తెలంగాణలోని కాళోజీ నారాయణ‌రావు ఆరోగ్య విశ్వ విద్యాలయం పరిధిలో సెప్టెంబరు 9న జ‌ర‌గాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విశ్వవిద్యాలయ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేష‌న్స్‌ వెల్లడించారు. గణేశ్‌ నిమజ్జనం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు 9న సెలవు ప్రకటించిన నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేశారు. ఎంబీబీఎస్ రెండో సంవ‌త్సరం, బీడీఎస్ చివరి సంవత్సరం, పోస్ట్ బేసిక్ నర్సింగ్ మొదటి సంవత్సరం పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. వాయిదా పడిన ఎంబీబీఎస్ మైక్రో బయాలజీ పరీక్ష సెప్టెంబరు 19న, బీడీఎస్ పెరియోడొంటాల‌జీ సెప్టెంబరు 21న, పోస్ట్ బేసిక్ నర్సింగ్ ఇంగ్లిష్‌ పరీక్షను సెప్టెంబరు 30న నిర్వహించనున్నారు. అయితే, సెప్టెంబరు 12 నుంచి జ‌రగాల్సిన‌ పరీక్షలన్నీ య‌ధావిధిగా జరుగుతాయని విశ్వవిద్యాలయ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేష‌న్స్ వెల్లడించారు.




అక్టోబరు 20 నుంచి ఫైనలియర్ సప్లిమెంటరీ పరీక్షలు..
కాళోజీ నారాయణ‌రావు ఆరోగ్య విశ్వ విద్యాలయం పరిధిలోని ఎంబీబీఎస్ పార్ట్-II  సప్లిమెంటరీ థియరీ పరీక్షలు అక్టోబరు 20 నుంచి ప్రారంభంకానున్నాయి. అక్టోబరు 20 నుంచి నవంబరు 4 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఆయా తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు ఉంటాయి. విద్యార్థులు పరీక్షకు సంబంధించిన ఫీజును సెప్టెంబరు 20 నుంచి 28 వరకు చెల్లించవచ్చు.

పరీక్ష ఫీజు ఇలా...
* పరీక్ష ఫీజు రూ.2400
* ఒక్కో సబ్జెక్టుకు రూ.600
* మార్కుల మెమోకోసం రూ.300
* ప్రాసెసింగ్ ఫీజు రూ.350
* ప్రొవిజినల్ ఫీజు రూ.400

ఫీజు చెల్లించడానికి డైరెక్ట్ లింక్...


పరీక్షల షెడ్యూలు, ఫీజు వివరాల కోసం క్లిక్ చేయండి..


 


అక్టోబరు 27 నుంచి ఫైనలియర్ పార్ట్-I  సప్లిమెంటరీ పరీక్షలు..
కాళోజీ నారాయణ‌రావు ఆరోగ్య విశ్వ విద్యాలయం పరిధిలోని ఎంబీబీఎస్ పార్ట్-I  సప్లిమెంటరీ థియరీ పరీక్షలు అక్టోబరు 27 నుంచి ప్రారంభంకానున్నాయి. అక్టోబరు 27 నుంచి నవంబరు 3 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఆయా తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు ఉంటాయి. విద్యార్థులు పరీక్షకు సంబంధించిన ఫీజును సెప్టెంబరు 20 నుంచి 28 వరకు చెల్లించవచ్చు. సెప్టెంబరు 24 వరకు మాత్రమే అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించే అవకాశం ఉంది.

పరీక్ష ఫీజు ఇలా...


* పరీక్ష ఫీజు రూ.1800


* ఒక్కో సబ్జెక్టుకు రూ.600


* మార్కుల మెమోకోసం రూ.300


* ప్రాసెసింగ్ ఫీజు రూ.350


పేమెంట్ లింక్..


 


పరీక్షల పూర్తి షెడ్యూలు, ఫీజు వివరాల కోసం క్లిక్ చేయండి..


 


Also Read:  


AUSDE: ఏయూ దూరవిద్య కోర్సుల నోటిఫికేషన్‌ విడుదల


విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి దూరవిద్య కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఏయూ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ ఏడాదిలో రెండు సార్లు దూరవిద్య ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తుంటుంది. ఆయా కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్‌లో సూచించినట్లు ఇంటర్‌, డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 5 నుంచి ప్రారంభమైంది. ఆసక్తి, అర్హతలు ఉన్న అభ్యర్థులు సెప్టెంబరు 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.500 ఆలస్య రుసుంతో అక్టోబర్‌ 31 వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. 
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి


 


Also Read:  


UOH PhD: హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్


హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 2022 -23 ఏడాదికి వివిధ సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్ ప్రవేశాలకు ఆన్‌‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా మొత్తం 42 కోర్సుల్లో పీహెచ్‌డీ ప్రవేశాలు కల్పించనున్నారు. మొత్తం 281 సీట్లలో ప్రవేశాలు కల్పించనున్నారు. వీటిలో జనరల్ అభ్యర్థులకు 99 సీట్లు, ఎస్సీ అభ్యర్థులకు 43 సీట్లు, ఎస్టీ అభ్యర్థులకు 21 సీట్లు, ఓబీసీ అభ్యర్థులకు 76 సీట్లు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 28 సీట్లు, దివ్యాంగులకు 14 సీట్లు కేటాయించారు. 
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి.. 


 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..