Indian Maritime University Admissions: చెన్నైలోని ఇండియన్‌ మారిటైమ్‌ యూనివర్సిటీ (ఐఎంయూ)లో 2024-25 విద్యాసంవత్సరానికి పీజీ, యూజీ, డీఎన్‌ఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యార్హతతో పాటు గేట్‌/ సీయూఈటీ/ పీజీ సెట్‌/ క్యాట్‌/ మ్యాట్‌/ సీమ్యాట్‌ స్కోరు ఉండాలి. ఐఎంయూ సెట్‌ ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికచేస్తారు. ఐఎంయూ క్యాంపస్‌లు నవీ ముంబయి, ముంబయి పోర్ట్, కోల్‌కతా, విశాఖపట్నం, చెన్నై, కొచ్చిలో ఉన్నాయి. డిగ్రీ కోర్సులకు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత, పీజీ కోర్సులకు డిగ్రీ విద్యార్హత, పీహెచ్‌డీ కోర్సులకు సంబంధించిన సబ్జెక్టులో పీజీ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. సరైన అర్హతలున్న అభ్యర్థులు మే 5 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 


కోర్సుల వివరాలు..


➥ యూజీ ప్రోగ్రామ్స్ 


⫸ బీటెక్‌ (మెరైన్ ఇంజినీరింగ్)


సీట్ల సంఖ్య: 30.


కోర్సు వ్యవధి: 4 సంవత్సరాలు.


⫸ బీటెక్‌ (నేవల్‌ అర్కిటెక్చర్ అండ్‌ ఓషియన్‌ ఇంజినీరింగ్‌)


సీట్ల సంఖ్య: 05. 


కోర్సు వ్యవధి: 4 సంవత్సరాలు.


⫸ బీటెక్‌ (నేవల్‌ అర్కిటెక్చర్‌ అండ్‌ షిప్‌ బిల్డింగ్‌)


సీట్ల సంఖ్య: 05.


కోర్సు వ్యవధి: 4 సంవత్సరాలు.


⫸ అప్రెంటిస్‌షిప్ ఎంబెడెడ్ బీబీఏ-మారిటైమ్ లాజిస్టిక్స్


కోర్సు వ్యవధి: 3 సంవత్సరాలు.


⫸ బీబీఏ (లాజిస్టిక్స్, రిటైలింగ్ అండ్ ఈకామర్స్)


కోర్సు వ్యవధి: 3 సంవత్సరాలు.


⫸ బీఎస్సీ (నాటికల్ సైన్స్)


సీట్ల సంఖ్య: 30 


కోర్సు వ్యవధి: 3 సంవత్సరాలు.


➥ డిప్లొమా ఇన్ నాటికల్ సైన్స్ (DNS)


➥ పీజీ ప్రోగ్రామ్స్ 


⫸ ఎంబీఏ (ఇంటర్నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌)


సీట్ల సంఖ్య: 10.


కోర్సు వ్యవధి: 2 సంవత్సరాలు.


⫸ ఎంబీఏ (పోర్ట్‌ అండ్‌ షిప్పింగ్‌ మేనేజ్‌మెంట్‌)


సీట్ల సంఖ్య: 10.


కోర్సు వ్యవధి: 2 సంవత్సరాలు.


⫸ ఎంటెక్ (మెరైన్ టెక్నాలజీ)


సీట్ల సంఖ్య: 02.


కోర్సు వ్యవధి: 2 సంవత్సరాలు.


⫸ ఎంటెక్ (డ్రెడ్జింగ్ హార్బర్‌ ఇంజినీరింగ్‌) 


సీట్ల సంఖ్య: 02.


కోర్సు వ్యవధి: 2 సంవత్సరాలు.


⫸ ఎంటెక్ (నేవల్‌ అర్కిటెక్చర్ అండ్‌ ఓషియన్‌ ఇంజినీరింగ్‌) 


సీట్ల సంఖ్య: 02. 


కోర్సు వ్యవధి: 2 సంవత్సరాలు.


⫸ పీజీ డిప్లొమా (మెరైన్ ఇంజినీరింగ్)


కోర్సు వ్యవధి: 2 సంవత్సరాలు.


అర్హత: కోర్సుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. డిగ్రీ కోర్సులకు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత, పీజీ కోర్సులకు డిగ్రీ విద్యార్హత ఉండాలి. వీటితోపాటు గేట్‌/ సీయూఈటీ/ పీజీ సెట్‌/ క్యాట్‌/ మ్యాట్‌/ సీమ్యాట్‌ స్కోరు ఉండాలి. 


వయోపరిమితి: డిగ్రీ కోర్సులకు 01.10.1999  తర్వా త జన్మించినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పీజీ కోర్సులకు ఎలాంటి వయోపరిమితి లేదు.


ఎంపిక విధానం: ఐఎంయూ సెట్‌ ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికచేస్తారు. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.


ముఖ్యమైన తేదీలు..


➥ దరఖాస్తు చివరి తేదీ: 05.05.2024.


➥ ఐఎంయూసెట్‌ పరీక్షతేదీ: 08.06.2024.


Notification


Prospectus


Online Application


IMU BBA Online Application


Website


ALSO READ:


CUET UG - 2024: సీయూఈటీ యూజీ పరీక్షల షెడ్యూలు వెల్లడి, సబ్జెక్టులవారీగా తేదీలివే
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో 2024-25 విద్యా సంవత్సరానికిగానూ యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న"కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ(CUET UG)-2024" షెడ్యూలును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో షెడ్యూలును అందుబాటులో ఉంచింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 15 నుంచి 24 వరకు సీయూఈటీ యూజీ పరీక్షలు నిర్వహించనున్నారు.
పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..