కాకతీయ విశ్వవిద్యాలయం ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో డిసెంబరు 28 నుంచి ప్రారంభం కావాల్సిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. పరీక్షల రీషెడ్డ్యూల్‌ను డిసెంబరు 27న వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి డా.పి.మల్లారెడ్డి, అదనపు అధికారులు డా.జె.మధుకర్, డా.ఎ.నరేందర్ విడుదల చేశారు. దీనిప్రకారం జనవరి 4 నుంచి ఐదో సెమిస్టర్, 5 నుంచి మూడో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఇక డిగ్రీ ఒకేషనల్ మూడో సెమిస్టర్ పరీక్షలు జనవరి 10 నుంచి, ఐదో సెమిస్టర్ పరీక్షలు జనవరి 6 నుంచి ప్రారంభంకానున్నాయి.


పరీక్షల పూర్తి షెడ్యూలు ఇలా..


Also Read:


డిగ్రీ అర్హతతో బీఎస్సీ పారామెడికల్ కోర్సులు, 9 కాలేజీల్లో 860 సీట్లు! 
తెలంగాణలో తొలిసారిగా వైద్యవిద్య అనుబంధ కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వం​ అనుమతించింది. దీంతో మొత్తం 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 12 రకాల అనుబంధ కోర్సులు, 860 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు మంగళవారం (డిసెంబరు 27న)  వైద్యారోగ్య శాఖ అధికారిక ఉత్తర్వులు (జీవో నెంబర్ 156) జారీచేసింది. 2022-23 వైద్య విద్య సంవత్సరం నుంచే గాంధీ, ఉస్మానియా, కాకతీయ, రిమ్స్, నిజామాబాద్, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మొత్తంగా 860 పారామెడికల్ సీట్లను అందుబాటులోకి తీసుకురానుంది.

రాష్ట్ర ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలతో పాటు, వైద్య విద్యను అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రం ఏర్పాటు తర్వాత 12 మెడికల్ కాలేజీలు ప్రారంభించగా, మరో రెండేళ్లలో జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసేలా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య విద్య అనుబంధ సేవలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

బీఎస్సీ మొదటి ఏడాదిలో 12 వైద్య విద్య అనుబంధ కోర్సులు ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ కోర్సుల్లో చేరే విద్యార్థులు మూడేళ్ల కోర్సుతో పాటు ఒక సంవత్సరం ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. మొత్తంగా నాలుగేళ్ల కాల వ్యవధిలో బీఎస్సీ పారామెడికల్ విద్యను పూర్తి చేయాలి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ప్రతి సంవత్సరం 860 మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. తద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు మరింత మెరుగవనున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.

విభాాగాలు: అనస్తీషియా, ఆపరేషన్ థియేటర్, రెస్పిరేటరీ థెరపీ, రీనల్ డయాలసిస్, న్యూరోసైన్స్, క్రిటికల్ కేర్, రేడియాలజీ అండ్ ఇమేజింగ్, ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ, మెడికల్ రికార్డ్స్ సైన్సెస్, ఆప్తోమెట్రిక్, కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ కోర్సులు ఇందులో ఉన్నాయి. త్వరలో న్యూక్లియర్ మెడిసిన్, రేడియోథెరపీ టెక్నాలజీ కోర్సులను కూడా ప్రారంభించే అవకాశాలున్నాయి. ఈ రెండు ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి పరిధిలో అందుబాటులోకి వచ్చే అవకాశముంది.


తెలంగాణలో భారీగా పెరిగిన మెడికల్ సీట్లు, దేశంలో ఆరో స్థానం!
తెలంగాణ ప్రభుత్వం వైద్య విద్యకు ప్రాధాన్యమివ్వడంతో గత ఎనిమిదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలల్లో సీట్ల సంఖ్య భారీగా పెరిగింది. ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ వైద్య కళాశాలను కొత్తగా నెలకొల్పడం, మెడికల్ సీట్ల పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించడంతో అత్యధిక ఎంబీబీఎస్ సీట్లున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఆరో స్థానంలో నిలిచింది. సీట్ల సంఖ్య 6,040 కి చేరింది. తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5,485 ఎంబీబీఎస్ సీట్లతో ఏడో స్థానంలో నిలిచింది. 
రాష్ట్రాలవారీగా మెడికల్ సీట్ల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..