న్యూఢిల్లీలోని ఇండియన్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ & డెవలప్‌మెంట్, 2023 విద్యా సంవత్సరానికి పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. 18 నెలల వ్యవధి ఉండే ఈ కరెస్పాండెన్స్‌ కోర్సుకు కేంద్ర విద్యాశాక గుర్తింపు ఉంది. ఈ కోర్సులో ఏటా రెండు సార్లు ప్రవేశాలు కల్పిస్తారు. జులై బ్యాచ్‌కు సంబంధించి జులై 21తో దరఖాస్తు గడువు ముగియనుంది. అలాగే 2024, జనవరి బ్యాచ్‌కు సంబంధించి నవంబరు 30 వరకు దరఖాస్తులు సమర్పించే అవకాశం ఉంది.  


వివరాలు..


* పీజీ డిప్లొమా (ట్రైనింగ్‌ & డెవలప్‌మెంట్‌) 


ప్రోగ్రామ్ వ్యవధి: 18 నెలలు.


అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఏదైనా విభాగంలో పీజీ పీజీ డిప్లొమా ఉత్తీర్ణత ఉన్నవారూ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో.


దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
Diploma Office
Indian Society for Training & Development,
B-23, Qutab Institutional Area, 
New Delhi-110016.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ (జులై బ్యాచ్‌): 21.07.2023.


➥ ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ (జనవరి బ్యాచ్‌): 30.11.2023.


Notification


Application


Fee Payment Link


Website


ALSO READ:


టీఎస్ ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, జులై 29 నుంచి రిజిస్ట్రేషన్!
తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో పాలిటెక్నిక్, డిప్లొమా విద్యార్థులు బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన 'టీఎస్ ఈసెట్‌-2023' కౌన్సెలింగ్‌ షెడ్యూలును అధికారులు ప్రకటించారు. షెడ్యూలు ప్రకారం జులై 29 నుంచి రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్‌ ప్రారంభంకానుంది. ఆగస్టు 1 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. రిజిస్ట్రేషన్ పూర్తిచేసిన అభ్యర్థులకు జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. ఇక ధ్రువపత్రాల పరిశీలన పూర్తయినవారు జులై 31 నుంచి ఆగస్టు 4 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 
ఈసెట్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, ముఖ్యమైన తేదీలివే!
తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఐసెట్‌ కౌన్సెలింగ్ షెడ్యూలు జులై 13న విడుదలైంది. ఆగస్టు 14 నుంచి 18 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు, స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పించారు. ఆగస్టు 16 నుంచి 19 వరకు ధ్రువపత్రాల పరిశీలన, 16 నుంచి 21 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఆగస్టు 25న తొలి విడత సీట్లను కేటాయిస్తారు. సెప్టెంబరు 1వ తేదీ నుంచి తుది విడత ఐసెట్ కౌన్సెలింగ్ ఉంటుంది. సెప్టెంబరు 1 నుంచి 3 వరకు తుది విడత వెబ్ ఆప్షన్ల నమోదు, 7న తుది విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబరు 8న స్పాట్ ప్రవేశాలకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు.
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


MAT: ‘మ్యాట్'-2023 సెప్టెంబరు నోటిఫికేషన్ వెల్లడి, పరీక్ష షెడ్యూలు ఇలా!
ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేట్‌ (ఏఐఎంఏ)-2023 సెప్టెంబర్ సెషన్‌ మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (MAT) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ, ఇతర ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏఐఎంఏ మ్యాట్‌ను ఏటా నాలుగుసార్లు (ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్) నిర్వహిస్తుంది. తాజాగా మ్యాట్ 2023 సెప్టెంబరు నోటిఫికేషన్ విడుదలైంది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


బీఆర్క్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే!
తెలంగాణలోని ఆర్కిటెక్చర్ కాలేజీల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్) సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కౌన్సిల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ నిర్వహించే ఆప్టిట్యూడ్‌ టెస్టు ఎన్‌ఏటీఏ (NATA)–2021లో (లేదా) జేఈఈ మెయిన్స్ పేపర్‌–2 (బీఆర్క్‌)–2021లో అర్హత సాధించినవారు, ఇంటర్ (ఎంపీసీ) లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు, పదోతరగతితోపాటు డిప్లొమా పూర్తిచేసిన వారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాష్ట్రవ్యాప్తంగా 10 ఆర్కిటెక్చర్ కాలేజీల్లో 830 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 12 నుంచి 22 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది.
ప్రవేశాల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial