ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ప్రవేశాలు కల్పించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష దేశవ్యాప్తంగా నేడు జరుగనుంది. ఆదివారం (ఆగస్టు 28) ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష నిర్వహిస్తారు. రెండు పేపర్లు రాస్తేనే ర్యాంకులు కేటాయించనున్నారు.


హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి.. JEE (Advanced) 2022 Admit Cards

ఈ పరీక్ష కోసం దేశవ్యాప్తంగా 1.60 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి 30 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరికోసం తెలంగాణలో 14, ఆంధ్రప్రదేశ్‌లో 28 ఆన్‌లైన్‌ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు సెప్టెంబర్‌ 11న వెలువడనున్నాయి. అదేనెల 12 నుంచి జోసా కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది. 

ఏడాది అడ్వాన్స్‌డ్‌ పరీక్షను ఐఐటీ బాంబే నిర్వహిస్తున్నది. కాగా, ఇందులో ఉత్తీర్ణులైనవారికి దేశంలోని 23 ఐఐటీల్లో బీటెక్ సీట్లు కేటాయించనున్నారు. సీట్ల సంఖ్యకు రెండున్నర రెట్ల మంది ఉత్తీర్ణులయ్యేలా కటాఫ్‌ మార్కులు నిర్ణయిస్తారు. 


Also Read: JoSAA 2022 Schedule: 'జోసా' కౌన్సెలింగ్ షెడ్యూలు వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే!


దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్దేశించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్‌డ్ 2022 పరీక్ష అడ్మిట్‌‌కార్డును ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బాంబే ఆగస్టు 23న విడుదల చేసింది. ఆగస్టు 28 వరకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 28న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించనున్నారు. రెండున్నర లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్షలో రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కు మూడు గంటల సమయం కేటాయించారు.


ఈఈ అడ్వాన్స్‌డ్- 2022 కోసం ఆగస్టు 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రారంభ దశలో విదేశీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి మాత్రమే అనుమతించారు. ఇక భారతీయ విద్యార్థుల కోసం జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాల తర్వాత జేఈఈ అడ్వాన్స్‌డ్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 8 నుంచి 12 వరకు కొనసాగింది. జేఈఈ మెయిన్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవాలి.


ముఖ్యమైన తేదీలు..
✪ జేఈఈ అడ్వా్న్స్డ్ రిజిస్ట్రేషన్: 08.08.2022 - 11.08.2022.


✪ ఫీజు చెల్లించడానికి చివరితేది: 12.08.2022.


✪ అడ్మిట్‌కార్డుల డౌన్‌లోడ్: 23.08.2022 - 28.08.2022.


✪ జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022 పరీక్ష తేది: 28.08.2022.



Also Read: ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు ఎప్పుడంటే?



పరీక్ష సమయం: 


పేపర్-1: ఉ. 9.00 గం. - మ.12:00 గం. వరకు.


పేపర్-2: మ.14:30 - సా.17:30 గం. వరకు.


✪ ప్రాథమిక కీ: 03.09.2022.


✪ ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ: 01.09.2022 - 04.09.2022. 
✪ తుది ఆన్సర్ కీ: 11.09.2022.
✪ ఫలితాల వెల్లడి: 11.09.2022.

* ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2022

✪ రిజిస్ట్రేషన్ ప్రక్రియ: 11.09.2022 - 12.09.2022.
✪ జాయింట్ సీట్ అలొకేషన్ ప్రారంభం (JoSAA): 12.09.2022.
✪ ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్: 14.09.2022.


✪ ఫలితాల వెల్లడి: 17.09.2022


JEE (Advanced)-2022: Information Brochure

JEE (Advanced)-2022: Online Registration Portal



మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..


జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్ (అడ్మిట్ కార్డు) తప్పనిసరిగా తీసుకెళ్లాలి. పరీక్ష కేంద్రానికి వీలైనంత త్వరంగా చేరుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు హాల్‌టికెట్‌తోపాటు ఒరిజినల్ ఐడీ కార్డు, పెన్నులు, పెన్సిళ్లు తీసుకెళ్లాల్సి ఉంటుంది.