తెలంగాణలోని వైద్యకళాశాలల్లో పీజీ వైద్య విద్య కోర్సుల్లో యాజమాన్య కోటాలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అక్టోబరు 4న ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులు ప్రవేశాల కోసం ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
నీట్ పీజీ-2022 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులు పీజీ డిప్లొమా/డిగ్రీ సీట్లకు నమోదు చేసుకోవాలి. యాజమాన్య కోటాలో సీట్ల భర్తీకి అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అక్టోబరు 5న ఉదయం 8 గంటల నుంచి అక్టోబరు 12న సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నారు.
నిర్దేశిత దరఖాస్తు పూర్తిచేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తులు, సర్టిఫికెట్లను యూనివర్సిటీ పరిశీలించిన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. ప్రవేశాలకు సంబంధించిన అర్హత, ఇతర సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.
MANAGEMENT QUOTA - PROSPECTUS
MANAGEMENT QUOTA - NOTIFICATION FOR ONLINE APPLICATIONS
Also Read
NEET UG Counselling: నీట్ యూజీ 2022 కౌన్సెలింగ్ షెడ్యూలు వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే!
నీట్ యూజీ (NEET UG) 2022 కౌన్సెలింగ్ ప్రక్రియ అక్టోబరు 11 నుంచి ప్రారంభంకానుంది. కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన షెడ్యూలును మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) అక్టోబరు 4న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో షెడ్యూలును అందుబాటులో ఉంచింది. నీట్ యూజీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్ తేదీలను చూసుకోవచ్చు.
నీట్ యూజీ కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
జేఎన్‌టీయూహెచ్‌లో పార్ట్ టైమ్ పీజీ కోర్సులు, చివరితేది ఎప్పుడంటే?
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి ఎంటెక్, ఎంబీఏ పార్ట్‌టైమ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబరు 17 వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబరు 15 నుంచి 17 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
కోర్సులు, ముఖ్యమైన తేదీల కోసం క్లిక్ చేయండి..
EFLU: ఇఫ్లూలో పార్ట్-టైమ్ లాంగ్వేజ్ కోర్సులు, దరఖాస్తు చేసుకోండి!
హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) 2022-2023 విద్యా సంవత్సరానికి వివిద విదేశీ భాషల్లో పార్ట్ టైమ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబరు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సులు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
జగనన్న విదేశీ విద్యా దీవెన దరఖాస్తు గడువు పొడిగింపు, ఎన్నిరోజులంటే?
విదేశీ విశ్వవిద్యాలయాలు/విద్యా సంస్థల్లో పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్ అభ్యసించాలనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు విద్యార్థులకు నిర్దేశించిన 'జగనన్న విదేశీ విద్యాదీవెన' పథకం దరఖాస్తు గడువును అక్టోబరు 30 వరకు పొడిగించారు. వాస్తవానికి సెప్టెంబరు 30తో గడువు ముగియగా.. మరో నెలపాటు పెంచారు.
జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..