హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ 2023-24 విద్యా సంవత్సరానికి స్వీడన్‌లోని బ్లీకింగ్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఉమ్మడిగా నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ డబుల్‌ మాస్టర్స్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదలైంది. కనీసం 60శాతం మార్కులతో ఇంటర్మీడియట్(మ్యాథ్స్‌, ఫిజిక్స్, కెమిస్ట్రీ) ఉత్తీర్ణతతో పాటు టీఎస్‌ ఎంసెట్‌ 2023 లేదా జేఈఈ(మెయిన్‌) 2023 ర్యాంకు సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రోగ్రామ్‌ వ్యవధి అయిదేళ్లు. మొదటి మూడున్నరేళ్లు జేఎన్‌టీయూహెచ్‌లో, చివరి ఏడాదిన్నర బీటీహెచ్‌లో చదవాల్సి ఉంటుంది. మొత్తం పది సెమిస్టర్లు ఉంటాయి. సరైన అర్హతలు గల విద్యార్థులు జులై 12 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.



ప్రోగ్రామ్ వివరాలు..


* బీటెక్‌, ఎంటెక్‌ అండ్‌ ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్ డబుల్ డిగ్రీ మాస్టర్స్ ప్రోగ్రామ్‌(ఐడీడీఎంపీ): 5 సంవత్సరాలు.


సీట్లు: ఈసీఈ- 20, సీఎస్‌ఈ- 60 సీట్లు ఉన్నాయి.


విభాగాలు: మెషిన్ లెర్నింగ్, సెన్సార్స్‌ అండ్‌ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్‌ మెషిన్ లెర్నింగ్.


అర్హత: కనీసం 60శాతం మార్కులతో ఇంటర్మీడియట్(మ్యాథ్స్‌, ఫిజిక్స్, కెమిస్ట్రీ) ఉత్తీర్ణులై ఉండాలి. టీఎస్‌ ఎంసెట్‌ 2023 లేదా జేఈఈ(మెయిన్‌) 2023 ర్యాంకు సాధించి ఉండాలి.


వయోపరిమితి: అభ్యర్థులు 16 సంవత్సరాలు నిండి ఉండాలి.


ప్రవేశ విధానం: టీఎస్‌ ఎంసెట్‌ 2023 లేదా జేఈఈ(మెయిన్‌) 2023 ర్యాంకు ఆధారంగా.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 12.07.2023.


➥ ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: 14.07.2023.


➥ అడ్మిషన్ కౌన్సెలింగ్ తేదీ: 17.07.2023.


అడ్మిషన్ కౌన్సెలింగ్ వేదిక: Directorate of Admissions, 
                                JNTUH, Kukatpally, Hyderabad.


Notification


Website



ALSO READ:


డిగ్రీ సీట్ల కేటాయింపుల్లో 'జాబ్‌' కోర్సుల‌కే డిమాండ్‌, అత్యధికంగా భర్తీ అయిన సీట్లు అవే!
తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో గత కొన్నేళ్లుగా కామర్స్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. దీంతో డిగ్రీ సీట్ల కేటాయింపుల్లో అత్యధికంగా కామర్స్‌ సీట్లే భర్తీ అవుతున్నాయి. మరోవైపు లైఫ్‌ సైన్సెస్, ఫిజికల్‌ సైన్స్‌ కోర్సులకు ఆదరణ తగ్గుతోంది. ఒకప్పుడు సైన్స్‌ కోర్సులకు డిమాండ్ ఎక్కువగా ఉండేది. కాని ఇప్పుడు కామర్స్‌ కోర్సులకే బ్రహ్మరథం పడుతున్నారు. జూన్‌ 16న, 30న కేటాయించిన దోస్త్‌ మొదటి, రెండో విడత సీట్ల కేటాయింపు ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. గత రెండేళ్లుగా కామర్స్‌వైపు విద్యార్థులు మొగ్గుచూపుతున్నారు. ఈ కోర్సు చేసిన దాదాపు 60 శాతం వరకు విద్యార్థులకు మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. దీంతో ఈ విద్యాసంవత్సరంలోనూ డిగ్రీ కోర్సులో అడ్మిషన్లు తీసుకుంటున్నవారిలో ఎక్కువ మంది కామర్స్‌ కోర్సునే ఎంచుకుంటున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


తెలంగాణలో టాప్-10 ఇంజనీరింగ్ కళాశాలలు ఇవే, ఓ లుక్కేయండి!
అద్భుతమైన మౌలిక సదుపాయాలు, అంతకు మించి నిష్ణాతులైన ఉపాధ్యాయులతో బోధన, ప్లేస్ మెంట్ ఉద్యోగాలు కల్పించే ఉత్తమమైన తెలంగాణలోని టాప్ - 10 ఇంజనీరింగ్ కళాశాలలు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టాప్ కాలేజీల్లో చదివిన వారికి అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 
కళాశాలల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ సీట్ల భర్తీకి ఎన్‌సెట్‌ నోటిఫికేషన్ వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!
ఇంటర్‌ విద్యార్హతతో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సులో ప్రవేశాలకు 2023-24 విద్యా సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(NCET) పేరిట జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆసక్తి ఉన్నవారు జూన్ 27 నుంచి జులై 19 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పరీక్షల తేదీలను ఎన్టీఏ తర్వాత ప్రకటించనుంది.
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial