర్ణయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఇలా చేయడం వల్ల చాలా మంది విద్యార్థులు నష్టపోతారని, ప్రస్తుత బ్యాచ్‌లో సగం కంటే ఎక్కువ మంది విద్యార్థులు అర్హత సాధించడం చాలా కష్టమని ఫోర్డా అభిప్రాయపడింది.
జేఈఈ మెయిన్ దరఖాస్తుల సవరణకు అవకాశం, ఎప్పటివరకంటే?
జేఈఈ మెయిన్ 2023 సెషన్-1 దరఖాస్తుల సవరణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అవకాశం కల్పించింది. అభ్యర్థులు జనవరి 13 నుంచి 14 వరకు వివరాల్లో తప్పులుంటే సరిచేసుకోవచ్చు. దరఖాస్తు సవరణకు జనవరి 14న రాత్రి 11.50 గంటల వరకు అవకాశం కల్పించారు. జేఈఈ మెయిన్ సెషన్-1 దరఖాస్తు సమయంలో వివరాలు తప్పుగా నమోదుచేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..