IISC Bengalore Admissions: బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) 2024-25 విద్యా సంవత్సరానికి పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. పీజీ కోర్సులకు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశాలకు సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ అర్హత ఉండాలి. కోర్సును అనుసరించి వ్యాలిడ్‌ గేట్ స్కోరు/ జీప్యాట్‌ స్కోరు, నెట్‌ జేఆర్‌ఎఫ్‌, సీడ్‌, క్యాట్‌/ జీమ్యాట్‌, జామ్‌ స్కోరు సాధించి ఉండాలి. చివరిసంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కోర్సుల ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 5న ప్రారంభంకాగా.. మార్చి 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.800 చెల్లించాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.400; ఈఆర్‌పీ (ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్) అభ్యర్థులు రూ.2000 చెల్లించాల్సి ఉంటంది.


వివరాలు..


* ఐఐఎస్సీ ప్రవేశాలు (2024-25 విద్యాసంవత్సరం)


I. రిసెర్చ్‌ ప్రోగ్రాం (పీహెచ్‌డీ/ ఎంటెక్‌ (రిసెర్చ్‌))


➥ పీహెచ్‌డీ (సైన్స్‌)


విభాగాలు: ఆస్ట్రోనమీ అండ్‌ ఆస్ట్రోఫిజిక్స్, బయోకెమిస్ట్రీ, ఎకోలాజికల్ సైన్సెస్, హై ఎనర్జీ ఫిజిక్స్, ఇనార్గానిక్ అండ్‌ ఫిజికల్ కెమిస్ట్రీ, మెటీరియల్స్ రిసెర్చ్, మ్యాథమెటిక్స్ తదితరాలు.


➥ ఎంటెక్‌(రిసెర్చ్‌) అండ్‌ పీహెచ్‌డీ(ఇంజినీరింగ్‌)


విభాగాలు: ఏరోస్పేస్ ఇంజినీరింగ్, అట్మాస్ఫియరిక్ అండ్‌ ఓషియానిక్ సైన్సెస్, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఆటోమేషన్, ఎర్త్ సైన్సెస్ తదితరాలు.


➥ పీహెచ్‌డీ(ఇంటర్ డిసిప్లినరీ)


విభాగాలు: బయో ఇంజినీరింగ్, ఎనర్జీ, మ్యాథమెటికల్ సైన్సెస్, వాటర్ రిసెర్చ్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్, క్లైమేట్ చేంజ్, బ్రెయిన్, కంప్యూటేషన్ అండ్‌ డేటా సైన్స్.


II. ఇంజినీరింగ్‌ ప్రోగ్రాం(ఎంటెక్‌/ ఎం.డీఈఎస్‌/ఎం.ఎంజీటీ)


➥ ఎంటెక్‌ ప్రోగ్రాం


➥ మాస్టర్ ఆఫ్ డిజైన్ (ఎం.డీఈఎస్‌)


➥ మాస్టర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఎం.ఎంజీటీ)


విభాగాలు: ఏరోస్పేస్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, మెటీరియల్స్ ఇంజినీరింగ్, సస్టైనబుల్ టెక్నాలజీస్ తదితరాలు.


III. సైన్స్‌ ప్రోగ్రాం (ఎంఎస్సీ)


విభాగాలు:  లైఫ్ సైన్సెస్/ కెమికల్ సైన్సెస్


IV. ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రోగ్రాం


విభాగాలు: బయోలాజికల్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్.


V. ఎక్స్‌టర్నల్‌ రిజిస్ట్రేషన్‌ ప్రోగ్రాం (ఈఆర్‌పీ) (పీహెచ్‌డీ/ ఎంటెక్‌(రిసెర్చ్‌))


అర్హత: కోర్సును అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు వ్యాలిడ్‌ గేట్ స్కోరు/ జీప్యాట్‌ స్కోరు, నెట్‌ జేఆర్‌ఎఫ్‌, సీడ్‌, క్యాట్‌/ జీమ్యాట్‌, జామ్‌ స్కోరు సాధించి ఉండాలి.


దరఖాస్తు ఫీజు: రూ.800. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.400; ఈఆర్‌పీ (ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్) అభ్యర్థులు రూ.2000 చెల్లించాల్సి ఉంటంది.


ముఖ్యమైన తేదీలు..


➥ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 05.02.2024.


➥ ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 22.03.2024.


 Notification


Online Application


Website


ALSO READ:


టీఎస్​ఆర్జేసీ సెట్-2024 నోటిఫికేషన్ వెల్లడి, ప్రవేశపరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలోని 35 గురుకుల జూనియర్​ కళాశాలల్లో 2024–25 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియేట్​ మొదటి సంవత్సరం ఇంగ్లిష్​ మీడియం ప్రవేశాలకు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయ సంస్థ టీఎస్​ఆర్జేసీ సెట్​–2024 (TSRJC CET-2024) నోటిఫికేషన్​ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా బాలురకు 15, బాలికల కోసం 25 గురుకుల జూనియర్​ కాలేజీలు ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలో జరిగే 10వ తరగతి వార్షిక పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ప్రవేశ పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...