మహర్షి వాత్సాయన రచించిన కామసూత్ర ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన పుస్తకాలలో ఒకటి. ప్రపంచానికి లైంగిక విజ్ఞానాన్ని అందించిన ఈ గ్రంథాన్ని భారత్ తన అమూల్యమైన సంపదగా భావిస్తుంటుంది. దీనిపైన నిరంతరం చర్చ జరుగుతూనే ఉంది. చాలా మంది కామసూత్రం లైంగిక చర్యలు లైంగికత ఆధారంగా రచించిన పుస్తకం అని భావిస్తారు, కానీ అది అంతకంటే చాలా ఎక్కువ. ఈ గ్రంథంలో పురుషులు, స్త్రీల మధ్య సంబంధాలు, వారి ప్రవర్తన తత్వశాస్త్రం గురించి కూడా చాలా విషయాలు ఉన్నాయి.
మహర్షి వాత్సాయన సంస్కృతంలో కామసూత్రాన్ని రచించారు. ఇది తర్వాత అనేక భాషలలోకి అనువదించారు.. కానీ ఈ పుస్తకాన్ని ఉర్దూలో ఏమంటారో మీకు తెలుసా? వాస్తవానికి, దేశంలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలలో ఒకటైన జామియా మిల్లియా ఇస్లామియా ఈ గ్రంథం ఉర్దూ అనువాదాన్ని దాని గ్రంథాలయంలో చేర్చింది.
కామసూత్ర ఉర్దూ అనువాదాన్ని ఏమంటారు?
జామియా మిల్లియా ఇస్లామియా ఈ గ్రంథం ఉర్దూ అనువాదాన్ని దాని అరుదైన పుస్తకాల సేకరణలో చేర్చింది. కామశాస్త్రం ఉర్దూ అనువాదం జామియా డాక్టర్ జాకిర్ హుస్సేన్ గ్రంథాలయంలో 'లజ్జత్-ఉన్-నిసా' అనే పేరుతో చేర్చారు.. ఉర్దూ అనువాదం, లజ్జత్-ఉన్-నిసా ని మాలిక్ మజాజి చేశారని జామియా తెలిపింది. .
లజ్జత్-ఉన్-నిసాను తరచుగా 'హైదరాబాద్ కామసూత్రం' అని పిలుస్తారు. 2019 TOI నివేదిక ప్రకారం, లజ్జత్-ఉన్-నిసా వాస్తవానికి కోకాశాస్త్రం యొక్క ఉర్దూ అనువాదం, ఇది కామ సూత్రం ఆధారంగా రూపొందించబడింది.
భగవద్గీత, మహాభారతం, ఉర్దూలో సూఫీ కవి మాలిక్ ముహమ్మద్ జయసి రచించిన ఆవధి మహాకావ్యం పద్మవత్, డిజిటై్జ్ చేసిన పర్షియన్ అనువాదాలను కూడా డాక్టర్ జాకిర్ హుస్సేన్ గ్రంథాలయంలో చేర్చారని జామియా మిల్లియా ఇస్లామియా తెలిపింది. ఈ ఏడాది జామియా 13 తాళపత్రాలను గ్రంథాలయంలోకి తెచ్చింది. ఇప్పటివరకు, 6,000 అరుదైన పుస్తకాలతో పాటు.. 2243 తాళపత్రాలను గ్రంథాలయంలో చేర్చారు. మొత్తం ఆరు లక్షలకు పైగా పుస్తకాలు జామియా లైబ్రరీలో ఉన్నాయి.