ఇండియన్  ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్ (ఐఐసీడీ) 2023 విద్యాసంవత్సరానికి గాను వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. దీని ద్వారా బీ.డిజైన్, ఎం.డిజైన్, ఎం.వొకేషన్ కోర్సుల్లో సీట్ల భర్తీ చేయనున్నారు. కోర్సుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. డిగ్రీ కోర్సులకు ఇంటర్ అర్హత ఉండాలి. పీజీ కోర్సులకు సంబంధి విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సరైన అర్హతలున్న అభ్యర్ధులు జనవరి 21లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. 14 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్షను పార్ట్ ఎ, పార్ట్ బి రెండు భాగాలుగా నిర్వహిస్తారు. 


వివరాలు..


* బీ.డిజైన్, ఎం.డిజైన్, ఎం.వొకేషన్ కోర్సులు.


విభాగాలు: హార్డ్ మెటీరియల్ డిజైన్, సాఫ్ట్ మెటీరియల్ డిజైన్, ఫైర్డ్ మెటీరియల్ డిజైన్, ఫ్యాషన్ దుస్తుల డిజైన్, క్రాఫ్ట్స్ కమ్యూనికేషన్, జ్యువెల్లరీ డిజైన్. 


కోర్సుల వారీగా ఖాళీలు..


1) బ్యాచిలర్స్ ప్రోగ్రామ్ (బీ.డిజైన్) 


మొత్తం సీట్లు: 180.


కోర్సు వ్యవధి: 4 ఏళ్లు.

అర్హత: 10+2 ఉత్తీర్ణత.



2) మాస్టర్ ప్రోగ్రామ్(ఎం.డిజైన్)


మొత్తం సీట్లు: 90.

కోర్సు వ్యవధి: 2 ఏళ్లు.

అర్హత:  గ్రాడ్యుయేషన్ ( బీ.డిజైన్/ బీ.ఆర్క్/ బీఏ డిజైన్/ బీఎస్సీ డిజైన్/ బీ.వొకేషన్ డిజైన్) ఉత్తీర్ణత

3)  మాస్టర్ ప్రోగ్రామ్(ఎం.వొకేషన్)

మొత్తం సీట్లు: 90.


కోర్సు వ్యవధి: 3 ఏళ్లు.

అర్హత: నాన్ డిజైన్  గ్రాడ్యుయేషన్  ఉత్తీర్ణత.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

సీట్ల రిజర్వేషన్: ఓబీసీ: 27%, ఎస్టీ:15%, ఎస్సీ :7.5%, పీహెచ్:3%. రిజర్వ్‌డ్ కేటగిరీల నుండి తగినన్నీ దరఖాస్తులు రాని యడల సీట్లను జనరల్ కేటగిరీకి కేటాయిస్తారు.

రిజిస్ట్రేషన్ అండ్ అడ్మిషన్ ప్రాసెస్ ఫీజు:  భారతీయ మరియు సార్క్ జాతీయులకు అడ్మిషన్ ప్రాసెస్ ఫీజు రూ. 1,750.ఎన్‌ఆర్ఐ/ ఇతర విదేశీ పౌరులకు: రూ. 3500.

పరీక్ష కేంద్రాలు: 14 కేంద్రాల్లో నిర్వహించబడుతుంది. భోపాల్, చెన్నై, చండీగఢ్, ఢిల్లీ, గౌహతి, హైదరాబాద్, జమ్మూ, జైపూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, పాట్నా, రాయ్‌పూర్, ఉదయపూర్.

పరీక్ష విధానం: ప్రవేశ పరీక్షను పార్ట్ ఎ, పార్ట్ బి రెండు భాగాలుగా నిర్వహిస్తారు(రెండు భాగాలు తప్పనిసరి). 

పార్ట్ A  - జనరల్ అవేర్‌నెస్, క్రియేటివిటీ & పర్సెప్షన్ టెస్ట్.

పార్ట్ బి - మెటీరియల్, కలర్ & కాన్సెప్టువల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ.


ముఖ్యమైన తేదీలు..


➽ దరఖాస్తు చివరి తేది: 21.01.2023.

➽ ప్రవేశ పరీక్ష తేది: 12.02.2023.

➽ ఫలితాల ప్రకటన: 27.02.2023.


➽ దరఖాస్తు ఫీజు సమర్పణతేదీలు: 3 ఏప్రిల్ 2023 నుండి 1 మే 2023 వరకు


➽ కోర్సు ప్రారంభం: జులై 2023.


Notification 


Admission Registration Form   


Website 


Also Read:


'ఫ్యాషన్' కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు ప్రారంభం- చివరితేది ఎప్పుడంటే?
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ప్రవేశాలకు నిర్దేశించిన 'NIFT-2023' రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబరు 1న ప్రారంభమైంది. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబరు 31 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.3000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1500 చెల్లిస్తే సరిపోతుంది. 
నోటిఫికేషన్, కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..


'ఫ్యాషన్' కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు ప్రారంభం- చివరితేది ఎప్పుడంటే?
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ప్రవేశాలకు నిర్దేశించిన 'NIFT-2023' రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబరు 1న ప్రారంభమైంది. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబరు 31 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.3000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1500 చెల్లిస్తే సరిపోతుంది. 
నోటిఫికేషన్, కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..