దేశంలో పీజీ వైద్య విద్యార్థులు ఇకపై జిల్లాల్లోని ఆసుపత్రుల్లో పనిచేయాల్సిందే. ఈ మేరకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) మార్గదర్శకాలు విడుదల చేసింది. దీనిప్రకారం పీజీ వైద్య విద్యార్థులకు మార్చి 1 నుంచి 'డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రామ్‌' అమలుచేయబోతున్నారు. ప్రైవేట్, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ వైద్య విద్యను అభ్యసించే వారు కోర్సు ముగిసేలోగా మూడు నెలలపాటు జిల్లా ఆసుపత్రుల పరిధిలో పనిచేయడాన్ని ఎన్ఎంసీ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. 


గతేడాది నుంచే ఈ విధానాన్ని అమలుచేసేందుకు ప్రయత్నించగా కొవిడ్ కారణంగా సాధ్యపడలేదు. ఈ మినహాయింపును ఎన్ఎంసీ తొలగించడంతో ఈ ఏడాది నుంచి అమలుచేసేందుకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని 30 ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కలిపి సుమారు రెండువేల మంది ప్రతి ఏటా పీజీలో ప్రవేశాలు పొందుతున్నారు.


విద్యార్థుల సౌకర్యార్థం ప్రథమ, మూడో సంవత్సరం చదివే సమయంలో కాకుండా రెండో సంవత్సరం విద్యార్థులకు మాత్రమే ఈ డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రామ్‌ను అమలుచేస్తామని డీఎంఈ డాక్టర్ వినోద్‌కుమార్ వెల్లడించారు.


Also Read:


అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో పీజీ డిప్లొమా ప్రోగ్రాం, స్పెషలైజేషన్లు ఇవే!
హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ తెలుగు రాష్ట్రాల్లోని 10 యూనివర్సిటీ ప్రాంతీయ కేంద్రాల్లో 2022-23 విద్యా సంవత్సరానికి పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ లేదా చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి, సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఫీజు కూడా ఆన్‌లైన్ ద్వారానే చెల్లించవచ్చు. కోర్సుల కాలవ్యవధి ఏడాది ఉంటుంది. ఇంగ్లిష్ మీడియంలోనే కోర్సులు ఉంటాయి.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మేనేజ్‌మెంట్ విద్యకు సరైన మార్గం ‘మ్యాట్’, ఫిబ్రవరి 2023 నోటిఫికేషన్ విడుదల!
ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేట్‌ (ఏఐఎంఏ)-2023 ఫిబ్రవరి సెషన్‌ మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (MAT) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ, ఇతర ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏఐఎంఏ మ్యాట్‌ను ఏటా నాలుగుసార్లు (ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్) నిర్వహిస్తుంది. మ్యాట్ 2022 ఫిబ్రవరి నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది.
దరఖాస్తు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..  


CMAT: కామ‌న్ మేనేజ్‌మెంట్ అడ్మిష‌న్ టెస్ట్ - 2023 నోటిఫికేషన్ విడుదల, వివరాలు ఇలా!
దేశ‌వ్యాప్తంగా వివిధ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాముల్లో ప్రవేశాల‌కు నిర్వహించే కామ‌న్ మేనేజ్‌మెంట్ అడ్మిష‌న్ టెస్ట్ (సీమ్యాట్)-2023 ప్రక‌ట‌న‌ను నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుద‌ల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఫిబ్రవరి 13న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా, మార్చి 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


JNTU: బీటెక్ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌, ఎంటెక్‌ లేకుండానే 'పీహెచ్‌డీ'లోకి!
పీజీ లేకున్నా పీహెచ్‌డీ‌ల్లో ప్రవేశాలకు ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో.. బీటెక్‌ విద్యార్థులు కూడా రిసెర్చ్‌ వైపు వెళ్లేలా జేఎన్టీయూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి బీటెక్‌ నుంచే పీహెచ్‌డీలోకి ప్రవేశాలు పొందేలా అవకాశం కల్పించింది. అదికూడా ఆనర్స్‌ బీటెక్‌ డిగ్రీ పూర్తిచేసిన వారికి మాత్రమే ఈ అవకాశం కల్పించాలని వర్సిటీ నిర్ణయించింది. 
పూర్తివివరాలకు క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..