ఐఐటీలు సహా ఇతర విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు ఆదివారం(జూన్ 18న) విడుదలయ్యాయి. ఉదయం 10 గంటలకు ఫలితాలను ఐఐటీ గువాహటి విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ రోల్ నెంబరు, పుట్టినతేదీ, రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాలతోపాటు ఫైనల్ కీలను కూడా విడుదల చేశారు. వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.


ఫలితాల కోసం క్లిక్ చేయండి..



జూన్ 4న రెండు సెషన్లల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 1,80,226 మంది హాజరయ్యారు. ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల కాగా, జూన్ 18న ఫైనల్‌ కీతోపాటు ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది 43 వేలకు పైగా విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో అర్హత సాధించారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 30 వేల మంది రాశారు. పరీక్షలో కటాఫ్ మార్కులు నిర్ణయించి సుమారు 45 వేల మందిని జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ(జోసా) కౌన్సెలింగ్‌కు అర్హత కల్పిస్తారు. విద్యార్థులు జూన్ 19 నుంచి మొదలయ్యే జోసా కౌన్సెలింగ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. గతేడాది 23 ఐఐటీల్లో మొత్తం 16,598 సీట్లు అందుబాటులో ఉండగా.. ఈసారి మరికొన్ని పెరిగే అవకాశం ఉంది.





ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ రిజిస్ట్రేషన్ ప్రారంభం.. 
బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (ఏఏటీ) రిజిస్ట్రేషన ప్రక్రియ ప్రారంభమైంది. వారణాసి, ఖరగ్‌పూర్‌, రూర్కీల్లోని ఐఐటీల్లో బీఆర్క్‌ (ఆర్కిటెక్చర్‌)కోర్సులను నిర్వహిస్తున్నారు. జూన్‌ 18,19 తేదీల్లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఏఏటీ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్‌ 21న ఏఏటీ పరీక్ష నిర్వహించి, జూన్‌ 24న ఫలితాలను ప్రకటించనున్నారు.


AAT 2023 Registration Link 1


AAT 2023 Registration Link 2






జూన్ 19 నుంచి జోసా కౌన్సెలింగ్‌..
ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు సహా కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లోని సీట్ల భర్తీకి నిర్వహించే జోసా కౌన్సెలింగ్‌ సోమవారం (జూన్ 19) నుంచి ప్రారంభం కానుంది. బీటెక్‌, బీఎస్సీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో సీట్ల భర్తీకి జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) షెడ్యూల్‌ ఇటీవలే విడుదలైంది. తొలుత జోసా కౌన్సెలింగ్‌ తర్వాత ఐఐటీలు మినహా మిగిలిన విద్యాసంస్థల్లోని సీట్లను సెంట్రల్‌ సీట్‌ అలకేషన్‌బోర్డు (సీశాబ్‌) చేపడుతుంది. జాతీయంగా 23 ఐఐటీలు, 32 ఎన్‌ఐటీలు, 26 ట్రిపుల్‌ ఐటీలు, మరో 38 కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే విద్యాసంస్థల్లో సీట్లను జోసా కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీచేస్తారు. సోమవారం నుంచి జూలై 26 వరకు 38 రోజులపాటు కౌన్సెలింగ్‌ కొనసాగనుంది.


 

Also Read:

'దోస్త్'లకు సీట్ల కేటాయింపు, తొలి విడతలో 73,220 మందికి ప్రవేశాలు!
తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల‌కు సంబంధించి విద్యార్థులకు 'దోస్త్' తొలిదశ సీట్లను కేటాయించారు. మొద‌టి విడత‌లో 73,220 మంది సీట్లు కేటాయించిన‌ట్లు ఉన్నత విద్యామండ‌లి జూన్ 16న ఒక ప్రకటనలో తెలిపింది. సీట్లు పొందిన విద్యార్థుల్లో 44,113 మంది అమ్మాయిలు, 29,107 మంది అబ్బాయిలు ఉన్నారు. దోస్త్‌ ద్వారా ప్రవేశాలకు అందుబాటులో 889 కళాశాలలు ఉండగా.. వాటిల్లో  మొత్తం సీట్లు 3,56,258 సీట్లు ఉన్నాయి. ఇక 63 కళాశాలల్లో ఎలాంటి ప్రవేశాలు జరుగలేదు. డిగ్రీ కామ‌ర్స్ కోర్సుల్లో చేరేందుకే విద్యార్థులు సుముఖ‌త చూపించడం విశేషం. మొత్తం 33,251 మంది విద్యార్థులు కామ‌ర్స్ కోర్సుల‌ను ఎంపిక చేసుకున్నారు. సీట్లు పొందిన విద్యార్థుల జూన్ 16 నుంచి 25 వరకు సంబంధిత కళాశాలల్లో ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
సీట్ల కేటాయింపు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..