జేఈఈ మెయిన్ పరీక్షలను నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ముందుగా ప్రకటించిన కాలపట్టికను అనుసరించడం లేదు. అందుకు కారణాలను కూడా వివరించట్లేదు. ఆ సంస్థ పనితీరుపై నిపుణులు, తల్లిదండ్రుల నుంచి విమర్శలు వస్తున్నాయి. జేఈఈ మెయిన్ సెషన్-2 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7 వరకు ఉంటుందని గతంలోనే ఎన్టీఏ ప్రకటించినప్పటికీ.. మూడురోజులు దాటినా ఇప్పటివరకు వెబ్‌సైట్ లింకును అందుబాటులోకి తేలేదు. ఆలస్యానికిగల కారణాలను కూడా ఎన్టీఏ తెలపడంలేదు. ఫలానా తేదీలో దరఖాస్తు ప్రారంభమవతుందని కూడా చెప్పడం లేదు. మరోవైపు జేఈఈ మెయిన్ సెషన్-2 వాయిదా వేయాలని డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఇది కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యం కావడానికి కారణం కావొచ్చని నిపుణులు అంటున్నారు


జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షలకు దాదాపు 9 లక్షలకుపైగా విద్యార్థులు  రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో పేపర్-1 పరీక్షకు 8.6 లక్షలు, పేపర్-2 పరీక్షకు 46 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. మ‌రోవైపు జేఈఈ మెయిన్ రెండో విడుత పరీక్షలను ఏప్రిల్ 6 నుంచి 12 వ‌ర‌కు నిర్వహించనుండగా.. రిజిస్ట్రేష‌న్ ప్రక్రియ ఫిబ్రవరి 7న ప్రారంభంకావాల్సి ఉంది. అయితే ఇంతవరకు రిజిస్ట్రేషన్ లింకు అందుబాటులోకి రాలేదు. సెషన్-1 ప‌రీక్ష రాసిన విద్యార్థులు కూడా సెషన్-2కు ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 06, 07, 08, 09, 10, 11, 12 తేదీల్లో సెషన్-2 పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. పరీక్ష అడ్మిట్ కార్డులను మార్చి చివరివారంలో విడుదల చేసే అవకాశం ఉంది. 


జేఈఈ మెయిన్ సెషన్-1 ఫలితాలను ఫిబ్రవరి 7న వెల్లడించిన సంగతి తెలిసిందే. ఫలితాల్లో దేశవ్యాప్తంగా 20 మంది విద్యార్థులు వంద పర్సంటైల్‌ సాధించారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు విద్యార్థులు ఉన్నారు. అభినవచౌదరి, మాజేటి అభినీత్‌, దుగ్గినేని యోగేశ్‌, గుత్తికొండ అభిరామ్‌, వివాలా చిద్విలాస్‌ రెడ్డి వంద పర్సంటైల్‌ సాధించారు. ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్‌లోని హపూర్‌కు చెందిన కవలలు నిపుణ్‌, నికుంజ్‌ వందశాతం పర్సంటైల్‌ సాధించారు. 


Also Read:


సీయూఈటీ యూజీ రిజిస్ట్రేషన్ ప్రారంభం, పరీక్ష తేదీలివే!
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ(CUET UG) 2023 పరీక్షకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. సెంట్రల్ యూనివర్సిటీల్లో డిగ్రీ కోర్సులను అభ్యసించేందుకు విద్యార్థులు ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అయితే గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్‌లో ఎలాంటి మార్పులు లేవని యూజీసీ ఛైర్మన్ జగదీష్ కుమార్ వెల్లడించారు. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ని ఆశ్రయించి cuet.samarth.ac.in లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
పరీక్ష పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మేనేజ్‌మెంట్ విద్యకు సరైన మార్గం ‘మ్యాట్’, ఫిబ్రవరి 2023 నోటిఫికేషన్ విడుదల!
ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేట్‌ (ఏఐఎంఏ)-2023 ఫిబ్రవరి సెషన్‌ మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (MAT) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ, ఇతర ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏఐఎంఏ మ్యాట్‌ను ఏటా నాలుగుసార్లు (ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్) నిర్వహిస్తుంది. మ్యాట్ 2022 ఫిబ్రవరి నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది.
దరఖాస్తు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..