Practice Tests for JEE (Advanced) 2024: దేశవ్యాప్తంగా ఐఐటీల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2024 సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ఉపయోగపడే ప్రాక్టీస్‌ టెస్టులు అందుబాటులో వచ్చాయి. పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు మద్రాస్‌ ఐఐటీ ప్రాక్టీస్‌ టెస్టులను అందిస్తోంది. పేపర్ 1 మరియు పేపర్ 2 కోసం మాక్ టెస్ట్‌లను jeeadv.ac.inలో అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.   పరీక్ష సరళి తెలియడంతో పాటు సమయపాలన తదితర అంశాల అనుభవాన్ని ఈ ప్రాక్టీస్‌ టెస్టులు అందిస్తాయి. అంతేకాకుండా అభ్యర్థులు తమ బలాలు, బలహీనతల్ని అంచనా వేసుకొని మరింతగా తమను తాము మెరుగుపరుచుకొని రాణించేందుకు దోహదపడతాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుండి ప్రాక్టీస్ పరీక్షలను యాక్సెస్ చేయాలని అధికారులు సూచించారు. ప్రాక్టీస్ టెస్టులు పరీక్షలకు సిద్ధమయ్యేవారికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ ప్రాక్టీస్ పరీక్షల ద్వారా అభ్యర్థులు JEE అడ్వాన్స్‌డ్ పరీక్ష యొక్క క్లిష్ట స్థాయిని అంచనా వేయవచ్చు. ప్రశ్నల తీరుపై ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులలో విశ్వాసాన్ని పెంచడంలో నమూనా పరీక్షలు సహాయపడతాయి.


JEE అడ్వాన్స్‌డ్ 2024 ప్రాక్టీస్ టెస్ట్‌లు: మాక్ టెస్ట్‌ని ఎలా ప్రయత్నించాలి?


Step 1: ముందుగా అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి - https://jeeadv.ac.in


Step 2: ఆపై, హోమ్‌పేజీలో మెనూబార్‌లో కనిపించే 'Resources' బటన్ మీద క్లిక్ చేయాలి.


Step 3: ఆ తర్వాత ' Paper-1/ Paper-2 ప్రాక్టీస్ టెస్ట్ కనిపిస్తాయి. వాటిలో కావాల్సిన దాన్ని ఎంపికచేసుకోవాలి.


Step 4: ఆ తర్వాత 'Login'పై క్లిక్ చేయాలి.


Step 5: ప్రాక్టీస్ పరీక్షలు మీ స్క్రీన్‌పై ప్రదర్శించబడతాయి.


Step 6: అభ్యాస పరీక్షను పూర్తి చేయండి.


Step 7: 'Submit' బటన్ మీద క్లిక్ చేయాలి.


పేపర్-1 ప్రాక్టీస్ టెస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పేపర్-2 ప్రాక్టీస్ టెస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..


ఏప్రిల్ 27 నుంచి JEE అడ్వాన్స్‌డ్ దరఖాస్తులు..
జేఈఈ అడ్వాన్స్‌డ్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 27 నుంచి ప్రారంభంకానుంది. మే 7 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకరం మే 26న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష యథాతథంగా పరీక్ష నిర్వహించనున్నారు. ఆరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష; మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 జరుగనుంది. జూన్ 2న ప్రాథమిక కీ విడుల చేసి, జూన్ 3 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం జూన్ 9న ఫైనల్‌కీతోపాటు ఫలితాలను వెల్లడించనున్నారు. ఆర్కిటెక్చర్ ఆప్టిడ్యూట్ టెస్ట్ (AAT)-2024 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 9 నుంచి ప్రారంభంకానుంది. జూన్ 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. పరీక్షను జూన్ 12న నిర్వహించనున్నారు.


JEE Advanced 2024 ముఖ్యమైన తేదీలివే..


➥ JEE (Advanced) 2024 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 27.04.2024 (10:00 IST)


➥ JEE (Advanced) 2024 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేది: 07.05.2024 (17:00 IST)


➥ పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరితేది: 10.05.2024 (17:00 IST)


➥ అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్:  17.05.2024 (10:00 IST) - 26.05.2024 (14:30 IST)


➥ పీడబ్ల్యూడీ అభ్యర్థుల ద్వారా స్క్రైబ్‌ ఎంపిక (40% కంటే తక్కువ వైకల్యం ఉన్న అభ్యర్థులు రాయడంలో ఇబ్బంది ఉన్నవారు): 25.05.2024.


➥ JEE (Advanced) 2024 పరీక్ష తేది: 26.05.2024 (శనివారం)


    ⫸ పేపర్-1: 09:00-12:00 IST


    ⫸ పేపర్-2: 14:30-17:30 IST


➥ అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు అందుబాటులో: 31.05.2024 (17:00 IST) నుండి


➥ JEE (Advanced) 2024 ప్రొవిజినల్ ఆన్సర్ కీ వెల్లడి: 02.06.2024 (10:00 IST)


➥ JEE (Advanced) 2024 ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ: 02.06.2024 (10:00 IST) - 03.06.2024 (17:00 IST)


➥  JEE (Advanced) 2024 ఫలితాలు, ఫైనల్ ఆన్సర్ కీ వెల్లడి: 09.06.2024 (10:00 IST)


➥ ఆర్కిటెక్చర్ ఆప్టిడ్యూట్ టెస్ట్ (AAT)-2024 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 09.06.2024 (10:00 IST)


➥ ఆర్కిటెక్చర్ ఆప్టిడ్యూట్ టెస్ట్ (AAT)-2024 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేది: 10.06.2024 (17:00 IST)


➥ జాయింట్ సీట్ అల్లొకేషన్ (JoSAA) 2024 ప్రక్రియ ప్రారంభం: 10.06.2024 (17:00 IST)


➥ ఆర్కిటెక్చర్ ఆప్టిడ్యూట్ టెస్ట్ (AAT)-2024 పరీక్ష తేది: 12.06.2024 (09:00 IST - 12:00 IST)


➥ ఆర్కిటెక్చర్ ఆప్టిడ్యూట్ టెస్ట్ (AAT)-2024 ఫలితాల వెల్లడి: 15.06.2024 (17:00 IST)


JEE (Advanced) 2024  Schedeule


Website


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...