IITD: ఐఐటీ ఢిల్లీలో పీహెచ్‌డీ, ఎంఎస్‌ (రిసెర్చ్‌) ప్రోగ్రామ్స్ - కోర్సుల వివరాలు ఇలా

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దిల్లీ- 2023-2024 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ, ఎంఎస్‌ (రిసెర్చ్‌) ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Continues below advertisement

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దిల్లీ- 2023-2024 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ, ఎంఎస్‌ (రిసెర్చ్‌) ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. కోర్సును అనుసరించి డిగ్రీ, పీజీ, గేట్/ సీఎస్‌ఐఆర్‌/యూజీసీ/నెట్‌/ఐకార్‌/ఐసీఎంఆర్‌/ డీఎస్‌టీ- ఇన్‌స్పైర్‌ ఫెలోషిప్ తదితరాల్లో ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. అక్టోబరు 27 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది.

Continues below advertisement

వివరాలు..

1) పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు

విభాగాలు: అప్లయిడ్ మెకానిక్స్, బయోకెమికల్ ఇంజినీరింగ్ & బయోటెక్నాలజీ, సివిల్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, డిజైన్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్, మెటీరియల్స్ సైన్స్ & ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఫిజిక్స్, టెక్స్‌టైల్ & ఫైబర్ ఇంజినీరింగ్. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. 

2) ఎంఎస్‌ (రిసెర్చ్‌) ప్రోగ్రామ్‌

విభాగాలు: అప్లయిడ్ మెకానిక్స్, అట్మాస్ఫియరిక్ & ఓషనిక్ సైన్సెస్, ఆటోమోటివ్ రిసెర్చ్ అండ్ ట్రైబాలజీ, ట్రాన్స్‌పొర్టేషన్ సేఫ్టీ & ఇంజురి ప్రివెన్షన్, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎనర్జీ సైన్స్ & ఇంజినీరింగ్, మెటీరియల్స్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, సెన్సార్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ & సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ ఇంజినీరింగ్, అమర్‌నాథ్ & శశి కోస్లా స్కూల్ ఆఫ్ ఐటీ, భారతీ స్కూల్ ఆఫ్ టెలికామ్ టెక్నాలజీ & మేనేజ్‌మెంట్, కుసుమా స్కూల్ ఆఫ్ బయోలాజికల్ సైన్సెస్, మెషిన్ ఇంటెలిజెన్స్ & డేటా సైన్స్, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్ టూల్స్ & టెక్నాలజీ. 

అర్హత: ప్రోగ్రామ్‌ అనుసరించి డిగ్రీ, పీజీ, గేట్/ సీఎస్‌ఐఆర్‌/ యూజీసీ/ నెట్‌/ ఐకార్‌/ ఐసీఎంఆర్‌/ డీఎస్‌టీ- ఇన్‌స్పైర్‌ ఫెలోషిప్ తదితరాల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.50 చెల్లించాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

ముఖ్య తేదీలు...

➥ ఆన్‌లైన్ దరఖాస్తు, దరఖాస్తు రుసుము చెల్లింపు చివరి తేదీ: 27.10.2023.

➥ పరీక్ష/ ఇంటర్వ్యూ తేదీలు: 01 - 12.12.2023 వరకు.

➥ ఓరియంటేషన్ తేదీ: 30.12.2023.

➥ తరగతుల ప్రారంభం: 01.01.2024.

Notification

Information Brochure

Online Application

ALSO READ:

ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సులు, ప్రవేశాలు ఇలా
గుంటూరులోని ఆచార్య ఎన్.జి. రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ, 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. పీజీ కోర్సులకు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సులకు సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ అర్హత ఉన్నవారు అర్హులు. ఈ కోర్సుల ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 13న ప్రారంభంకాగా.. నవంబరు 3 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పీజీ కోర్సులకు డిగ్రీ మార్కులు, ఏఐఈఈఏ (ఐకార్‌) స్కోరు; పీహెచ్‌డీ కోర్సులకు డిగ్రీ, పీజీ మార్కులు, ఏఐసీఈ (ఐకార్‌) స్కోరు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.1500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.750 చెల్లిస్తే సరిపోతుంది.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..

నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీలో పీజీడీఎం ప్రోగ్రామ్, ఈ అర్హతలుండాలి
పుణెలోని నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ, 2024 విద్యా సంవత్సరానికి పీజీడీఎం ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు క్యాట్‌, ఎక్స్‌ఏటీ, సీమ్యాట్‌ అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. విద్యార్హతలు, పని అనుభవం, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

Continues below advertisement