GATB-BET 2024: బబయోటెక్నాలజీ పీజీ, JRF ప్రవేశాలకు నోటిఫికేషన్ - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా

GATB-BET: దేశంలోని ప్రఖ్యాత కళాశాలల్లో పీజీ బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జీఏటీబీ-2024, JRF కోసం నిర్వహించే బీఈటీ-2024 నోటిఫికేషన్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది.

Continues below advertisement

Graduate Aptitude Test- Biotechnology/ Biotechnology Eligibility Test: దేశంలోని ప్రఖ్యాత కళాశాలల్లో పీజీ బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌-బయోటెక్నాలజీ(జీఏటీబీ)-2024', జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ల కోసం నిర్వహించే 'బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (బీఈటీ)-2024 నోటిఫికేషన్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. ఈ పరీక్షలో సాధించిన మెరిట్‌ ద్వారా వివిధ ఇన్‌స్టిట్యూట్లు, యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందవచ్చు. ప్రవేశ పరీక్షకు సంబంధించి ఫిబ్రవరి 8న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. మార్చి 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏప్రిల్ 20న కంప్యూటర్ ఆధారిత విధానంలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జీఏటీబీ-2024, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బీఈటీ-2024 పరీక్ష నిర్వహిస్తారు. 

Continues below advertisement

వివరాలు...

గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ - బయోటెక్నాలజీ(జీఏటీ-బీ) అండ్‌ బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (బీఈటీ) 2024

➥ జీఏటీ-బీ కోర్సులు: ఎంఎస్సీ(బయోటెక్నాలజీ, అగ్రి బయోటెక్నాలజీ, సంబంధిత విభాగాలు), ఎంటెక్‌(బయోటెక్నాలజీ, సంబంధిత విభాగాలు), ఎంవీఎస్సీ(యానిమల్‌ బయోటెక్నాలజీ).

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఎస్సీ, ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీవీఎస్సీ, బీఎఫ్‌ఎస్సీ, బీఏఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌, బీపీటీ, బీటెక్‌, అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రాం ఉత్తీర్ణులై ఉండాలి.

➥ బీఈటీ కోర్సులు: ఈ పరీక్షలో ప్రతిభ ఆధారంగా పీహెచ్‌డీ ప్రోగ్రాంలో ప్రవేశాలు పొందవచ్చు.

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంబీబీఎస్‌, ఎంటెక్‌, ఎంఎస్సీ, ఎంవీఎస్సీ, ఎంఫార్మసీ, ఇంటిగ్రేడెట్‌ ఎంఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: జనరల్‌ అభ్యర్థులకు 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 33 ఏళ్లు.. దివ్యాంగులు, మహిళలు 31 ఏళ్లు మించకూడదు.

పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత విధానంలో మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు అడుగుతారు. 

పరీక్ష వ్యవధి: 180 నిమిషాలు.

దరఖాస్తు ఫీజు:

➥ జీఏటీ-బీ- రూ.1200(ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.600)

➥ బీఈటీ- రూ.1200(ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.600

➥ జీఏటీ-బీ, బీఈటీ(రెండూ)- రూ.2400 (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.1200)

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. 

ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్‌ దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లింపు చివరితేది: 06.03.2024.

➥ దరఖాస్తు సవరణ తేదీలు: 08.03.2024 నుంచి 09.03.2024 వరకు.

➥ ప్రవేశ పరీక్షల తేదీ: 20.04.2024.

సమయం: జీఏటీబీ-2024 - ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, బీఈటీ-2024 - మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు .

Notification

Online Application

ALSO READ:

తెలంగాణ ఈసెట్ - 2024 షెడ్యూలు విడుదల, ముఖ్యమైన తేదీలివే
బీటెక్‌ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాల కోసం నిర్వహించే 'టీఎస్‌ ఈసెట్‌' షెడ్యూలును ఉన్నత విద్యామండలి ఫిబ్రవరి 9న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఫిబ్రవరి 14న ఈసెట్ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 16 వరకు దరఖాస్తుల స్వీకరించనున్నారు. ఆలస్యరుసుముతో ఏప్రిల్ 28 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఏప్రిల్ 24 నుంచి 28 వరకు దరఖాస్తుల్లో తప్పులుంటే సరిచేసుకునేందుకు అవకాశం ఇచ్చారు.  మే 6న టీఎస్ ఈ సెట్ పరీక్ష నిర్వహించనున్నారు.
ఈసెట్ షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Continues below advertisement
Sponsored Links by Taboola