విద్యార్థులపై పరీక్షల ఒత్తిడి అంతా ఇంతా కాదు. ఏదో యుద్ధానికి సిద్ధమవుతున్న సైనికుడిలా విద్యార్థులను ప్రిపేర్ చేస్తుంటారు. క్లాస్‌టెస్టుల్లో, స్కూల్‌లో పెట్టిన మంచి మార్కులు వచ్చినప్పటికీ టెన్షన్ పడుతుంటారు.
కరోనా కారణంగా రెండేళ్లు చదువులు సరిగ్గా సాగలేదు. పరీక్షలు కూడా సీరియస్‌గా జరగలేదు. కాని ఇప్పుడు మాత్రం క్లాస్‌లు పక్కాగా జరిగాయి. అందుకే ఈసారి పరీక్షల టెన్షన్ విద్యార్థుల్లో ఇంకా ఎక్కువగా ఉంది.
విద్యార్థులు ఈ ఎగ్జామ్ ఫియర్ నుంచి బయటపడేందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram) సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది. విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగెట్టేందుకు ఓ గైడ్ క్రియేట్ చేసింది. విద్యార్థులు ఎలా చదవాలి, పరీక్షలకు సిద్ధం చేయడం, పరీక్షల ఒత్తిడి అధిగమించడంపై సలహాలు సూచనలు ఇస్తుంది. ప్రత్యేకించి 10, 12వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు సహాయం చేసే లక్ష్యంగా దీన్ని క్రియేట్ చేసింది.
'రీడ్ అండ్ రీడ్‌జస్ట్: బ్యాక్ టు ది క్లాస్‌రూమ్' పేరుతో ఫోర్టిస్ నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్, ఫోర్టిస్ హెల్త్‌కేర్, సంగత్స్ ఇట్స్ ఓకే ఇనిషియేటివ్, ఇన్‌స్టాగ్రామ్ (Instagram) భాగస్వామ్యంతో దీన్ని రూపొందించారు. విద్యార్థులకు స్టడీ, పరీక్ష ప్రాధాన్యత గుర్తించడంతోపాటు స్కోరింగ్ కోసం చిట్కాలను కూడా అందిస్తుంది. ఒత్తిడి అధిగమించే వ్యూహాలను పరిచయం చేస్తుంది. ఏకాగ్రత మెరుగుపరచే పద్ధతులను అందిస్తుంది.
ఈ గైడ్‌లో స్వీయ రక్షణ, మానసిక ఆరోగ్యం కోసం షార్ట్‌టెర్మ్ రెమిడీస్‌తోపాటు భవిష్యత్‌లో అనుసరించాల్సిన పద్ధతులను తెలియజేస్తుంది. ఈ గైడ్ పాఠశాలలు, తల్లిదండ్రులకు ఆన్‌లైన్ నెట్‌వర్క్‌ల ద్వారా పంపిణీ చేస్తారు. విద్యార్థులు, పాఠశాలలు, తల్లిదండ్రులు ఫోర్టిస్ మెంటల్ హెల్త్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలో గైడ్‌ను చూడవచ్చు. 1 మిలియన్ల 1 బిలియన్ వెబ్‌సైట్ నుంచి గైడ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
టైమ్ మేనేజ్‌మెంట్ ప్రాముఖ్యత దృష్టిలో ఉంచుకుని ప్రజలను ఉపయోగపడేలా టేక్ ఏ బ్రేక్ పేరుతో కొత్త ఫీచర్ యాడ్ చేసింది సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్. ఇన్‌స్టాగ్రామ్ పబ్లిక్ పాలసీ హెడ్, ఫేస్‌బుక్ ఇండియా (మెటా) నటాషా జోగ్ మాట్లాడుతూ... యువత శ్రేయస్సును దృష్టి ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ప్రధాన ప్రాధాన్యతల్లో ఒకటిగా చెప్పారు. యువత జీవితాలను, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి 'రీడాప్ట్ అండ్ రీజస్ట్' గైడ్ తీసుకువచ్చామన్నారు.