TS EAMCET 2023: టీఎస్ ఎంసెట్-2023 నోటిఫికేష‌న్ విడుదల, మార్చి 3 నుంచి దరఖాస్తు ప్రక్రియ - చివరితేది, పరీక్ష వివరాలు ఇలా!

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 3 నుంచి ప్రారంభంకానుంది. అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్‌ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Continues below advertisement

టీఎస్ ఎంసెట్-2023 (తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2023) నోటిఫికేష‌న్‌ను జేఎన్‌టీయూ హైదరాబాద్ ఫిబ్రవరి 28న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 3 నుంచి ప్రారంభంకానుంది. అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్‌ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రూ.250 - రూ.5000 వరకు ఆలస్య రుసుముతో ఏప్రిల్ 15 నుంచి మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

Continues below advertisement

దరఖాస్తు ఫీజు ఇలా..
దరఖాస్తు ఫీజుగా  ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.500, మిగ‌తా కేట‌గిరిల అభ్యర్థులు రూ. 1000 చెల్లించి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఇంజినీరింగ్, మెడిక‌ల్ ప్రవేశ ప‌రీక్ష రాసే ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.1000, మిగ‌తా కేట‌గిరిల అభ్యర్థులు రూ. 1800 చెల్లించాల్సి ఉంటుంది. 

ఈ ఏడాది మే 7 నుంచి 11 వరకు ఎంసెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. వీటిలో మే 7 నుంచి 9 వరకు ఇంజినీరింగ్‌ విభాగానికి; మే 10 నుంచి 11 వరకు అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాలకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ప్రతిరోజు రెండు సెషన్లలో ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 30 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.

ఎంసెట్‌ షెడ్యూల్‌ ఇలా..

➥ ఎంసెట్‌ నోటిఫికేషన్‌ వెల్లడి:  28.02.2023

➥ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.03.2023.

➥ దరఖాస్తుకు చివరితేదీ (అపరాధ రుసుము లేకుండా): 10.04.2023. 

➥ రూ.250 అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 15.04.2023.

➥ రూ.1000 అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 20.04.2023.

➥ రూ.2500 అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 25.04.2023.

➥ రూ.5000 అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 02.05.2023.

➥ దరఖాస్తు ఫీజు: రూ.1100, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.600

➥ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌: 30.04.2023 నుంచి

➥ పరీక్ష తేదీలు:  మే 7 నుంచి 11 వరకు (మే 7 - 9 వరకు ఇంజినీరింగ్, మే 10, 11 తేదీల్లో ఫార్మసీ, అగ్రికల్చర్).

Website 

సెషన్‌కు 40 వేల మంది..
ప్రస్తుతం ఎంసెట్‌లో ఒక్కో సెషన్‌కు 29 వేల మంది విద్యార్థుల వరకు ఆన్‌లైన్‌లో ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తుండగా.. ఆ సంఖ్యను 40 వేలకు పెంచాలని అధికారులు భావిస్తున్నారు. ఇదే అంశంపై టీసీఎస్‌ అయాన్‌ సంస్థతో జేఎన్టీయూ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఎంసెట్‌ను వీలైనంత త్వరగా పూర్తిచేయడం, ప్రశ్నపత్రాల నార్మలైజేషన్‌ సమస్యను అధిగమించేందుకు ఈ ఏడాది తక్కువ సెషన్లలో పరీక్షల నిర్వహణకు యోచిస్తున్నారు. ఏటా 2.6 లక్షల మందికిపైగా విద్యార్థులు ఎంసెట్‌కు హాజరవుతున్నారు. ఒక్కో సెషన్‌కు 40 వేల మంది విద్యార్థులు హాజరైతే ఎంసెట్‌ పరీక్షలను ఐదు రోజుల్లోనే ముగించవచ్చనే ఆలోచనలో అధికారులు ఉన్నారు.

Also Read:

తెలంగాణ లాసెట్‌, పీజీఎల్‌ సెట్‌ షెడ్యూలు ఖరారు, పరీక్షలు ఎప్పుడంటే?
తెలంగాణలో లాసెట్, పీజీఎల్ సెట్ షెడ్యూల్ ఖరారైంది. మార్చి 1న లాసెట్, పీజీఎల్ సెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్.లింబాద్రి వెల్లడించారు. దీనికి సంబంధించిన షెడ్యూలును ఉస్మానియా యూనివర్సిటీ వీసీ డి.రవీందర్, లాసెట్ కన్వీనర్ బి.విజయలక్ష్మీతో కలిసి ఆయన విడుదల చేశారు. మార్చి 2 నుంచి ఏప్రిల్ 6 వరకు లాసెట్, పీజీఎల్ సెట్‌కు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుంతో మే 3 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మే 16 నుంచి పరీక్ష హాల్‌టికెట్లు జారీ చేయనున్నారు. మే 25న పరీక్ష నిర్వహించనున్నారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Continues below advertisement