IIPE MTech Admission: విశాఖపట్నం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియంలో ఎంటెక్ ప్రోగ్రామ్

IIPE Admissions: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీలో ఎంటెక్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు. నాలుగేళ్ల డిగ్రీ లేదా పీజీ అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు.

Continues below advertisement

IIPE MTech Admissions: విశాఖపట్నంలోని 'ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (IIPE)' 2024 సంవత్సరానికిగాను ఎంటెక్ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. కనీసం 55 శాతం మార్కులతో నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి. దీంతోపాటు ఏడాది పని అనుభవం ఉండాలి. సరైన అర్హతలున్నవారు జులై 18 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజుగా ఇండియన్ విద్యార్థులు రూ.1000. విదేశీ విద్యార్థులు 50 డాలర్లు (దాదాపు రూ.4000) చెల్లించాల్సి ఉంటుంది. రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. 

Continues below advertisement

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జులై 22, 23 తేదీల్లో రాతపరీక్ష/ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను జులై 26న ప్రకటించనున్నారు. ఎంపికైనవారు ఆగస్టు 2లోగా నిర్ణీత ఫీజు చెల్లించాలి. అదేవిధంగా సీటు నిర్దారణ తర్వాత నిర్ణీత సెమిస్టర్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రవేశాలు పొందినవారికి ఆగస్టు 12 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.1500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది. జేఈఈ-అడ్వాన్స్‌డ్ 2024 స్కోరు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తదితరాల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ప్రతిభావంతులైన మహిళా విద్యార్థులకు నెలకు రూ.3000 స్కాలర్‌షిప్, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ట్యూషన్ ఫీజు మినహాయింపులు అందిస్తారు.

వివరాలు..

* ఎంటెక్ ప్రోగ్రామ్‌

విభాగం: డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్.

సీట్ల సంఖ్య: 30.

కోర్సు వ్యవధి: 5-8 సెమిస్టర్లు.

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. (లేదా) మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి.

అనుభవం: కనీసం ఏడాది పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: ఇండియన్ విద్యార్థులకు రూ.1000. విదేశీ విద్యార్థులు 50 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు...

⫸ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.06.2024.

⫸ దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 18.07.2024.

⫸ రాతపరీక్ష/ ఇంటర్వ్యూ తేదీ: 22 & 23.07.2024.

⫸ అభ్యర్థుల ఎంపిక జాబితా వెల్లడి: 26.07.2024.

⫸ అడ్మిషన్ ఫీజు చెల్లించడానికి చివరితేది: 02.08.2024.

⫸ మొదటి సెమిస్టర్ ట్యూషన్ ఫీజు చెల్లించడానికి చివరితేది: 05.08.2024.

⫸ మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభం: 12.08.2024.

Notification

Online Application

Website

ALSO READ

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియంలో బీటెక్‌ ప్రోగ్రామ్
ఐఐపీఈ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ)-విశాఖపట్నం బీటెక్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా నాలుగేళ్ల కోర్సులో ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం 165 సీట్లను భర్తీచేయనున్నారు. కనీసం 75 శాతం మార్కులతో ఇంటర్ విద్యార్హతతోపాటు జేఈఈ అడ్వాన్స్‌డ్-2024లో ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. సరైన అర్హతలున్నవారు జూలై 5 వరకు దరఖాస్తులు సమర్పించాలి. ప్రవేశాలు పొందినవారికి ఆగస్టు 5 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. దరఖాస్తు ఫీజుగా జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.1500; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1000 చెల్లించాలి. 
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసంక్లిక్ చేయండి..

Continues below advertisement