August 28th RasiPhalalu


మేషం
మీకుండే సందేహ స్వభావం వల్ల ఓటమి కలిగే అవకాశం ఉంది. మీకుండే ఉత్సాహం, హుషారు, సరదాగా ఉండే తత్వం మీ చుట్టూ ఉన్న వారిని ఉల్లాసపరుస్తుంది. మీ జీవితభాగస్వామే మీకు లభించిన వరం అని ఈ రోజు తెలుసుకుంటారు. ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఆ ప్రయాణంలో ఓ బాటసారిని కలుసుకుంటారు. ఆ ప్రయాణం మంచి అనుభూతులను మిగులుస్తుంది.


వృషభం 
పనిచేసేచోట, ఇంట్లో ఒత్తిడి ఉంటుంది. దీని వల్ల మీకు చాలా కోపం పెరుగుతుంది. ఆర్ధికంగా ఎలాంటి ఢోకా ఉండదు. ఈ రోజు మీ మనస్సు ఆధ్యాత్మిక విషయాలపైకి మళ్లు తుంది. దీని వల్ల మీకు మానసిక ప్రశాంతత దక్కుతుంది. 


మిథునం
అతిగా తినడం మానుకోండి, ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారాన్ని తగ్గించాలన్న అవసరం మీకు తెలుస్తుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. సరిపడినంత డబ్బు చేతిలో ఉండక ఇబ్బంది పడతారు. జీవిత భాగస్వామితో మాత్రం సంతోషంగా గడుపుతారు. అలాగే తీసుకునే ఏదైనా పెద్ద నిర్ణయాలు ఈరోజు ఇంట్లో వారికి చెప్పే అవకాశం ఉంది. దీని వల్ల భవిష్యత్తులో మంచే జరుగుతుంది. 


కర్కాటకం
ఈ రోజు మీరు కొన్ని ఆర్ధిక నష్టాలను ఎదుర్కొంటారు. దీనివల్ల ఈ రోజంతా మూడ్ ఆఫ్‌గా అనిపిస్తుంది. అయితే మీ పిల్లలు, మనుమలు మీలో ఆనందాన్ని నింపుతారు. ఈ రోజు ఉద్యోగం,పని ఒత్తిడి అధికంగా ఉంటుంది కాబట్టి కంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. 


సింహం
వ్యాపారంలో లేక ఉద్యోగంలో అలసత్వంగా ఉండడం వల్ల ఆర్ధికంగా నష్టపోతారు. కానీ మీ సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు. వారు మీ మీ కలలను నిజం చేసేలా ఎదుగుతున్నట్టు ఈ రోజు గుర్తిస్తారు. ఈరోజు మీ కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. కుటుంబంతో గడిపిన అత్యుత్తమ రోజుగా ఈరోజు మిగిలిపోతుంది. 


కన్య
బండి నడిపేటప్పుడు జాగ్రత్త పడండి, ముఖ్యంగా మలుపులు ఉన్నచోట మెల్లగా వెళ్లండి. మీరు జాగ్రత్తగా నడిపినా, ఎదుటి వారి నిర్లక్ష్యం వల్ల మీకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు పనిఒత్తిడి తక్కువగా ఉంటుంది. మీకు సన్నిహితంగా ఉండే సహోద్యోగులతో అభిప్రాయ బేధాలు వచ్చే అవకాశం ఉంది. 


తులా 
మీ స్వభావంతో మీ వివాహజీవితాన్ని నాశనం చేసుకోకండి. లేకపోతే జీవితంలో పశ్చాత్తాపడాల్సి వస్తుంది. ఈరోజు మీ అమ్మగారి తరపునుండి ధనలాభం సూచిస్తోంది. అంటే అమ్మగారి తరుపు వారు ఎవరైనా ధనసాయం చేసే అవకాశం ఉంది. ఈరోజు మీరు చాలా బిజీగా ఉంటారు. వైవాహిక జీవితం మాత్రం ఒడిదొడుకుల్లో సాగుతుంది. 


వృశ్చికం 
ఈ రోజంగా మీరు బిజీగా గడుపుతారు, కానీ ఆరోగ్యంగా ఉంటారు. ఇంట్లో మాత్రం పరిస్థితులు మారతాయి. గొడవలు పెరుగుతాయి. ఆ సమయంలో మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. మీ జీవిత భాగస్వామితో కలహాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. 


ధనుస్సు 
డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. మీ నిర్లక్ష్య వైఖరి మీ కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేస్తుంది. ఏదైనా కొత్త పని,ప్రాజెక్టు, ఉద్యోగం మొదలుపెట్టేముందు వారికి దాని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీకు ఇష్టమైన వారి నుంచి కానుకలు అందుకుంటారు. వైవాహిక జీవితం బావుంటుంది. 


మకరం 
ఈ రోజు మీకు శారీరకంగా, మానసికంగా బలహీనంగా ఉంటుంది. అందుకే బలమైన ఆహారం తిని విశ్రాంతి తీసుకోవాలి. కొన్ని ఆర్ధికనష్టాలు తప్పవు. మీ సహోద్యోగుల్లో ఒకరికి ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల మీరు సాయం చేయాల్సి వస్తుంది. 


కుంభం 
మీ చక్కటి ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది. అదనంగా డబ్బు సంపాదించేందుకు ఆలోచనలు చేస్తారు. ఇంటిని శుభ్రపరిచే ప్రణాళికలు వేసుకుంటారు. జీవితభాగస్వామితో ఈరోజు అద్భుతంగా గడుస్తుంది.  


మీనం 
అనుకోని ప్రయాణం చేయాల్సి వస్తుంది. దీని వల్ల అలసట, చికాకు పెరుగుతాయి. ఎక్కడున్నా పనులు పూర్తి చేసుకుని త్వరగా ఇంటికి వెళ్లడం ఉత్తమం. ఈ రోజు మీకు ధనాన్ని ఖర్చుపెట్టాల్సి అవసరం రాదు, మీ కన్నా పెద్దవారు మీకోసం కూడా ఖర్చులను భరిస్తారు. కుటుంబంతో సంతోషంగా గడిపే రోజు ఇది.