IIFT Admissions: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, కాకినాడ క్యాంపస్ 2024-29 విద్యాసంవత్సరానికి ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు ఈ కోర్సులకు అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.2000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో ఏప్రిల్ 23 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ప్రవేశ పరీక్ష, విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా సీట్లు భర్తీచేస్తారు. ఐఐఎం-ఇండోర్ ప్రవేశ పరీక్ష (IPMAT -2024) నిర్వహించనుంది.
కోర్సు వివరాలు..
* ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (ఐపీఎం) (బీబీఏ- బిజినెస్ అనలిటిక్స్ అండ్ ఎంబీఏ - ఇంటర్నేషనల్ బిజినెస్)
[5 Years Integrated Programme in Management (IPM) (BBA - Business Analytics and MBA - International Business) 2024-2029]
సీట్ల సంఖ్య: 60.
అర్హత: 60 శాతం మార్కులతో ఇంటర్ (ఆర్ట్స్/ కామర్స్/సైన్స్) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. విద్యార్థులు 2022, 2024, 2024లో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. మ్యాథమెటిక్స్ లేదా బిజినెస్ మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి. ఈ ఏడాది జులై 31 నాటికి ఇంటర్ పూర్తిచేసేవారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వయోపరిమితి: అభ్యర్థి 01.07.2004 తర్వాత జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 5 సంవత్సరాల వయోసడలింపు వర్తిస్తుంది. 01.08.1999 తర్వాత జన్మించి ఉండాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ- ఎన్‌సీఎల్ అభ్యర్థులు రూ.2000; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష (IPMAT 2024), విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా.
కోర్సు ఫీజు: రూ.4 లక్షలు.
దరఖాస్తు సమయంలో సమర్పించాల్సిన డాక్యుమెంట్లు..
➥ పదోతరగతి, ఇంటర్ మార్కుల సెల్ఫ్ అటెస్టెడ్ కాపీలు
➥ అవసరమైన విద్యార్థులకు క్యాస్ట్ సర్టిఫికేట్.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 23.04.2024.
ALSO READ:
బీబీనగర్ గురుకుల సైనిక మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సులు - పూర్తి వివరాలు ఇవే!
యాదాద్రి భువనగిరి జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక మహిళా డిగ్రీ కళాశాల(ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్)లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ మొదటి సంవత్సరం, ఇంటిగ్రేటెడ్ ఎంఏ(ఎకనామిక్స్) ఇంగ్లిష్ మీడియం కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంట్రెన్స్ ఎగ్జామ్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లు, సైకో అనలిటికల్ టెస్ట్‌లు, మెడికల్ టెస్ట్‌లు, షార్ట్ లెక్చర్, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంగ్లిష్ మీడియంలో కోర్సులను నిర్వహిస్తారు. దీంతోపాటు మిలిటరీ ఎడ్యుకేషన్ అంశాలు కూడా బోధిస్తారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాల్లో ఆఫీసర్ల నియామకానికి ఉద్దేశించిన యూపీఎస్సీ ఎగ్జామ్‌లకు సంబంధించి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈ ప్రోగ్రామ్‌నకు నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ గుర్తింపు ఉంది.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..