JEE Advanced 2024 Toppers: జూన్ 9 వెలువడిన జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 ఫలితాలకు సంబంధించి మొత్తం మొత్తం 1,80,200 మంది హాజరుకాగా.. 48,248 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కేవలం 27 శాతం అభ్యర్థులు మాత్రమే అర్హత సాధించారు. పరీక్షలో అర్హత సాధించినవారిలో 40,284 మంది బాలురు ఉండగా.. 7,964 మంది బాలికలు ఉన్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు మొత్తం 1,43,637 మంది బాలురు దరఖాస్తు చేసుకోగా.. 1,39,180 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష రాసినవారిలో 40,284 అర్హత సాధించారు. ఇక పరీక్షకు 42,947 మంది బాలికలు దరఖాస్తు చేసుకోగా..41,020 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 7,964 మంది మాత్రమే అర్హత సాధించారు. 

జేఈఈ అడ్వాన్స్‌డ్-2024 ఫలితాలు, ఫైనల్ ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి..

సత్తా చాటిన తెలుగు విద్యార్థులు..
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. టాప్-10 జాబితాల్లో ఐఐటీ మద్రాస్ జోన్ నుంచి ఏకంగా నలుగురు విద్యార్థులు టాపర్లుగా నిలిచారు. వీరంతా తెలుగు విద్యార్థులే కావడం విశేషం. ఇక ఐఐటీ బాంబే జోన్ విద్యార్థులు ముగ్గురు, ఐఐటీ ఢిల్లీ విద్యార్థులు ఇద్దరు, ఐఐటీ రూర్కీ జోన్ పరిధిలో ఒక్కరు స్థానం సంపాదించారు. 

➥ బాలుర కేటగిరీలో ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన వేద్ లహోటీ టాపర్‌గా నిలిచాడు. మొత్తం 360 మార్కులకు 355 మార్కులతో కామన్ ర్యాంకింగ్ లిస్టులో మొదటి స్థానంలో నిలిచాడు. ఆ తర్వాతి స్థానాల్లో ఆదిత్య (346), భోగల్‌పల్లి సందేశ్‌ (338), రిథమ్‌ కేడియా (337), పుట్టి కుషాల్‌ కుమార్‌ (334) టాప్-5లో నిలిచారు.

➥ బాలికల విభాగంలో ఐఐటీ బాంబే జోన్‌కు చెందిన ద్విజా ధర్మేశ్ కుమార్ పటేల్ మొత్తం 360 మార్కులకు 332 మార్కులతో బాలికల విభాగంలో మొదటి స్థానంలో నిలవగా, కామన్ ర్యాంకింగ్ లిస్టులో 7వ స్థానంలో నిలిచింది. 

టాప్-10 ర్యాంకర్ల వీరే...

ర్యాంకు

పేరు

సాధించిన మార్కులు

జోన్

1

వేద్ లహోతి

355

ఐఐటీ ఢిల్లీ

2

ఆదిత్య

346

ఐఐటీ ఢిల్లీ

3

భోగాలపల్లి సందేశ్ (కర్నూలు)

338

ఐఐటీ మద్రాస్

4

రిథమ్ కేడియా

337

ఐఐటీ రూర్కీ

5

పుట్టి కుషాల్ కుమార్ (చీరాల)

334

ఐఐటీ మద్రాస్

6

రాజ్‌దీప్ మిశ్రా 

333

ఐఐటీ బాంబే

7

ద్విజా ధర్మేశ్‌కుమార్ పటేల్ 

332

ఐఐటీ బాంబే
8

కోడూరు తేజేశ్వర్ (కర్నూలు)

331

ఐఐటీ మద్రాస్
9

ధ్రువిన్ హేమంత్ దోషి

329

ఐఐటీ బాంబే

10

అల్లాడబోయిన సిద్విక్ సుహాస్ 
(హైదరాబాద్)

329

ఐఐటీ మద్రాస్

 
జోన్లవారీగా టాప్-5 ర్యాంకుర్లు..
 

