ISRO YUVIKA Programme 2024: ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్(ISRO) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పాఠశాల విద్యార్థుల కోసం నిర్వహించే ‘యువ విజ్ఞాని’ (Yuvika) కార్యక్రమానికి దరఖాస్తులు కోరుతోంది. ఫిబ్రవరి 20 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని ‘ఎక్స్‌’లో తెలిపింది. ‘క్యాచ్‌ దెమ్‌ యంగ్‌’ పేరిట రెండు వారాల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో అంతరిక్ష సాంకేతికత, విజ్ఞానం, అప్లికేషన్లపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. 2024 జనవరి 1 నాటికి 9వ తరగతి చదువుతున్నవారు అర్హులు. విద్యార్థి దశలోనే విజ్ఞానం, సాంకేతికత, ఇంజినీరింగ్‌, మ్యాథమేటిక్స్‌ (స్టెమ్‌) అంశాలపై అవగాహన కల్పించి, తద్వారా వారిని పరిశోధనల వైపు దృష్టి మళ్లించటమే లక్ష్యమని ఇస్రో వెల్లడించింది.


అంతరిక్ష సాంకేతికత, అంతరిక్ష శాస్త్ర విజ్ఞానం, స్పేస్ అప్లికేషన్స్ లాంటి అంశాల్లో విజ్ఞానం పొందేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. అంతరిక్ష పరిశోధనలపై విద్యార్థినీవిద్యార్థుల్లో ఉన్న ఆసక్తిని గుర్తించి, వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు ఇస్రో ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఎంపికైనవారికి ఇస్రో గెస్ట్ హౌజ్ లేదా హాస్టళ్లలో వసతి సౌకర్యాలు ఉంటాయి. రవాణా ఖర్చులు, కోర్స్ మెటీరియల్, వసతి ఖర్చులన్నీ ఇస్రోనే భరిస్తుంది.


ఈ కార్యక్రమంలో ప్రముఖ శాస్త్రవేత్తలు తమ అనుభవాలను పంచుకుంటారు. ల్యాబ్ విజిట్స్ ఉంటాయి. నిపుణులతో చర్చావేదికల్లో పాల్గొనొచ్చు. ఇస్రో నిర్వహించే ఈ కార్యక్రమానికి ప్రతీ రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం నుంచి ముగ్గురు విద్యార్థుల చొప్పున ఎంపిక చేస్తారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, స్టేట్ సిలబస్ స్కూళ్లల్లో చదివే విద్యార్థులకు మాత్రమే అవకాశం. 


అర్హతలు..


➥ 2023-24 విద్యాసంవత్సరంలో 9వ తరగతి చదువుతున్నవారు మాత్రమే దరఖాస్తు చేయాలి.


➥ 8వ తరగతిలో సాధించిన మార్కులను బట్టి 60% వెయిటేజీ, 2016 నుంచి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎస్సే రైటింగ్, చర్చా కార్యక్రమాల్లో ప్రతిభ సాధించినవారికి 10% వరకు వెయిటేజీ, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రీడల్లో ప్రతిభ సాధించినవారికి 5% వెయిటేజీ, గ్రామీణ ప్రాంతాల్లో చదివే వారికి 15% వెయిటేజీ ఉంటుంది.


➥ ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే 080 2217 2269 ఫోన్ నెంబర్‌లో సంప్రదించొచ్చు.


Website


ALSO READ:


ISRO Jobs: ఇస్రోలో 224 సైంటిస్ట్/ ఇంజినీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
బెంగళూరులోని ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్, యూఆర్‌ రావు శాటిలైట్ సెంటర్ (యూఆర్‌ఎస్సీ), ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 224 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత, డ్రైవింగ్ లైసెన్స్, పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 01 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష/ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది.  సైంటిస్ట్/ ఇంజినీర్-ఎస్సీ పోస్టులకు రూ.56,100; టెక్నికల్ అసిస్టెంట్/సైంటిఫిక్ అసిస్టెంట్/లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులకు రూ.44,900; టెక్నీషియన్-బి/డ్రాఫ్ట్స్‌మ్యాన్-బి పోస్టులకు రూ.21,700; కుక్/ఫైర్‌మ్యాన్-ఎ/లైట్ వెహికల్ డ్రైవర్ ‘ఎ’/లైట్ వెహికల్ డ్రైవర్ ‘ఎ’&హెవీ వెహికల్ డ్రైవర్ ‘ఎ’ పోస్టులకు రూ.19,900.  
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..