Trending
TG EAPCET 2025: తెలంగాణ ఎప్‌సెట్ 2025 నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
EAPCET: తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహించనున్న 'టీఎస్ ఈఏపీసెట్-2025' నోటిఫికేషన్‌ను జేఎన్టీయూ-హైదరాబాద్ విడుదల చేసింది.

TG EAPCET Notification 2025: తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహించనున్న 'టీజీ ఈఏపీసెట్-2024' నోటిఫికేషన్‌ను జేఎన్టీయూ-హైదరాబాద్ ఫిబ్రవరి 20న విడుదల చేసింది. ఈ ఏడాది ఇంటర్ పరక్షలకు హాజరవుతున్నవారు, ఇంటర్ అర్హత ఉన్న విద్యార్థులు ఫిబ్రవరి 25 నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు టీజీఎప్‌సెట్(TG EAPCET 2025) పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు; మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం పరీక్షలు నిర్వహించనున్నారు. జేఎన్‌టీయూ హైదరాబాద్ పరీక్షల నిర్వహణ బాధ్యతను చేపట్టంది. ఈఏపీసెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ బి. డీన్ కుమార్ వ్యవహిరించనున్నారు.
ఎప్‌సెట్-2025 ద్వారా ప్రవేశాలు కల్పించే కోర్సులు..
➥ బీఈ, బీటెక్/బీటెక్(బయోటెక్)/బీటెక్(డెయిరీ టెక్నాలజీ)/ బీటెక్(అగ్రికల్చరల్ ఇంజినీరింగ్)/ బీఫార్మసీ/ బీటెక్(ఫుడ్ టెక్నాలజీ(FT)) / బీఎస్సీ(హానర్స్) అగ్రికల్చర్/ బీఎస్సీ(హానర్స్) హార్టికల్చర్/ బీఎస్సీ (ఫారెస్ట్రీ) /బీవీఎస్సీ & ఏహెచ్/ బీఎఫ్‌ఎస్సీ.
➥ ఫార్మా-డి.
➥ బీఎస్సీ(నర్సింగ్).
అర్హతలు: ఈ ఏడాది ఇంటర్ (ఎంపీసీ/ బైపీసీ) లేదా తత్సమాన పరీక్షలకు హాజరవుతున్నవారు, ఇంటర్ అర్హత ఉన్న విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. ఇంటర్‌లో కనీసం 45 శాతం మార్కులు ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
దరఖాస్తు ఫీజు ఎంతంటే?
➥ ఇంజినీరింగ్ లేదా అగ్రికల్చర్ & ఫార్మాలో ఏదో ఒకదానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.900 చెల్లించాలి.
➥ ఇంజినీరింగ్ లేదా అగ్రికల్చర్ & ఫార్మాలో ఏదో ఒకదానికి దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.500 చెల్లించాలి.
➥ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మా రెండు విభాగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.1800 చెల్లించాలి.
➥ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మా రెండు దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1000 చెల్లించాలి.
ఆలస్య రుసుముతో దరఖాస్తుకు అవకాశం..
ఏప్రిల్ 4 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. అయితే 250 ఆలస్య రుసుమతో ఏప్రిల్ 9 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 14 వరకు, రూ.2500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 18 వరకు, రూ.5000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 24 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
పరీక్ష కేంద్రాలు:
ఎప్‌సెట్ పరీక్షల నిర్వహణకోసం తెలంగాణతోపాటు ఏపీలోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణలో 16 పట్టణాలు/నగరాల్లో, ఏపీలో రెండు నగరాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. తెలంగాణలో నల్లగొండ, కోదాడ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేటలో కేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు. ఇక ఏపీలో కర్నూలు, విజయవాడలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
ముఖ్యమైన తేదీలు..
విషయం | తేదీ |
నోటిఫికేషన్ వెల్లడి | 20-02-2025 |
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం | 25-02-2025 |
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది | 04-04-2025 |
దరఖాస్తుల సవరణ | 06-04-2025 - 08-04-2025. |
రూ.250 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది | 09-04-2025 |
రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది | 14-04-2025 |
రూ.2500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది | 18-04-2025 |
రూ.5000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది | 24-04-2025 |
హాల్‌టికెట్ డౌన్‌లోడ్ | 19-04-2025 |
పరీక్ష తేది (అగ్రి, ఫార్మా) |
29-04-2025 - 30-04-2025. 02-05-2025 - 05-05-2025 |
TG EAPCET 2025 OFFICIAL WEBSITE