జోన్

పేరు

ర్యాంకు
(CRL)

ఐఐటీ బాంబే

రాజ్‌దీప్ మిశ్రా

6

 

ద్విజా ధర్మేశ్ కుమార్ పటేల్

7

 

ధ్రువిన్ హేమంత్ దోషి 

9

 

ష్వాన్ థామస్ కోషి

15

 

ఆర్యన్ ప్రకాశ్

17

ఐఐటీ ఢిల్లీ

వేద్ లహోటీ

1

 

ఆదిత్య

2

 

 రాఘవ శర్మ

12

 

బిస్మిత్ సాహో

16

 

శివాన్ష్ నాయర్

18

ఐఐటీ గువాహటి

అవిక్ దాస్

69

 

అనికేత్ కుమార్

96

 

ఇర్రాద్రి బాసు కౌహంద్

279

 

జ్యోతిష్మాన్ సైకియా

285

 

ప్రథమ్ కుమార్

343

ఐఐటీ కాన్పూర్

మన్య జైన్

75

 

శుభం నాయర్

131

 

గర్వ్ చౌద

163

 

శ్రేష్ఠ గుప్తా

191

 

సిద్ధార్థ్ అగర్వాల్

306

ఐఐటీ భువనేశ్వర్

మట్చ బాలాదిత్య

11

 

మజ్జి రిషి వర్ధన్ 

59

 

బిబాస్వన్ బిశ్వాస్

85

 

భాగ్యాన్ష్ సాహు

86

 

అనిష్ దరుక

109

ఐఐటీ మద్రాస్

భోగాలపల్లి సందేశ్

3

 

పుట్టి కుశాల్ కుమార్

5

 

కోడూరు తేజేశ్వర్

8

 

అల్లాడబోయిన ఎస్‌ఎస్‌డీబీ సిద్విక్ సుహాస్ 

10

 

గంగా శ్రేయాస్

13

ఐఐటీ రూర్కీ

రిథమ్ కేడియా

4

 

వేదాంత్ సైనీ

14

 

నమిష్ బన్సాల్

22

 

అన్ష్ గార్గ్ 

23

 

స్పర్ష్ గుప్తా

33


కేటిగిరీలవారీగా టాపర్ల వివరాలు..

ర్యాంకింగ్ జాబితా తయారీ ఇలా..

ర్యాంకింగ్ లిస్ట్

ప్రతి సబ్జెక్ట్‌లో కనీస మార్కుల శాతం

మొత్తం మార్కుల
కనీస శాతం

కామన్ ర్యాంకింగ్ లిస్ట్ (CRL)

8.68%

30.34%

ఓబీసీ-ఎన్‌సీఎల్
ర్యాంకింగ్ లిస్ట్ 

7.8%

27.30%

జనరల్- ఈడబ్ల్యూఎస్ ర్యాంకింగ్ లిస్ట్

7.8%

27.30%

ఎస్సీ- ర్యాంకింగ్ లిస్ట్

4.34%

15.17%

ఎస్టీ - ర్యాంకింగ్ లిస్ట్

4.34%

15.17%

కామన్ పీడబ్ల్యూడీ  ర్యాంకింగ్ లిస్ట్
(CRL-PwD)

4.34%

15.17%

ఓబీసీ-ఎన్‌సీఎల్ పీడబ్ల్యూడీ  ర్యాంకింగ్ లిస్ట్

4.34%

15.17%

జనరల్-ఈడబ్ల్యూఎస్-PwD ర్యాంకింగ్ లిస్ట్

4.34%

15.17%

ఎస్సీ-పీడబ్ల్యూడీ  ర్యాంకింగ్ లిస్ట్

4.34%

15.17%

ఎస్టీ-పీడబ్ల్యూడీ  ర్యాంకింగ్ లిస్ట్

4.34%

15.17%

ప్రిపరేటరీ కోర్సు (PC) ర్యాంకింగ్ లిస్ట్ 

2.17%

7.58%

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసంక్లిక్ చేయండి..