IIT Madras MBA Admissions: చెన్నైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు క్యాట్‌-2023 అర్హత సాధించినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విదేశీ విద్యార్థులైతే సీమ్యాట్ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ చివరిసంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.1600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.800 చెల్లిస్తే సరిపోతుంది.


వివరాలు..


* మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ) ప్రవేశాలు - 2024


కోర్సు వ్యవధి: రెండేళ్ల ఫుల్‌ టైం ప్రోగ్రామ్


అర్హత: 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు క్యాట్‌-2023 స్కోరు ఉండాలి.


దరఖాస్తు ఫీజు: రూ.1600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.800 చెల్లిస్తే సరిపోతుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. 


ఎంపిక విధానం: దరఖాస్తు నుంచి ఎంపిక చేసిన అభ్యర్థులను మాత్రమే ప్రవేశాలకు పరిగణనలోకి తీసుకుంటారు. 


ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరితేది: 31.01.2024.


ఇంటర్వ్యూ షెడ్యూలు..


➥ చెన్నై:  01 - 03.03.2024 వరకు.


➥ ముంబయి:  08 - 10.03.2024 వరకు.


➥ ఢిల్లీ:  15 - 17.03.2024 వరకు.


➥ హైదరాబాద్:  23 - 24.03.2024 వరకు.


➥ కోల్‌కతా:  23 - 24.03.2024 వరకు.


సంప్రదించాల్సిన చిరునామా:
Admissions Coordinator
MBA Program
Department of Management Studies
Indian Institute of Technology Madras
Chennai 600 036 INDIA
Ph: 044 - 2257 5551
Email: msoffice@iitm.ac.in.


అవసరమయ్యే సర్టిఫికేట్లు...


అభ్యర్థులు 31.03.2023 తర్వాత జారీ అయిన సర్టిఫికేట్లను కలిగి ఉండాలి.


➥ ఓబీసీ (నాన్ క్రీమిలేయర్) సర్టిఫికేట్


➥ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ 


➥ ఎస్సీ, ఎస్టీ సర్టిఫికేట్ 


➥ పీడబ్ల్యూడీ (మెడికల్ సర్టిఫికేట్)


➥ సీజీపీఏ నుంచి పర్సంటేజీకి కన్వర్షన్ సర్టిఫికేట్


Notification


Online Application


Application Form


ALSO READ:


నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కెలాలో ఎంబీఏ ప్రోగ్రామ్, వివరాలు ఇలా
రూర్కెలాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2024-26 విద్యాసంవత్సరానికిగాను ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ అర్హతతోపాటు క్యాట్‌ (CAT), గ్జాట్(XAT), మ్యాట్‌ (MAT), సీమ్యాట్‌ (CMAT) పరీక్షలో ఏదైనా ఒకదాంట్లో అర్హత స్కోరు కలిగినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 
కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..


బిట్స్‌ పిలానీలో ఎంబీఏ ప్రోగ్రామ్, కోర్సు వివరాలు ఇలా
బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్‌ సైన్స్ (BITS) పిలానీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీఏ ప్రోగ్రామ్‌లో (MBA Admissions) ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రవేశ పరీక్ష (బిజినెస్ అనలిటిక్స్ ఆప్టిట్యూడ్ టెస్ట్-BAAT), పర్సనల్ ఇంటర్వ్యూ (లేదా) క్యాట్‌ (CAT) 2023/ ఎక్స్‌ఏటీ (XAT) 2024/ జీమ్యాట్‌ (GMAT) 2023, అకడమిక్ మెరిట్, పని అనుభవం తదితరాల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...