ఏపీలో సీబీఎస్‌ఈ గుర్తింపు పొందిన ప్రభుత్వ పాఠశాలల్లో అదనంగా ఐటీ సబ్జెక్టును ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీబీఎస్‌ఈలో 9, 10 తరగతుల్లో అయిదు సబ్జెక్టుల విధానం ఉంటుంది. అంటే ఇంగ్లిష్, తెలుగు, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సబ్జెక్టులు ఉంటాయి. వీటికి అదనంగా ఆరో సబ్జెక్టుగా ఐటీ (కంప్యూటర్స్‌) జతకానుంది. అయితే మార్చిలోనే పరీక్షలు పూర్తి చేసి, ఏప్రిల్‌ నుంచి రాబోయే తరగతి పాఠాలు బోధించనున్నారు. మే నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు. ఇప్పుడు ఇదే విధానాన్ని ఇక్కడి బడుల్లోనూ అమలు చేసే అంశంపై ప్రభుత్వం పరిశీలిస్తోంది.


ఎనిమిదో తరగతి వరకే  హిందీ పరీక్ష..
మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్‌లో ఏదైనా సబ్జెక్టులో ఒక విద్యార్థి ఫెయిల్ అయితే.. ఐటీలో వచ్చే మార్కులను ప్రామాణికంగా తీసుకుని ఉత్తీర్ణుడిగా పరిగణిస్తారు. అందుకోసం ఆరో సబ్జెక్టుగా ఐటీని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. హిందీ సబ్జెక్టును 9వ తరగతి వరకు బోధించినా 8వ తరగతి వరకే పరీక్ష నిర్వహిస్తారు. 


ఐటీ, కెరీర్‌ గైడెన్స్‌కు స్పెషల్ టీచర్లు..
సీబీఎస్‌ఈ బడుల్లో ఐటీ బోధన, కెరీర్‌ గైడెన్స్‌కు స్పెషల్ టీచర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి కమిషనరేట్‌ పంపింది. ఒక్కో పాఠశాలకు ఇద్దరి చొప్పును వెయ్యి పాఠశాలలకు 2 వేల మందిని నియమించాలని సర్కారు భావిస్తోంది. అయితే, ఈ పోస్టులకు శాశ్వత ప్రాతిపదికనా...లేక కాంట్రాక్టు విధానంలో నియమిస్తారా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. 


ALSO READ:


ఏపీలో 'సమ్మెటివ్‌ అసెస్‌మెంట్-1' పరీక్షలు వాయిదా, కారణమిదే!
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పాఠశాలల్లో సమ్మెటివ్‌ అసెస్‌మెంట్(ఎస్‌ఏ)-1 పరీక్షలు వాయిదా పడ్డాయి. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. నవంబరు 4 నుంచి ఎస్‌ఏ-1 పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా.. వాటిని నవంబరు 15కు వాయిదా వేశారు. నవంబరు 3 నుంచి 3, 6, 9వ తరగతులకు రాష్ట్ర స్థాయి సాధన సర్వే నిర్వహిస్తున్నందున పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటన ద్వారా  వెల్లడించింది. సర్వే ప్రాక్టీస్‌ కోసం ప్రశ్నపత్రాలను సైతం విద్యాశాఖ పాఠశాలలకు పంపించింది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


విద్యార్థులకు 'ప్రత్యేక గుర్తింపు సంఖ్య', త్వరలోనే అమల్లోకి కొత్త విధానం!
దేశంలో కేజీ నుంచి పీజీ వరకు చదివే విద్యార్థుల సమగ్ర వివరాలు ఒకే గొడుగు కిందకు రానున్నాయి. విద్యార్థి ఎల్‌కేజీలో చేరినప్పట్నుంచి విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు.. వీటికి సంబంధించిన పూర్తివివరాలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు వీలుగా కేంద్ర విద్యాశాఖ చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా ఒక్కో విద్యార్థికి, ఒక్కో ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయించాలని నిర్ణయించింది. దాన్ని ఆధార్ సంఖ్యతోపాటు 'అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్(ఏబీసీ)' అనే ఎడ్యులాకర్‌కు అనుసంధానించనుంది. ఈ విధానం త్వరలోనే అమల్లోకి తేనున్నారు. పాఠశాల విద్యలోని పిల్లలకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇచ్చే విధానాన్ని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 'ఛైల్డ్ ఇన్ఫో' పేరిట ఒక్కో విద్యార్థికి, ఒక్కో సంఖ్య విధానాన్ని గత కొన్నేళ్లుగా అమలు చేస్తున్నారు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 



మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...