జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ విద్యార్థులకు షాకిచ్చింది. క్రెడిట్ ఆధారిత డిటెన్షన్ విధానాన్ని జేఎన్‌టీయూ పునరుద్ధరించినట్లు ప్రకటించింది. ఈ ఏడాది నుంచి విద్యార్థులు నిర్దేశిత క్రెడిట్స్ సాధించకపోతే విద్యార్థులు మరుసటి సంవత్సరానికి ప్రమోట్ అయ్యేందుకు వీలుండదు. ఈమేరకు జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ ఆదేశాలు జారీ చేశారు.
జేఎన్‌టీయూ పరిధిలోని కళాశాలల్లో ఇంజినీరింగ్‌లో చేరిన విద్యార్థులు ఏటా నిర్దేశిత క్రెడిట్స్ సాధించాల్సి ఉంటుంది. అలాగే హాజరు 75 శాతం ఉంటేనే సెమిస్టర్ పరీక్షలు రాసేందుకు అనుమతిస్తారు. కరోనాతో రెండేళ్లు హాజరుతోపాటు క్రెడిట్ ఆధారిత డిటెన్షన్ విధానాన్ని యూనివర్సిటీ రద్దు చేసింది. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆ విధానాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ విధానం ప్రకారం ఇంజినీరింగ్ విద్యార్థులు మొదటి ఏడాది నుంచి రెండో ఏడాదిలోకి వెళ్లాలంటే 18 క్రెడిట్స్, రెండో ఏడాది నుంచి మూడో ఏడాదిలోకి వెళ్లాలంటే 47 క్రెడిట్స్, 3 నుంచి నాలుగో ఏడాదిలోకి వెళ్లాలంటే 73 క్రెడిట్స్ సాధించాల్సి ఉంటుంది. ఇక లేటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశాలు పొందిన విద్యా్ర్థులు రెండో ఏడాది నుంచి మూడో ఏడాదిలోకి వెళ్లాలంటే 25 క్రెడిట్స్, 3 నుంచి నాలుగో ఏడాదిలోకి వెళ్లాలంటే 51 క్రెడిట్స్ ఉండాలి. ఒకవేళ విద్యార్థులు నిర్దేశిత క్రెడిట్స్ సాధించలేకపోతే మరుసటి ఏడాదిలోకి ప్రవేశించే వీలుండదు. ప్రస్తుతం రెండు, మూడో ఏడాది విద్యార్థులు 2022-23లో మూడు, నాలుగో ఏడాదిలోకి ప్రవేశించాలనుకుంటే నిర్దేశిత క్రెడిట్స్ సాధించాలని జేఎన్‌టీయూ స్పష్టం చేసింది.
విద్యార్థుల మండిపాటు..
క్రెడిట్ ఆధారిత డిటెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తున్నట్లు యూనివర్సిటీ ఇచ్చిన ఆదేశాలపై విద్యార్థులు మండిపడుతున్నారు. వాస్తవానికి ప్రస్తుతం ఇంజినీరింగ్ రెండో, మూడో ఏడాదిలో ఉన్న విద్యార్థులు.. కరోనా సమయంలో మొదటి, రెండో ఏడాదిలో ఉన్నవారే. అప్పట్లో తరగతులు సరిగా జరగలేదు. ఈ కారణంగా వారు పరీక్షలు సరిగా రాయలేకపోయారు. దీంతో క్రెడిట్స్ తక్కువగా వచ్చాయని, ఇప్పటికిప్పుడు క్రెడిట్స్ దక్కించుకోవాలంటే ఎలా సాధ్యమని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. తమకు మరో ఏడాది వెసులుబాటు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు.
Also Read:
NEET UG Counselling: నీట్ యూజీ 2022 కౌన్సెలింగ్ షెడ్యూలు వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే!
నీట్ యూజీ (NEET UG) 2022 కౌన్సెలింగ్ ప్రక్రియ అక్టోబరు 11 నుంచి ప్రారంభంకానుంది. కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన షెడ్యూలును మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) అక్టోబరు 4న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో షెడ్యూలును అందుబాటులో ఉంచింది. నీట్ యూజీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్ తేదీలను చూసుకోవచ్చు.
నీట్ యూజీ కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
జేఎన్‌టీయూహెచ్‌లో పార్ట్ టైమ్ పీజీ కోర్సులు, చివరితేది ఎప్పుడంటే?
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి ఎంటెక్, ఎంబీఏ పార్ట్‌టైమ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబరు 17 వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబరు 15 నుంచి 17 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
కోర్సులు, ముఖ్యమైన తేదీల కోసం క్లిక్ చేయండి..
EFLU: ఇఫ్లూలో పార్ట్-టైమ్ లాంగ్వేజ్ కోర్సులు, దరఖాస్తు చేసుకోండి!
హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) 2022-2023 విద్యా సంవత్సరానికి వివిద విదేశీ భాషల్లో పార్ట్ టైమ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబరు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సులు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
జగనన్న విదేశీ విద్యా దీవెన దరఖాస్తు గడువు పొడిగింపు, ఎన్నిరోజులంటే?
విదేశీ విశ్వవిద్యాలయాలు/విద్యా సంస్థల్లో పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్ అభ్యసించాలనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు విద్యార్థులకు నిర్దేశించిన 'జగనన్న విదేశీ విద్యాదీవెన' పథకం దరఖాస్తు గడువును అక్టోబరు 30 వరకు పొడిగించారు. వాస్తవానికి సెప్టెంబరు 30తో గడువు ముగియగా.. మరో నెలపాటు పెంచారు.
జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..