Modi Fun With Pawan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీలో సీఎం రేఖా గుప్తా ప్రమాణస్వీకారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన మోదీ.. పవన్ కల్యాణ్ తో సరదాగా సంభాషించారు. దీక్షా వస్త్రాల్లో పవన్ కల్యాణ్ ఉండటంతో పాటు ఇటీవలి కాలంలో తీర్థయాత్రలకు ఎక్కువ సమయం కేటాయిస్తున్న పవన్ కల్యాణ్.. మీరు హిమాలయాలకు వెళ్లే ప్రణాళికల్లో ఉన్నారా అని సరదాకా మోదీ ప్రశ్నించారు. అయితే ఇంకా సమయం ఉందని పవన్ సమాధానం ఇచ్చారు. పవన్ కల్యాణ్ కు నిజంగా హిమాలయాలకు వెళ్లాలన్న ఆలోచన ఉందో లేదో కానీ ఇంకా సమయం ఉందని సమాధానం ఇవ్వడంతో కొత్త ఊహాగానాలు పట్టుకు వచ్చే అవకాశం ఉంది.
స్టేజ్ మీద మోదీ, పవన్ సరదాగా ఏం మాట్లాడుకున్నారో కింద ఉన్న వారికి తెలియదు. కానీ పెద్ద జోకులు వేసుకున్నట్లుగా నవ్వుకోవడంతో మీడియా ప్రతినిధులు.. కార్యక్రమం అయిపోయిన తర్వాత పవన్ కల్యాణ్ ను అసలేం జరిగిందని అడిగారు. పవన్ తమ మధ్య జరిగిన సంభాషణ గురించి వివరించారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల కేరళ, తమళనాడుల్లో నాలుగు రోజుల పాటు పర్యటించారు. పలు ఆలయాలను సందర్శించారు. తర్వాత కుంభమేళాకు కుటుంబ సమేతంగా వెళ్లి పుణ్యస్నానం చేశారు. అలాగే ఆయన సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఉద్యమం చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ చర్యలన్నీ పూర్తి స్థాయి ఆథ్యాత్మకితతో ఉండటంతో ప్రదాని మోదీ.. ఇలా జోక్ చేసినట్లుగా భావిస్తున్నారు. అయితే పవన్ ఇంకా సమయం ఉందని చెప్పడం ఆసక్తికరంగా మారింది.
పవన్ కల్యాణ్ లో అధ్యాత్మిక భావనలు, ప్రశాంతత సాధన కోసం చేసే క్రియలు అంటే ఆసక్తి అని సన్నిహితులు చెబుతారు. ఈ క్రమంలో త్వరలో ఆయన కొద్ది రోజులు రజనీకాంత్ తరహాలో హిమాలయాలకు వెళ్లి వచ్చినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.