YSRCP MLA: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జీ, ఎమ్మెల్యే పింఛన్లపై షాకింగ్ కామెంట్లు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలి.. లేకపోతే పింఛన్లు ఆగిపోతాయని స్థానిక ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అయితే అన్నవరంలో గడప గడపకు మన ప్రభుత్వంలో ఆయన గురువారం పాల్గొని.. పలువురి ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే మహిళలతో మాట్లాడుతూ.. షాకింగ్ కామెంట్లు చేశారు. మీకు ఇళ్ల స్థలాలు, పింఛన్లు వంటివన్నీ వైఎస్ జగన్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీ ఇచ్చిందని తెలిపారు.
గతంలో ఇచ్చిన హామీ మేరకు వచ్చే జనవరి నుంచి ప్రస్తుతం ఇస్తున్న రూ. 2500 పెన్షన్‌ను రూ. 2750 చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఆ తర్వాత ఏడాది మూడు వేలు చేస్తామన్నారు. డైరక్ట్ మనీ ట్రాన్స్ ఫర్ ద్వారా ఇప్పటికీ ప్రజలకు లక్షా 71 వేల 244 కోట్లను పంపిణీ చేశామని జగన్ చెప్పారు.
39 నెలల్లోనే రూ. 51 వేల కోట్లు పంపిణీ!
మహిళల కోసం నాలుగు పథకాలకు 39 నెలల్లోనే రూ. 51 వేల కోట్లు పంపిణీ చేశామన్నారు. అప్పుడూ ఇప్పుడూ ఒకే బడ్జెట్ ఉన్నా ఈ పథకాలన్నీ ఎలా అమలు చేస్తున్నామో ప్రజలు ఆలోచించాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో దోచుకో.. దాచుకో.. తినుకో అనే స్కీమ్‌ను అణలు చేసేవారని విమర్శించారు.ఇది మహిళల ప్రభుత్వమని.. జగన్ స్పష్టం చేశారు.
ఒంటరి మహిళలకు షాక్..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒంటరి మహిళలకు షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకూ పెన్షన్‌కు అర్హత ఉన్న వయసును ఒక్కసారిగా పెంచేసింది. ప్రస్తుతం ఒంటరి గ్రామాల్లో 30 ఏళ్ల నుంచి.. పట్టణాల్లో 35 ఏళ్ల నుంచి పెన్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు యాభై ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే యాభై ఏళ్లు నిండిన ఒంటరి మహిళలకు మాత్రమే ఇక నుంచి పెన్షన్ ఇస్తారు. ఈ ఆదేశాలను పంచాయతీరాజ్ శాఖ పదహారో తేదీన విడుదల చేసింది.
తాజాగా జారీ చేసిన ఆదేశాల్లో ఒంటరి మహిళ పెన్షన్ పొందాలంటే యాభై ఏళ్లు నిండి ఉండటమే కాదు కచ్చితంగా దారిద్ర్య రేఖ దిగువన ఉండాలని...స్థానికంగా నివసించాలని అలాగే.. ఆధార్ కార్డ్ సమర్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే సమయంలో ఏ ఇతర సామాజిక పించన్ పథకం లో భాగం అయినా పెన్షన్ వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. సాధారణంగా ఒంటరి మహిళలు అంటే పెళ్లి కాని వాళ్లు, డైవర్స్ తీసుకున్న వాళ్లు, భర్త చనిపోయిన వాళ్లు ఉంటారు. పెళ్లి కాని వాళ్లకు అయినా 35 ఏళ్ల నుంచి పెన్షన్ ఇస్తున్నారు . విడాకులు తీసుకున్న వారికీ అంతే. భర్త చనిపోయి ఉంటే గ్రామాల్లో 30 పట్టణాల్లో 35 ఏళ్ల నుంచి పెన్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ మూడు కేటగిరీల్లోనూ యాభై ఏళ్లు నిండి ఉండాలని ప్రభుత్వం తేల్చేసింది.