TS EAPCET Notification 2024: తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహించనున్న 'టీఎస్ ఈఏపీసెట్-2024' నోటిఫికేషన్‌ను జేఎన్టీయూ-హైద‌రాబాద్ ఫిబ్రవరి 21న విడుదల చేసింది. ఈ ఏడాది ఇంటర్ పరక్షలకు హాజరవుతున్నవారు, ఇంటర్ అర్హత ఉన్న విద్యార్థులు ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 6 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రూ.250 ఆల‌స్య రుసుమతో ఏప్రిల్ 9 వ‌ర‌కు, రూ.500 ఆల‌స్య రుసుముతో ఏప్రిల్ 14 వరకు, రూ.2500 ఆల‌స్య రుసుముతో ఏప్రిల్ 19 వ‌ర‌కు, రూ.5000 ఆల‌స్య రుసుముతో మే 4 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. దరఖాస్తు వివరాల్లో ఏమైనా తప్పులుంటే ఏప్రిల్ 8 నుంచి 12 వరకు ఎడిట్ చేసుకోవ‌చ్చు. రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలోనే ఈడ‌బ్ల్యూఎస్ అభ్యర్థులు త‌మ వివ‌రాల‌ను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. 

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మే 9 నుంచి 12 వరకు ఈఏపీసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను విద్యార్థులు మే 1 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.  మే 9, 10 తేదీల్లో ఇంజినీరింగ్ విభాగాలకు; మే 11, 12 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగాలకు ప్రవేశ పరీక్ష జరగనుంది. ఆయాతేదీల్లో ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు మొదటి సెషన్‌లో, మ‌ధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించ‌నున్నారు. ఉన్నత విద్యామండ‌లి ఇటీవలే ఎంసెట్ పేరును ఈఏపీసెట్‌గా మార్చిన సంగతి తెలిసిందే. 

టీఎస్ ఎప్‌సెట్-2024 ద్వారా ప్రవేశాలు కల్పించే కోర్సులు..

➥ బీఈ, బీటెక్/బీటెక్(బయోటెక్)/బీటెక్(డెయిరీ టెక్నాలజీ)/ బీటెక్(అగ్రికల్చరల్ ఇంజినీరింగ్)/ బీఫార్మసీ/ బీటెక్(ఫుడ్ టెక్నాలజీ(FT)) / బీఎస్సీ(హానర్స్) అగ్రికల్చర్/ బీఎస్సీ(హానర్స్) హార్టికల్చర్/ బీఎస్సీ (ఫారెస్ట్రీ) /బీవీఎస్సీ & ఏహెచ్/ బీఎఫ్‌ఎస్సీ.

➥  ఫార్మా-డి.

➥ బీఎస్సీ(నర్సింగ్). 

అర్హతలు..

ఈ ఏడాది ఇంటర్ (ఎంపీసీ/ బైపీసీ) లేదా తత్సమాన పరీక్షలకు హాజరవుతున్నవారు, ఇంటర్ అర్హత ఉన్న విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. 

దరఖాస్తు ఫీజు ఎంతంటే?

➥ టీఎస్‌ ఎప్‌సెట్-2024 పరీక్షకు సంబంధించి ఇంజినీరింగ్ లేదా అగ్రికల్చర్ & ఫార్మాలో ఏదో ఒకదానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.900 చెల్లించాలి.

➥ టీఎస్‌ ఎప్‌సెట్-2024 పరీక్షకు సంబంధించి ఇంజినీరింగ్ లేదా అగ్రికల్చర్ & ఫార్మాలో ఏదో ఒకదానికి దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.500 చెల్లించాలి.

➥ టీఎస్‌ ఎప్‌సెట్-2024 పరీక్షకు సంబంధించి రెండింటికి (ఇంజినీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మా) దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.1800 చెల్లించాలి.

➥ టీఎస్‌ ఎప్‌సెట్-2024 పరీక్షకు సంబంధించి రెండింటికి (ఇంజినీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మా) దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1000 చెల్లించాలి.

సెషన్‌కు 40వేల మంది అభ్యర్థులు
ఎప్‌సెట్‌ పరీక్షలను గతానికి భిన్నంగా నాలుగు రోజుల్లోనే పూర్తిచేస్తున్నామని, ఆన్‌లైన్‌ సెంటర్ల సామర్థ్యాన్ని సెషన్‌కు 4 వేలకు పెంచామని డీన్‌కుమార్‌ తెలిపారు. గతంలో ఒక సెషన్‌ సామర్థ్యం 25-30వేలే ఉండగా, 40వేలకు పెంచామని చెప్పారు. ప్రశ్నపత్రాల్లో తప్పులేకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నామని పేర్కొన్నారు. సైబర్‌ నేరాల దృష్ట్యా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని, ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపు, దరఖాస్తు సమయంలో బ్యాక్‌, రిప్రెష్‌ వంటి బటన్లను ఎట్టి పరిస్థితుల్లో నొక్కరాదని సూచించారు. విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకొన్న సెల్‌నెంబర్‌, ఈమెయిల్‌ ఐడీలనే వాడాలి. మధ్యలో మార్చితే ఇబ్బందులొస్తాయని తెలిపారు.

ఉర్దూ మీడియం వారికి చివరగా పరీక్ష
ఎప్‌సెట్‌ను ఇంగ్లిష్‌, తెలుగు, ఉర్దూ మూడు భాషల్లో నిర్వహిస్తున్నామని డీన్‌కుమార్‌ తెలిపారు. ఉర్దూ మీడియం వారికి చివరి రోజు మే 12న పరీక్ష ఉంటుందని, వీరికి ఉర్దూ / ఇంగ్లిష్‌ భాషల్లోనూ పేపర్‌ ఇస్తామని వివరించారు. మిగతా వారికి తెలుగు, ఇంగ్లిష్‌ రెండు భాషల్లో ప్రశ్నపత్రాలిస్తామని పేర్కొన్నారు. విద్యార్థుల సందేహాల నివృత్తికి ఎప్‌సెట్‌ మెయిల్‌ ఐడీ లేదా 7416923578, 7416908215 నంబర్లను సంప్రదించవచ్చని సూచించారు.

ముఖ్యమైన తేదీలు..

విషయం తేదీ
నోటిఫికేషన్ వెల్లడి 21.02.2024.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 26.02.2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 06.04.2024.
దరఖాస్తుల సవరణ 08.04.2024 - 12.04.2024.
రూ.250 ఆల‌స్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది 09.04.2024.
రూ.500 ఆల‌స్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది 14.04.2024. 
రూ.2500 ఆల‌స్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది 19.04.2024. 
రూ.5000 ఆల‌స్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది 04.05.2024
పరీక్ష తేది 09.05.2024 - 12.05.2024.

Website 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..