యూజీ ఆయూష్ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటన జారీచేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆయూష్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీయూఎంఎస్, బీఎన్‌వైఎస్ కోర్సులల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతూ నవంబరు 12న నోటిఫికేషన్ జారీ చేసింది.
50 శాతం మార్కులతో (ఎస్సీ, ఎస్టీకు 40 శాతం, దివ్యాంగుకు 45 శాతం మార్కులు) ఇంటర్ (బైపీసీ) ఉత్తీర్ణులై , నీట్-2022లో అర్హత సాధించిన అభ్యర్ధులు నవంబరు 13న ఉదయం 8 గంటల నుండి నవంబరు 20న రాత్రి 8 గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వారు సూచించారు. నిర్దేశిత దరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్ధులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో ఆప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
కటాఫ్ మార్కులు ఇలా..
ప్రవేశాలకు సంబంధించిన అర్హత ఇతర సమాచారానికి యూనివర్సిటీ వెబ్‌సైట్ WWW.KNRUHS.TELANGANA.GOV.IN లో సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.
రిజిస్ట్రేషన్ ఫీజు..
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో అభ్యర్థులు రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్ ఫీజుగా రూ.2500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందినవారు రూ.2000 చెల్లించాలి. ఈ ఫీజుకు బ్యాంకు ఛార్జీలు అదనం. ఆన్‌లైన్ (డెబిట్/క్రెడిట్/నెట్ బ్యాంకింగ్) ద్వారానే ఫీజు చెల్లించాలి.
UG AYUSH ADMISSIONS 2022-23 UNDER COMPETENT AUTHORITY QUOTA - PROSPECTUS
ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కేటాయింపు ఫలితాలు..
ఎంబీబీఎస్, బీడీఎస్ మేనేజ్‌మెంట్ కోటా మొదటివిడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు ఫలితాలను హెల్త్ యూనివర్సిటీ నవంబరు 12న విడుదల చేసింది. సీట్ల కేటాయింపు వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
కళాశాలలవారీగా సీట్ల కేటాాయింపు వివరాల కోసం క్లిక్ చేయండి..
అదేవిధంగా హైకోర్టుల ఆదేశాల ప్రకారం మేనేజ్‌మెంట్ కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను కూడా యూనివర్సిటీ విడుదల చేసింది.
LIST OF CANDIDATES PERMITTED FOR COUNSELLING AS PER THE ORDERS OF THE HON'BLE HIGH COURT
అవసరమయ్యే డాక్యుమెంట్లు..
Also Read:
Telangana Inter exam Fee: ఇంటర్ పరీక్ష ఫీజు తేదీలు ఖరారు, చివరి తేదీ ఎప్పుడంటే?
తెలంగాణ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్‌కు సంబంధించి పరీక్ష ఫీజు చెల్లింపు ప్రక్రియ నవంబరు 14 నుంచి ప్రారంభంకానుంది. విద్యార్థులు నవంబరు 30 వరకు సంబంధిత కళాశాలలో పరీక్ష ఫీజు చెల్లించాలని ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో పాటు గతంలో ఫెయిలైన విద్యార్థులు, ఒకేషనల్ కోర్సుల విద్యార్థులు కూడా పరీక్ష ఫీజు చెల్లించాలని ఇంటర్ బోర్డు తెలిపింది. వచ్చే ఏడాది మార్చిలో ఇంటర్ వార్షిక పరీక్షలను నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
పరీక్ష ఫీజు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
IOCL: ఐవోసీఎల్‌లో 465 అప్రెంటిస్ పోస్టులు, వివరాలు ఇలా!
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐవోసీఎల్), పైప్‌లైన్ డివిజన్ పరిధిలోని ఐదు రీజియన్లలో వివిధ టెక్నికల్/నాన్-టెక్నికల్ ట్రేడుల్లో అప్రెంటిస్ శిక్షణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులను అనుసరించి 12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 30లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..