మీరందరూ మీ జీవితంలో పెన్ను ఉపయోగించి ఉంటారుకదా. మీరు చదువుకున్న వాళ్లు అయినా కాకపోయినా ఏదో సందర్భంలో పెన్నుతో పని పడి ఉంటుంది. ఉపయోగించి ఉంటారు. సాంకేతికత పెరుగుతున్న నేటి యుగంలో పెన్నుల వాడకం మునుపటితో పోలిస్తే కొద్దిగా తగ్గింది. 


పెన్ను వాడిన సందర్భంలో కాస్త నిశితంగా ఎప్పుడైనా గమనించారా. పెన్ను క్యాప్‌ పైభాగంలో ఒక రంధ్రం ఉందని మీరు చూసే ఉంటారు. ఈ రంధ్రం ఎందుకు ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రంధ్రం ఎందుకు పెట్టిఉంటారో మీకు తెలియదా? ఈ రంధ్రం పెట్టడం సైన్స్‌ మీకు తెలుసా.


ఒక వాదన ప్రకారం, పెన్ను మూసి తెరిచినప్పుడు క్యాప్‌కు ఉన్న హోల్‌  గాలి పీడనాన్ని సమానంగా నిర్వహిస్తుంది. క్యాప్‌ తీసి పెట్టే పెన్నులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. పెన్ను రీఫిల్‌లోని సిరా ఎండిపోకుండా ఉండటానికి కొన్ని రకాల పెన్నుల మూతకు  రంధ్రాలు చేస్తారని చాలా మంది అనుకుంటారు. ఇది సరైన వాదన కాదని చాలా మంది వాదన.


పెన్‌ క్యాప్‌లకు రంధ్రం ఉండటానికి ఇదే ప్రధాన కారణం


వాస్తవానికి పెన్ను మూతలో రంధ్రం చేయడానికి ప్రాథమిక కారణం ఏమిటంటే కొంతమంది పెన్ను మూతతో సహా, దానిని నోటిలో నములుతుంటారు. ముఖ్యంగా పిల్లలు అలా చేస్తారు. అటువంటి పరిస్థితిలో, అది ప్రమాదవశాత్తు నోటిలోకి వెళితే, రంధ్రాలు లేకపోవడం వల్ల గాలి ప్రవాహం ఆగిపోతుంది. ఇది ప్రాణాంతకం. ఈ కారణంగా తయారీదారులు దాని మూతకు రంధ్రం చేయడం ప్రారంభించారు.


ఒక పిల్లవాడు లేదా పెద్ద వాళ్లు పొరపాటున పెన్‌ క్యాప్‌ మింగేసినా మరణ ప్రమాదాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. అయితే, కొన్ని పెన్నులలో ఈ రంధ్రం పెన్ను, దాని మూతకు చివరి భాగంలో ఉంటుంది. 


ఎవరూ పెన్ను మూతను మింగుతున్నారనే విషయం తెలియనప్పటికీ  పెన్ను తయారీదారులు ఎల్లప్పుడూ ఈ భయాన్ని దృష్టిలో ఉంచుకొని దాని క్యాప్‌లకు రంధ్రాలు పెడుతున్నారు.