జేఎన్టీయూహైదరాబాద్‌లో ఫుల్‌ టైం, పార్ట్‌ టైం పీహెచ్‌డీలో 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఆగస్టు నెలాఖరులో నిర్వహించాల్సి ప్రవేశ పరీక్షలను వాయిదావేశారు. రాష్ట్రంలో ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు యూనివర్సిటీ అధికారులు ఆగస్టు 7న ఒక ప్రకటనలో తెలిపారు. పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అభ్యర్థుల సౌలభ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లిడించారు. ఈక్రమంలోనే పార్ట్‌ టైం పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలను సెప్టెంబర్‌ 14 నుంచి 16 వరకు నిర్వహించడానికి షెడ్యూలు ఖరారు చేశారు.


జేఎన్‌టీయూ గుడ్ న్యూస్, ఇకపై ఆ కాలేజీల్లోనూ ఎంఫిల్, పీహెచ్‌డీ పరిశోధనలకు ఛాన్స్
ఎంఫిల్, పీహెచ్‌డీ పరిశోధనలు చేయాలనుకునేవారికి జేఎన్‌టీయూ హైదరాబాద్ శుభవార్త వినిపించింది. ఇకపై జేఎన్‌టీయూ అనుబంధ కళాశాలల్లోనూ విద్యార్థులు పరిశోధనలు చేసుకునే వెసులుబాటు కల్పించింది. రాష్ట్రంలో 170 ఇంజినీరింగ్ కళాశాలల్లో ఎంఫిల్, పీహెచ్‌డీ పరిశోధనలకు అవకాశం కల్పిస్తున్నట్లు జేఎన్‌టీయూహెచ్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జేఎన్‌టీయూ అనుబంధ ఇంజినీరింగ్ కాలేజీల్లో పీహెచ్‌డీ ప్రవేశాలు, పరిశోధనలను నిర్వహించేందుకుగాను ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 


పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకున్న ఇంజినీరింగ్ కళాశాలలు జులై 28లోపు దరఖాస్తులు సమర్పించాలని అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీటికి యూజీసీ నుంచి స్వయం ప్రతిపత్తి హోదా లేదా న్యాక్, ఎన్‌బీఏ గ్రేడ్ తప్పనిసరిగా ఉండాలి. పరిశోధనల కోసం రూ.25 లక్షలతో కార్పస్ నిధి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ కేంద్రాలను విశ్వవిద్యాలయ సలహా కమిటీ పర్యవేక్షిస్తుంది. పీహెచ్‌డీ ప్రవేశాలకు అనుబంధ కళాశాలలు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసుకోవచ్చు. జేఎన్‌టీయూ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్ అనుమతి పొందాకే ప్రవేశాలు కల్పించాల్సి ఉంటుంది.


ALSO READ:


అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీ.జీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో ప్రవేశాల గడువును పొడిగించారు. ఆగస్టు 16 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. దరఖాస్తు గడువు జులై 31తో ముగియాల్సి ఉన్నప్పటికీ.. అభ్యర్థుల అభ్యర్థన మేరకు ప్రవేశ దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. అభ్యర్థులు ఆగస్టు 16 వరకు ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించాల్సిన అవసరంలేదు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు. 
ప్రవేశాలకు సంబంధించిన పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


నవోదయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ - పరీక్ష విధానం, ఎంపిక, అర్హతల వివరాలు ఇలా!
జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యాసంవత్సరాకిగాను ఆరోతరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ ఏడాది రెండు విడతల్లో ఎంపిక పరీక్ష నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 20న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ ఏడాది నవంబరు 4న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే చాలు.. ఇంటర్‌ దాకా ఉచితంగా చదువు, వసతి, భోజనం కల్పిస్తారు. బోధన కూడా అత్యున్నత ప్రమాణాల్లో ఉంటుంది. ప్రవేశ పరీక్షకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 19న ప్రారంభంకాగా, ఆగస్టు 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.  
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..