తెలంగాణ రాష్ట్రంలోని పీజీ డెంట‌ల్ సీట్ల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధ‌వారం (ఆగస్టు 24) నోటిఫికేషన్ విడుదల చేసింది. విశ్వవిద్యాలయ పరిధిలోని కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. జాతీయ స్థాయి అర్హత పరీక్షా నీట్ ఎండీఎస్‌-2022లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 25న ఉద‌యం 8 గంట‌ల నుంచి ఆగస్టు 31న సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తుతో పాటు సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. సమర్పించిన దరఖాస్తులు, సర్టిఫికెట్లను యూనివర్సిటీ అధికారులు పరిశీలించిన అనంతరం అర్హుల తుది జాబితాను విడుద‌ల చేయ‌నున్నారు. ద‌ర‌ఖాస్తుల‌ను వెబ్‌సైట్ ద్వారా న‌మోదు చేసుకోవ‌చ్చు. ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివ‌రాల కొరకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.


 


Also Read: DOST Admissions: దోస్త్‌ రెండో విడత సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?



వివరాలు
...


 


* ఎండీఎస్ కోర్సులు (కాంపిటెంట్ అథారిటీ కోటా)


 


అర్హత:


* నీట్ ఎండీఎస్ – 2022 అర్హత సాధించి ఉండాలి. కటాఫ్ స్కోరు లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి.


* డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి బీడీఎస్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.


* డెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదా స్టేట్ డెంటల్ కౌన్సిల్‌లో సభ్యత్వం కలిగి ఉండాలి.


* బీడీఎస్ విద్యార్థులు గుర్తింపు పొందిన డెంటల్ కాలేజ్ నుంచి 31-07-2022లోపు ఇంటర్న్‌షిప్ పూర్తవుతూ ఉండాలి.



Also Read: TS ICET 2022: తెలంగాణ ఐసెట్ ఫలితాలు ఎప్పుడంటే?


 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


 


ఎంపిక విధానం: సమర్పించిన దరఖాస్తులు, సర్టిఫికెట్లను యూనివర్సిటీ అధికారులు పరిశీలించిన అనంతరం అర్హుల తుది జాబితా తయారుచేస్తారు.


 


దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.5,500 చెల్లించాలి. ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.5,000 చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు ఛార్జీలు అదనం.



Also Read: తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు ఎప్పుడంటే?


 


అవసరమైన డాక్యుమెంట్లు..



  • లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజు ఫొటో

  • NEET – MDS-2022 అడ్మిట్ కార్డు

  • ఒరిజినల్ / ప్రొవిజినల్ డిగ్రీ సర్టిఫికేట్

  • ఆధార్ కార్డు

  • అన్ని సంవత్సరాల బీడీఎస్ స్టడీ సర్టిఫికేట్లు

  • 6వ తరగతి నుంచి ఇంటర్ స్టడీ సర్టిఫికేట్లు (ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చదివినవారైతే)

  • క్యాస్ట్ సర్టిఫికేట్ (బీసీ, ఎస్సీ, ఎస్టీ అయితే)

  • లేటెస్ట్ సర్వీస్ సర్టిఫికేట్

  • ఇంటర్న్‌షిప్ కంప్లీషన్ సర్టిఫికేట్

  • డెంటల్ కౌన్సిల్‌లో శాశ్వత సభ్యత్వ సర్టిఫికేట్

  • ఫొటో ఐడీ కార్డు – ఆధార్ కార్డు

  • పదేళ్ల రెసిడెన్సీ ప్రూఫ్/స్టడీ సర్టిఫికేట్ (తెలంగాణ/ ఏపీ)


 


ముఖ్యమైన తేదీలు...


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25.08.2022.


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 31.08.2022.


 


PROSPECTUS


 


Notification


 


Online Application


 


Website


 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..